Home / ఎడిటోరియల్స్ / ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

pawan2

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కి ఈ పేరు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. అయితే పేరులోనే ప‌వ‌ర్ నింపుకుని తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ పేజీ లిఖించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయారంగేట్ర‌మే జ‌న‌సేన ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హాట్ టాపిక్‌.. ప‌వ‌న్ పార్టీ ఎందుకు పెట్టారు..? ఆయ‌న పోరాటం ఎవ‌రిపైనా..? ఆయ‌న ప్ర‌శ్న‌ల్లో స్ప‌ష్ట‌త ఎంత‌..? అస‌లు జ‌న‌సేనాని ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా..?  చేయ‌ద‌లుచుకుంటే నిర్మాణం ఎక్క‌డ‌..? ఓ వైపు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ, మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కి ఎలా రెడీ అవుతారు..? ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల్లో కొన‌సాగుతున్న చ‌ర్చ ఇది.. ఈ చ‌ర్చ‌కు స‌మాధానం కావాలంటే ముందుగా జ‌న‌సేనాని అంత‌రంగం తెలుసుకోవాలి.. ప‌వ‌న్ యోగా..?  భోగా..?  రాజా..?  సైనికుడా..?  సేవ‌కుడా..? ప‌వన్ అంత‌రంగంలో ఇలాంటి ఊహ‌ల‌కి అస‌లు తావేలేదు.. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న క‌డుపుని చూస్తే ఆయ‌న‌కు ఆక‌లి చ‌చ్చిపోతుంది.. ఎదుటి వాడి ఆక‌లే త‌న ఆకలిగా ఆయ‌న భావించ‌డ‌మే అందుకు కార‌ణం.. అలా ఒక‌రు లేక ఇద్ద‌రు మాహా అయితే  త‌న‌కు ఉన్న సామ‌ర్ధ్యంలో ఓ వంద‌, వెయ్యిమంది ఆక‌లి తీర్చ‌గ‌లం.. మ‌రి రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా నిత్యం ఆక‌లితో అలమ‌టిస్తున్న వారి ప‌రిస్థితి ఏంటి అన్న ఆలోచ‌నే ప‌వ‌నిజం.. ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తీర్చ‌డం ఎలా అన్న ఆలోచ‌న నుంచి పుట్టిందే జ‌న‌సేన‌.. అందుకోసం ఒక‌రిపై ఆధార‌ప‌డ‌టం కాదు. ఓ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌న్న ల‌క్ష్యంతో పుట్టిన వాడే జ‌న‌సేనాని.. తెలుగు ప్ర‌జ‌ల గుండేల్లో ప‌వ‌ర్‌స్టార్ రారాజే అయినా., త‌న‌కు తాను మాత్రం జ‌నాన్ని కాపాడే సేనానిగానే మ‌ల‌చుకున్నాడు.. కాసుల కోసం త‌న్నుకునే కుటిల రాజ‌కీయాలతో ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేంటి..?  పేప‌ర్ల‌పై కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చుగా క‌న‌బ‌డుతున్న ప్ర‌జాద‌నం ఎవ‌రి ఖ‌జానాలోకి చేరుతోంది..?  పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న ప్ర‌జ‌ల‌కు అందించ‌లేమా అన్న‌దే ఆయ‌న మ‌దిలో మెదిలిన ప్ర‌శ్న‌.. ఆ ప్ర‌శ్న‌కు జ‌వాబుగానే ప్ర‌జ‌ల‌కు పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ, వారి త‌రుపున పోరాడుతూ పాల‌కుల్ని నిల‌దీస్తూనే ఉన్నాడు.. త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నిస్తూనే ఉన్నాడు.. ఇక సినిమాలు-రాజ‌కీయాలు రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం సాధ్య‌మా అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌..?  అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సామ‌ర్ధ్యం గురించి ఎరిగిన వారికి మాత్రం అస‌లు ఇది ప్ర‌శ్నే కాదు. మీటింగులు పెడితేనో, నిత్యం జ‌నం మ‌ధ్య‌న తిరిగితేనో మాత్ర‌మే ఓట్లు రాల‌తాయ‌న్న ప‌ద్ద‌తిలో మార్పు తీసుకు రావాల‌న్న‌ది ఆయ‌న అంత‌రంగం.. త‌న ఉద్దేశం ఏంటి..?  జ‌నానికి తాను ఏం చేయ‌ద‌లుచుకున్నారు..?   దాని వ‌ల్ల వ‌చ్చే లాభ‌నష్టాలు ఏంటి అన్న‌ది ప్ర‌తి ఒక్క ఓట‌రుకీ చెప్పి.. అందుకు ఓటు వేసే ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రిస్తేనే ముందుకి వెళ్లాల‌న్న‌ది ఆయ‌న సిద్ధాంతం.. ఇది స‌క్సెస్ అవుతుందా ..?  లేదా అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీకి క్లాప్ కొట్ట‌డం, టైటిల్స్ ప‌డ‌టం వ‌ర‌కు మాత్ర‌మే కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.. అస‌లు బొమ్మ ప‌డితే గాని అంద‌రికీ అస‌లు సినిమా క‌న‌బ‌డుతుంది..

Share This:

1,541 views

About Admin

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × two =