Home / జన సేన / ప‌వ‌ర్ ఆఫ్ ప‌వ‌నిజం.. ఓ అభిమాని కోసం మ‌రో అభిమాని త‌ల్లిదండ్రుల సాయం..!

ప‌వ‌ర్ ఆఫ్ ప‌వ‌నిజం.. ఓ అభిమాని కోసం మ‌రో అభిమాని త‌ల్లిదండ్రుల సాయం..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల్లో ర‌గిల్చిన స్ఫూర్తి., ఎన్నో ప్రాణాల్ని నిల‌బెట్టింది.. మ‌రెన్నో జీవితాల్లో వెలుగు రేఖ‌లు ప్ర‌స‌రింప చేసింది. ప్రాణం పోయినా మ‌నం వుండాలి అన్న ప‌వ‌న్ ఇజం.. ఒకే ఒక్క అభిమాని ఉసురు తీసింది.. ఆ దారుణం జ‌న‌సేనానిని సైతం క‌దిలించింది.. అత‌ని జీవితం అంత‌టి స్ఫూర్తి మంతం కావ‌డానికి కార‌ణం ఏంటి..? అనే స్టోరీ లైన్‌తో.. వినోద్ రాయ‌ల్ ద ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరిట మ‌రో అభిమాని ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు.. అవ‌య‌వ‌దానం ప్రాధాన్య‌త‌నీ., ప‌వ‌న్ ఫ్యాన్ అంటే ఎలావుంటారో చాటుతూ సాగే క‌థ‌నం.. సాక్ష్యాత్తు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని సైతం క‌ట్టిపాడేసింది.. సుమారు 30 నిమిషాల నివిడి గ‌ల వినోద్ రాయ‌ల్ స్టోరీని నిల్చున్న చోట నుంచి క‌ద‌ల కుండా జ‌న‌సేనాని వీక్షించారు..

మ‌రో అభిమానికి వినోద్ రాయ‌ల్ త‌ల్లిదండ్రుల భ‌రోసా..!
వాస్త‌వానికి వినోద్ రాయ‌ల్ మృతి త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌ధ్యంలో., చితికిపోయిన అత‌ని త‌ల్లిదండ్రులు జ‌న‌సేనుడు ఇచ్చిన ధైర్యంతోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు.. అలాంటి ప‌రిస్థితుల్లో మ‌రో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమాని., శ‌రీరంలో ఓ అంగాన్ని కోల్పోయిన అత‌ను(స‌తీష్ చందా) వినోద్ స్టోరీని తెర‌కెక్కించాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని వారి ముందుంచాడు.. వినోద్ రాయ‌ల్ పేరిట ఓ షార్ట్ ఫిల్మ్ తీసి., దానిపై వ‌చ్చిన మొత్తంతో కోల్పోయిన త‌న చేతికి ఆప‌రేష‌న్ చేయించుకుంటానంటూ విజ్ఞ‌ప్తి చేశాడు.. ముందుగా విముఖ‌త వ్య‌క్తం చేసినా., చ‌నిపోయిన త‌ర్వాత అవ‌యవ‌దానంతో ఒక‌రికి చూపు తెప్పించిన త‌మ కుమారుడు., ఇప్పుడు మ‌రో ప‌వ‌న్ అభిమానికి ప‌రోక్షంగా స‌హాయ‌ప‌డుతాడ‌ని తెలిసి స‌రే అన్నారు.. ఒంటి చేత్తో చందా స‌తీష్ పెద్ద మొత్తం ఖ‌ర్చు పెట్టి మ‌రీ వినోద్ రాయ‌ల్ ద ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరిట షార్ట్ ఫిల్మ్ తీశాడు.. దాన్ని యూట్యూబ్‌లో పెట్టి., త‌ద్వారా వ‌చ్చిన మొత్తంతో స‌ర్జ‌రీ చేయించుకోవాల‌న్న‌ది అత‌ని ఆకాంక్ష‌..

