Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌ర్‌స్టార్ పూర్తిస్థాయి రాజ‌కీయాలు ఎప్ప‌టి నుంచి..?

ప‌వ‌ర్‌స్టార్ పూర్తిస్థాయి రాజ‌కీయాలు ఎప్ప‌టి నుంచి..?

జ‌న‌సేన పార్టీతో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., పూర్తి స్థాయిలో క్రియాశీల‌క రాజ‌కీయ‌ల్లో ఎప్ప‌టి నుంచి ఉంటారు..? జ‌నంలోకి ఎప్ప‌టి నుంచి వ‌స్తారు..? 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే పార్టీ కేడ‌ర్‌ని ఎప్పుడు నిర్మిస్తారు..? ఇలాంటి అంశాల‌పై ఓ పేరు మోసిన ఆంగ్ల ప‌త్రిక ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.. ఇందులో రాసిన ప్ర‌తి అక్ష‌రం స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటి నుంచి వ‌చ్చాయా అన్న చందంగా ఆ క‌థ‌నం ఉంది.. ఇంకో ఏడాది త‌ర్వాత అంటే 2018 నుంచి ప‌వ‌న్ పూర్తి స్థాయి పాలిటిక్స్ చేస్తాడు అన్న‌ది ఆ క‌థ‌నం సారాంశం.. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఏం చేస్తారు..? అంటే దానికి బ‌దులిచ్చారు.. త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూనే., తాను నిల‌బెట్టిన టీడీపీ ప్ర‌భుత్వంతో సంబంధాలు కొన‌సాగిస్తారంట‌..

ఈ క‌థ‌నంపై చాలా ధ‌ర్మ సందేహాలు వెలువ‌డ్డాయి.. పూర్తి స్థాయిలో పాలిటిక్స్ చేయ‌డం అంటే ఏంటి..? నిత్యం మీడియాకు ఏదో ఒక వార్త‌తో హాట్ కేక్ అవ్వ‌డ‌మా..? లేక నిత్యం ప్ర‌త్య‌ర్ధుల‌పై కామెంట్లు, సెటైర్ల‌తో.. ఒక‌టి అని రెండు అనిపించుకోవ‌డ‌మా..? జ‌న‌సేనానికి తెలిసినంత వ‌ర‌కు ఆయ‌న ప్ర‌స్తుతం పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోనే ఉన్నారు.. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్న పూర్తి స్థాయి పొలిటీషియ‌న్‌గానే రిసీవ్ చేసుకుంటున్నారు.. పార్టీ స్థాపించిన నాటి నుండి ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా స్పందిస్తున్నారు.. త‌న అవ‌స‌రం ఉంద‌న్న‌ప్పుడు జ‌నంలోకి వ‌స్తున్నారు.. ఆయ‌న పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రాకుండా., టీడీపీ స‌ర్కారుని ఎలా గ‌ద్దెనెక్కించారు.. ప‌వ‌ర్‌స్టార్ ఉద్దేశ్యంలో నాయ‌కుడు అంటే నిత్యం ప‌ద‌వులు ప‌ట్టుకుని వేళ్లాడేవాడు కాదు.. ప‌ద‌వుల కోసం పాకులాడేవాడు అంత కంటే కాదు.. ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు స్పందించే వాడు మాత్ర‌మే.. జ‌నం కోరుకుంటుంది కూడా అలాంటి లీడ‌ర్‌నే.. జ‌నానికి తాను సాయం చేయ‌గ‌లిగినంత అవ‌స‌రం లేన‌ప్పుడు., ఆయన బ‌య‌టికి రావ‌డం ఎందుకు..? జ‌నాన్ని ఇబ్బంది పెట్ట‌డం ఎందుకు..? నేను మీతోనే ఉన్నాన‌న్న భావ‌న జ‌నంలో క‌లిగిస్తే చాలు.. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న‌కి చెప్పుకునే ధైర్యం ప్ర‌జ‌ల‌కి ఉంటుంది.. దాని ప‌రిష్కారానికి కావ‌ల‌సిన మార్గాలు అన్వేషిస్తారు.. ప‌వ‌ర్‌స్టార్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దేశంలో ఇవే రాజ‌కీయాలు.. వంచ‌న‌లు, మోసాలు, మాయ‌లు ఆయ‌న‌కి ఏ మాత్రం తెలియ‌వు.. త‌నకు తాను పార్టీ స్థాపించిన నాటి నుంచి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లో ఉన్నాన‌నే భావిస్తున్నారు.. ప్ర‌జ‌లు కూడా అలాగే ఫీల‌వుతున్నారు..

ఇక ప్ర‌భుత్వంతో సంబంధాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న చేస్తున్న పోరాటం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేస్తున్న‌దే.. ఈ పోరు కేంద్రానికే కాదు., టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా మింగుడు ప‌డ‌డం లేదు.. అయితే ఇక్క‌డ సానుకూల‌మ‌ని చెప్పుకునే ఏకైక అంశం., ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కి ఏ స‌మ‌స్య వ‌చ్చినా దానిపై వెంట‌నే స‌ర్కారు స్పందించ‌డం.. ఇది ప‌వ‌న్ పార్టీని గెలిపించాడ‌న్న గౌర‌వ‌మో., లేక ఆయ‌న బ‌య‌టికి వ‌స్తే ఆప‌లేమ‌న్న భ‌య‌మో కూడా అయి ఉండోచ్చు.. దీన్ని చిల‌వ‌లు ప‌లువ‌లు చేస్తే., అది ఎంత వ‌ర‌కు క‌రెక్టోమీ విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి..

మూడో అంశం కేడ‌ర్ నిర్మాణం.. జ‌న‌సేన‌కి కేడ‌ర్ లేదా..? ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే పిచ్చి ప్ర‌శ్న‌.. ప‌వ‌ర్‌స్టార్ అభిమానులే ఆయ‌న పార్టీకి ఉన్న అత్యంత బ‌ల‌మైన కేడ‌ర్‌, సైన్యం.. వీరు త‌మ సేనాని కోసం ఎప్పుడు, ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు.. కాకినాడ దెబ్బ‌కే పాల‌కులు అయోమ‌యంలో ప‌డ్డారు.. గురువారం అనంత స‌భ‌లో జ‌న‌సైన్యం పూర్తి స్థాయిలో స‌త్తా చాటితే., ఈ కేడ‌ర్ లేద‌నే జ‌న‌మంతా ఏమైపోతారో ఏమో.. ఓ సారు జ‌న‌సేనాని పాలిటిక్స్‌కి సంబంధించి మీకు కొంతైనా స్ప‌ష్ట‌త.., మీ భాష‌లో క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా.. అయితే ఓకే..

Share This:

1,425 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − fifteen =