Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ప‌వ‌ర్‌(న్‌) పంచ్ నంబ‌ర్ త్రీ.. దేశ‌భ‌క్తి అంటే ఏంటంటే..

ప‌వ‌ర్‌(న్‌) పంచ్ నంబ‌ర్ త్రీ.. దేశ‌భ‌క్తి అంటే ఏంటంటే..

01 02 03

ట్విట్ట‌ర్ ద్వారా వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో బీజేపీ స‌ర్కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.., త‌న మూడో అస్త్రాన్ని సంధించారు.. ముందుగా త‌న ఉద్దేశంలో దేశ‌భ‌క్తికి అర్ధం చెప్పారు.. కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత, భాషా భేదాలు లేకుండా దేశంలోని ప్ర‌తి పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకి న‌డ‌వ‌డ‌మే అస‌లైన దేశ‌భ‌క్తి అని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. దేశభ‌క్తి ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌రాద‌ని సూచించారు.. దేశ‌భ‌క్తి మ‌నిషిలో పాతుకుపోయిన మాన‌వ‌తా విలువ‌ల‌తో కూడి ఉండే అంశ‌మ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు..

దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌పై త‌న ఆవేధ‌న‌ను వ్య‌క్త ప‌రిచారు.. మ‌న లాంటి ప్ర‌జాస్వామ్య దేశంలో అధికార పార్టీ విధానాల‌ను ఎవ‌రైనా విబేధించినంత మాత్రాన‌., దేశ‌భ‌క్తి లేన‌ట్టుకాద‌న్నారు ప‌వ‌న్‌.. త‌మ‌కు ఎవ‌రైనా వ్య‌తిరేకంగా గ‌ళం విప్పితే., వెంట‌నే వారిని దేశ‌ద్రోహులుగా చిత్రిస్తారా అని ప్ర‌శ్నించారు.. ఎవ‌రు ఏం మాట్లాడినా., మొద‌ట దాన్ని సావ‌ధానంగా విన‌డం నేర్చుకోవాలి.. ఆ త‌ర్వాతే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రానికి సూచించారు.. కొన్ని నెల‌ల క్రితం ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్ధుల వ్య‌వ‌హార‌మే ఇందుకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ అని జ‌న‌సేనాని చెప్పారు.. త‌మ‌కు వ్య‌తిరేకుల‌ని భావించిన జెఎన్‌యూ విద్యార్ధుల్ని దేశ‌ద్రోహులుగా చిత్రించే ప్ర‌య‌త్నం చేశార‌ని., ఆ త‌ర్వాత వారు ఆ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని రుజువైంద‌ని స్ప‌ష్టం చేశారు..

04 0605

 

నీతులు ఎదుటివారికి చెప్పేందుకేనా అన్న చందంగా దేశంలో ప‌రిస్థితులు త‌యార‌య్యాయ‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. సాయంత్రం స‌ర‌దాగా ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే., అక్క‌డ దేశ‌భ‌క్తికి ప‌రీక్ష అవ‌స‌ర‌మా అని జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు.. మీరు పెడుతున్న రూల్స్‌పై మీకు చిత్త‌శుద్ది ఉంటే ముందుగా మీరు పాటించాల‌ని సూచించారు.. రాజ‌కీయ పార్టీల మీటింగ్‌ల‌ను జాతీయ గీతంతో ఎందుకు ప్రారంభించ‌వ‌న్నారు.. రూల్స్ ముందు మీరు పాటించి., ప్ర‌జ‌ల్లో స్ఫూర్తిని నింపాల‌ని డిమాండ్ చేశారు..

ఫైన‌ల్‌గా ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా ఓ అమెరిక‌న్ ఎకాన‌మిస్ట్ చెప్పిన పాయింట్‌ను ఉద‌హ‌రించారు.. లా ఎలా ఉందంటే నిజాయితీగా ఉన్న‌వారిని ట్రాప్ చేసి., దోపిడి దొంగ‌ల‌కి ఆఫ‌ర్లు ఇచ్చిన చందంగా త‌యారైంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు..

ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశానికి సంబంధించి స్పందించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు..

 

Share This:

1,335 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 6 =