స‌తీష్‌కి జ‌న‌సేనాని అండ‌.. 99 టీవీ భ‌రోసా..!
అయితే స‌తీష్ తీసిన షార్ట్ ఫిల్మ్ ప్ర‌మోష‌న్‌ని యూట్యూబ్ ఛాన‌ళ్లు వ్యాపార దృక్ప‌దంతోనే చూశాయి.. చివ‌రికి వినోద్ రాయ‌ల్ త‌ల్లిదండ్రుల పుణ్య‌మా అని అత‌నికి దేవుడి ద‌ర్శ‌నం ల‌భించింది.. ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఓపెన్ చేయ‌డానికి జ‌న‌సేనాని ఒప్పుకున్నారు.. వినోద్ రాయ‌ల్ స్టోరీని పూర్తిగా చూసి., దాన్ని తీసిన టీంని అభినంధించ‌డంతో పాటు., స‌తీష్‌కి చేయూత ఇవ్వాల‌ని జ‌న‌సేన శ్రేణుల‌కి సూచించారు.. అదే స‌మ‌యంలో అక్క‌డ వున్న 99 ఛాన‌ల్ సిఈవో గంగాధ‌ర్‌, వినోద్ రాయ‌ల్ షార్ట్ ఫిల్మ్‌ని త‌మ సంస్థ యూట్యూబ్ అకౌంట్ ద్వారా ప్ర‌మోట్ చేసి., త‌ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని స‌తీష్‌కి ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చారు.. ఆ షార్ట్ ఫిల్మ్‌కి ప్ర‌మోష‌న్ కూడా ఇస్తామ‌న్నారు..

స‌తీష్‌కి సాయం చేయమ‌న్న జ‌న‌సేనాని..
చంద స‌తీష్‌.. ప్ర‌మాదంలో ఓ చేతిని కోల్పోవ‌డం.. ఆప‌రేష‌న్ ద్వారా కృత్రిమ అవ‌య‌వ‌ధార‌ణ‌కు పెద్ద మొత్తంలో ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలుసుకున్న జ‌న‌సేన అధినేత‌., ఆ మొత్తం సంపాదించుకునేందుకు అత‌ను చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని చూసి చ‌లించారు.. కేవ‌లం యూట్యూబ్‌లో వ‌చ్చే మొత్తంతో కాకుండా., ఎవ‌రైనా వ్య‌క్తిగ‌తంగా సాయం చేయాల‌ని ఆయ‌న జ‌న‌సేన శ్రేణుల‌కి విజ్ఞ‌ప్తి చేశారు.. స‌తీష్ ఆప‌రేష‌న్‌కి సుమారు 13 ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చ‌వుతుంది.. ఎవ‌రైనా అత‌నికి సాయం చేయ‌ద‌లిస్తే.. స‌తీష్ అకౌంట్ నంబ‌ర్‌కి ఆ మొత్తాన్ని పంప‌వ‌చ్చు..

chanda sathish,

account no: 021810100103137,

IFSC code:ANDB0000218, jubilee hills, branch

స‌తీష్‌ని ముంచిన ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌..?
అస‌లు ఎవ‌రు ఈ స‌తీష్‌.. యాక్సిడెంట్ ఎలా అయ్యింది..? చెయ్యి ఎందుకు పోయింది..? అని ఆరా తీస్తే.. స‌తీష్ చందా.. ఇత‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లా వాసి.. నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించిన ఓ ర‌క్త‌దాన శిభిరానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన సంద‌ర్బంలో., ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చేతిని కోల్పోయాడు.. ఆ సంద‌ర్బంలో మెడికల్ ఖ‌ర్చుల‌కి డ‌బ్బు ఇచ్చిన నారా వారి ఫ్యామిలీ., ప్ర‌భుత్వ ఉద్యోగం కూడా ఇస్తామ‌ని మాటిచ్చారు.. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి మాటిచ్చి ముంచిన చందంగానే స‌తీష్‌కీ హ్యాండిచ్చారు.. స్వ‌యంగా నారా లోకేష్ అత‌నికి ఉద్యోగం ఇస్తాన‌ని మాటిచ్చారు..నాలుగేళ్లుగా కాళ్లు అరిగేలా వారి చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేయ‌గా., ఓ కాంట్రాక్ట్ ఉద్యోగం ముఖాన కొట్టి మ‌మ అనేశారు.. కాంట్రాక్టు ఉద్యోగం కావ‌డంతో చాలీ చాల‌ని జీతంతో, ఒంటి చేత్తో ఈద‌లేక ఇబ్బంది ప‌డిన స‌తీష్‌.. సొంత ఊళ్లో వ్యాపారం చేసుకుంటా., దారి చూప‌మంటూ మ‌ళ్లీ ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ని ఆశ్ర‌యించాడు.. అయితే వారంతా ముఖం చాటేశారు.. ఆప‌రేష‌న్‌కి డ‌బ్బు అడిగినా., ఉద్యోగం అడిగినా వారి వ‌ద్ద నుంచి నో రెస్పాన్స్‌.. అయితే పుట్టుక‌తో ప‌వ‌న్ ఫ్యాన్ అయిన స‌తీష్‌., ఆయ‌న సాయం కోరి జ‌న‌సేన గ్యారేజ్ గ‌డ‌ప తొక్కాడు.. అవ‌కాశం వున్న వారు అత‌న్ని ఆదుకుంటార‌ని ఆశిస్తూ..

Advertisement.

Share This:

2,286 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − ten =