Home / పోరు బాట / ప‌వ‌న్ ఫోబియాతో అట్ట‌డుకుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. పాల‌కుల్లో సేన స‌భ గుబులు..

ప‌వ‌న్ ఫోబియాతో అట్ట‌డుకుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. పాల‌కుల్లో సేన స‌భ గుబులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ఉద్య‌మిస్తున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 10న అనంత వేదిక‌గా పాల‌కుల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు రెడీ అయ్యారు.. సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భపై ఇలా ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో., సేనాని పిలుపు కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న జ‌న‌సైన్యం క‌థ‌న‌రంగానికి క‌దిలింది.. త‌మ సేనాని స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా పాల‌కుల‌కు మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసేందుకు స‌మాయ‌త్తం అయ్యింది.. ఓ మంచి ఉద్దేశంతో., రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క పౌరుడికీ న్యాయం జ‌ర‌గాల‌న్న ఆశ‌యంతో ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న ఈ పోరులో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌వ‌కుండా పార్టీ వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తుంటే., అటు దేవుడి స‌హ‌కారం కోరుతూ ఊరూరా, వాడ‌వాడ‌లా ప‌వ‌న్‌సైన్యం స‌ర్వ‌మ‌త ప్రార్ధ‌న‌లు మొద‌లు పెట్టింది.. ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా ప‌వ‌న్ అభిమానుల సంద‌డే క‌న‌బ‌డుతోంది.. జ‌న‌సైన్య స‌మూహాల్ని చూసి., పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.. ప‌వ‌న్ సైన్యంలో ఓ కులానికో, మ‌తానికో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం., ఉన్న‌వారంతా సామాన్యులే కావ‌డంతో., ప‌వ‌న్‌ని ఆప‌డానికి త‌మ శ‌క్తి స‌రిపోద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఒక్క‌రు..ఇద్ద‌రై, ఇద్ద‌రు..ముగ్గురై, ముగ్గురు..మూడు కోట్ల మందై అన్న‌ట్టుగా ప‌వ‌న్ అభిమానం వేళ్లూనుకుంటున్న తీరు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది..

జ‌న‌సేనాని బ‌రిలోకి దిగితే తాము నిల‌బ‌డ‌లేమ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన ప్ర‌త్య‌ర్ధులు., ఇప్పుడు సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్నారు.. ఇవాల్టికి ప‌వ‌న్ మ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోతే చాల్లే అని స‌రిపెట్టుకుంటున్నారు.. ప‌వ‌న్ గురించి ఆఫ్ ద రికార్డ్ అవాకులు చెవాకులు పేలుతున్నా., బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసే ప్ర‌య‌త్నం మాత్రం ఎవ‌రూ చేయ‌డం లేదు..

ఇప్ప‌టికే ఏపీ నుండి చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దాదాపు అన్ని పార్టీల‌కు అనంత స‌భ టెన్ష‌న్ ప‌ట్టుకుంది.. కాకినాడ‌లో హోదా విష‌యంలో డ‌బుల్ గేమ్ ఆడుతూ జ‌నాన్ని మోసం చేస్తున్న నేత‌లంద‌రిపై నిప్పులు చెరిగిన ఆయ‌న‌., అనంత‌లో ఎవ‌రిపై ప‌డ‌తారోన‌న్న భ‌య‌మే అందుకు కార‌ణం. టీడీపీ, సిఎంల‌ను ప‌వ‌న్ ఎందుకు విమ‌ర్శించ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్న నేప‌ధ్యంలో., అనంత వేదిక నుంచి ఆ ప్ర‌శ్న‌కు బ‌దులు దొరికుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.. ప‌వ‌ర్‌స్టార్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదా..? వారి త‌ప్పులు ఎండ‌గ‌ట్ట‌డం లేదా..? త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌ట‌మంటే., ప్ర‌భుత్వంపై పోరాడ‌టం కాదా..? అన్న స‌మాధానాలు విన‌బ‌డుతున్నాయి.. మొత్తం మీద అటు అభిమానులను., ఇటు రాజ‌కీయ‌నాయ‌కుల్ని కూడా ప‌వ‌న్ ఫోబియా ఆవ‌హించేసింది..

Share This:

1,425 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − six =