Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌న్ విమ‌ర్శ‌కులారా ఇక వెయ్యండి.. మీ నోళ్లకు తాళాలు..

ప‌వ‌న్ విమ‌ర్శ‌కులారా ఇక వెయ్యండి.. మీ నోళ్లకు తాళాలు..

img-20170103-wa0171

ఆయ‌న‌ ఎదుటివాడికి క‌డుపు నిండా అన్నం పెట్టినా త‌ప్పే.. జ‌నం క‌ష్టాలు తీర్చేందుకు పోరాడినా త‌ప్పే.. ఆ అన్నం ఏ లాభం కోసం పెట్టాడో అని విమ‌ర్శిస్తారు… ఆ పోరాటంలో ఏదో ల‌బ్ది ఉందంటూ నానా అర్ధాలు వెతుకుతారు.. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చుట్టూ ఉన్న ప‌రిస్థితి ఇది.. ఆ విమ‌ర్శంచే ఏ ఒక్క‌రూ., ఓ మ‌నిషికి కూడా త‌మ చేత్తో నాలుగు మెతుకులు రాల్చ‌రు.. ప్ర‌జ‌ల పాట్లు వారికి ప‌ట్ట‌వు.. ఎవ‌రైనా ప‌ట్టించుకుంటే మాత్రం త‌ట్టుకోలేరు.. జ‌న‌సేనాని బ‌య‌టికి వ‌చ్చిన ప్ర‌తిసారీ చెబుతూనే ఉన్నారు.. త‌న పోరాటం ప‌వ‌ర్ కోసం కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మేన‌ని.. అయినా వారికి భ‌యం., ఎక్క‌డ తాము ఉనికి కోల్పోతామోన‌ని.. అందుకే రోజు రోజుకీ తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌భ‌ల‌శ‌క్తిగా అవ‌త‌రిస్తున్న జ‌న‌సేనుడ్ని చూస్తే వారికి జ‌ల‌సీ.. ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా., స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న విజ‌యం సాధించిన‌ప్పుడ‌ల్లా.. త‌మ నోటికో., లేక త‌మ అనుంగ మీడియాకో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించే ప‌నిచెబుతారు.. అసంద‌ర్బోచితంగా త‌మ నోటికి వ‌చ్చింద‌ల్లా మాట్లాడి., ప‌వ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాలు చేస్తారు..

6-14709031181

ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేసే ప్ర‌తి అడుగు బ‌దులిస్తూనే ఉంది.. రాజ‌కీయాలు తెలియ‌ద‌న్నారు.. పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్ అన్నారు.. అనుభ‌వం లేద‌న్నారు.. అవ‌గాహ‌నా రాహిత్య‌మ‌న్నారు.. కానీ జ‌న‌సేనాని బ‌య‌టికి వ‌చ్చిన ప్ర‌తిసారీ ఏదో ఒక స‌మ‌స్య నుంచి జ‌నాన్ని ఒడ్డుకి చేరుస్తూనే ఉన్నారు.. సామాన్యుడికి త‌న‌వంతు సాయం చేస్తూనే ఉన్నారు.. అందుకే స‌మ‌స్య ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ., ఆయ‌న గ‌డ‌పే ఎక్కుతున్నారు.. ఎవ్వ‌రూ ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌డం లేదు.. విప‌క్షాన్నీ న‌మ్మ‌డం లేదు.. ప‌వ‌న్ త‌మ త‌రుపున పోరాడుతానంటే చాల‌నుకుంటున్నారు.. విమ‌ర్శ‌లు చేసేవారంతా వారి అనుభ‌వంలో., వారి రాజ‌కీయ జీవితంలో ఎనాడైనా ఇలాంటి న‌మ్మ‌కాన్ని జ‌నంలో క‌లిగించ గ‌లిగారా..? ఓ సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోండి..

img-20170116-wa0085

హార్వార్డ్ ఆహ్వానం అయినా మీ క‌ళ్లు తెరిపించాల‌ని.. ఆయ‌న‌పై మీ కుళ్లును క‌రిగించాల‌ని కోరుకుంటున్నాం.. మీ క‌ళ్ల‌ను బూత‌ద్దాల్లా చేసుకుని మ‌రీ ఒక్క‌సారి ఇండియ‌న్ కాన్ఫ‌రెన్స్ జ‌న‌సేనాని ఆహ్వానానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న చూడండి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఓ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌నాలిటీగా అమెరికాలోని ఆ ప్ర‌ఖ్యాత యూనివ‌ర్శిటీ వారు గుర్తించారు.. అక్క‌డ చ‌దివే భార‌తీయ విద్యార్ధుల‌కి ప‌వ‌న్ ప్ర‌సంగం ఓ దిక్సూచిగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించారు.. 2014లో జ‌న‌సేనను స్థాపించిన నాటి నుండి ఓ స‌రికొత్త స‌మాజ స్థాప‌న‌కు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని ఇండియ‌న్ కాన్ఫ‌రెన్స్ ప్ర‌స్థావించింది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసే ప్ర‌తి ప‌నీ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉంద‌ని న‌మ్మింది.. ఈ సూప‌ర్ ప‌ర్స‌నాలిటీ విద్యార్ధుల‌కి స‌రైన దిశా నిర్ధేశం గావించ‌గ‌ల‌ర‌న్న న‌మ్మ‌కంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంది నుంచి ఆయ‌న్ని ఎంపిక చేసుకుంది..

ఇంకోమాట‌.. హార్వార్డ్ ఆహ్వానం డ‌బ్బు ఖ‌ర్చు పెడితేనో., ఎవ‌ర్న‌యినా మేనేజ్ చేస్తేనో దొర‌క‌దు.. ఒక గుర్తింపు ఉంటేనే ల‌భిస్తుంది.. ఆ గుర్తింపు ప‌వ‌న్‌పై విమ‌ర్శలు చేసే ఏ ఒక్క‌రూ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.. ప్ర‌జ‌లు ఇస్తే చాలు., ప్ర‌పంచం ఇస్తే చాలు.. ఈ రెండూ జ‌న‌సేనుడికి ద‌క్కాయ‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని కూడా లేదు.. మ‌రి ఇంకాఆ ఎందుకు ఆల‌స్యం.. ప‌వ‌న్ విమ‌ర్శ‌కులారా వెయ్యండి.. మీ నోళ్ల‌కు తాళాలు..

Share This:

3,330 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × two =