Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌న్ శ‌ర‌ణం గ‌చ్చామి.. అదే స‌ర్కారుకి శ్రీరామ ర‌క్ష‌..

ప‌వ‌న్ శ‌ర‌ణం గ‌చ్చామి.. అదే స‌ర్కారుకి శ్రీరామ ర‌క్ష‌..

web_sample_white_reg_large

48 గంట‌లు.. ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వానికి జ‌న‌సేనాని పెట్టిన డెడ్ లైన్‌.. మ‌రి ప‌వ‌న్ పెట్టిన గ‌డువులోపు స‌ర్కారు స్పందిస్తుందా..? ప‌వ‌న్ క‌ల్పించుకున్న అన్ని స‌మ‌స్య‌ల‌కీ ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేసిన స‌ర్కారు.. ఉద్దానం బాధితుల వేద‌న‌ను తీరుస్తుందా..? వేల సంఖ్య‌లో ఉన్న కిడ్నీ రోగుల‌ను ఆదుకునే చ‌ర్య‌లు సాధ్య‌మా..? ప‌్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే అయినా., జ‌వాబు లేనివేమీ కాదు.. స‌మ‌స్య తీవ్ర‌మైన‌దే అయినా., ప‌రిష్కారం లేనిది మాత్రం కాదు..

pawan-viazag-tour-details

img_9298-copy

మ‌రి రెండు ద‌శాబ్దాలుగా 20 వేల మంది ప్రాణాలు బ‌లితీసుకున్న ఉద్దానం నెఫ్రోప‌తి., కొన్ని వేల మందిని వేధిస్తున్న ఈ స‌మ‌స్య అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు స్థానిక నేత‌ల‌కు గాని., ప్ర‌భుత్వాల‌కు గాని స‌మ‌స్య‌గా క‌న‌బ‌డ‌లేదు.. ఈ ప్ర‌శ్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఆ ప్రాంతానికి తీసుకువ‌చ్చింది.. వాస్త‌వానికి గ‌త నెల‌లోనే ప‌వ‌న్ ఇక్క‌డికి రావాల్సి ఉన్నా., అది వాయిదా ప‌డింది.. ఈ లోపే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగేసి., డ‌యాల‌సిస్ సెంట‌ర్లు అంటూ హ‌డావిడి చేసేశారు.. అంటే జ‌న‌సేనాని వ‌స్తున్నాడ‌నే వార్తే స‌ర్కారులో క‌ద‌లిక తెచ్చేసింది.. అయితే అది స‌రైన తీరుగా లేదు.. ప‌వ‌న్‌తో స్టేజీ పంచుకున్న డాక్ట‌ర్లు చెప్పిన‌ట్టు డ‌యాల‌సిస్ అనే పెద్ద మాట‌తో ఇక్క‌డ అవ‌స‌రం త‌క్కువే.. అంటే ఇక్క‌డ అతిపెద్ద స‌మ‌స్య ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తుంద‌ని తెలిసినా., ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌కులు దానిపై స‌రైన అధ్య‌య‌నం చేయ‌లేద‌న్న‌ది అర్ధం అవుతోంది..

img-20170103-wa0077

వ్యాధి ఆరంభ ద‌శ‌లో ఉన్న‌వారికి స‌రైన మందులు స‌ర‌ఫ‌రా చేయ‌డం., ప్ర‌తి ఒక్క‌రికీ ర‌క్షిత మంచినీరు స‌ర‌ఫ‌రా చేయ‌డం వంటి చిన్న‌పాటి చ‌ర్య‌లు ఉద్దానం బాధితుల‌కి పెద్ద ఉప‌స‌మ‌నాన్ని ఇస్తాయి.. దీంతో పాటు వ్యాధితో బాధ ప‌డుతున్న వారికి ఆర్ధిక సాయం కూడా అందించాలి.. ఇప్ప‌టికే వ్యాధి భారిన ప‌డి మృతి చెందిన బాధితుల పిల్ల‌లు చాలా మంది అనాధ‌లుగా కాలం వెళ్ల దీస్తున్నారు.. వారికి త‌క్ష‌ణ సాయం ప్ర‌క‌టించాలి.. రాష్ట్ర ఆరోగ్య‌శాఖ బ‌డ్జెట్ ఆరు వేల కోట్ల‌లో త‌క్ష‌ణ సాయంగా 100 కోట్లు ఉద్దానంకి కేటాయించాలి.. ఇవి జ‌న‌సేనాని డిమాండ్లు.. ఆయ‌న చెప్పిన‌ట్టు పుష్క‌రాల‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెట్టిన ప్ర‌భుత్వానికి ఇది పెద్ద లెక్క కూడా కాదు.. కాబ‌ట్టి ఈ స‌మ‌స్య కూడా ప‌రిష్కారం వైపు స‌ర్కారు అడుగులు వేయ‌డ‌మే సేఫ్ గేమ్‌..

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కి ముందు వెట‌కారంగా మాట్లాడిన ఆరోగ్య‌మంత్రి కామినేని., ఆయ‌న సూచ‌న‌లు విన్న త‌ర్వాత విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ చూస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి సంధికే ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతోంది.. ఐదు మండ‌లాల్లో హాస్పిట‌ల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య త‌నికీలు, నీటి శాంపిల్స్ ఢిల్లీ ల్యాబ్‌కి పంప‌డం., ఉచితంగా మందుల పంపిణీ., ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఆర్ధిక సాయం., అన్నీ జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌ల‌తో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టుగానే అర్ధ‌మ‌వుతోంది.. అయితే ప్ర‌భుత్వ స్పంద‌న ప‌వ‌న్ పెట్టిన డెడ్‌లైన్‌లోపు అధికారికంగా వెలువ‌డాల్సి ఉంది..

 

Share This:

2,208 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

One comment

  1. Jai janasena, from manikyalarao tatipakala janasena party active member visakhapathanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 3 =