Home / జన సేన / ప‌శువుల్లంక ప‌డ‌వ ప్ర‌మాదం ప‌ట్ల జ‌న‌సేనుడి దిగ్భ్రాంతి..

ప‌శువుల్లంక ప‌డ‌వ ప్ర‌మాదం ప‌ట్ల జ‌న‌సేనుడి దిగ్భ్రాంతి..

తూర్పుగోదావ‌రి జిల్లా ప‌శువుల్లంక ద‌గ్గ‌ర గోదావ‌రి న‌దిలో ప‌డ‌వ మున‌క ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఐ.పోల‌వ‌రం మండ‌లం త‌లారివారిపాలెం నుంచి ప‌శువుల్లంక‌కు బ‌య‌లుదేరిన ప‌డ‌వ‌., మార్గం మ‌ధ్య‌లో నిర్మాణంలో ఉన్న వంతెన పిల్ల‌ర్‌కి ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదానికి గురైంది.. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 30 మందికిపైగా ప్ర‌యాణిస్తుండ‌గా, ఇందులో స్కూల్ విద్యార్ధులు కూడా ఉన్నారు.. ప్ర‌మాద‌ ఘ‌ట‌న వివ‌రాలు గోదావ‌రి జిల్లాల‌కి చెందిన పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జ‌న‌సేనాని, వ‌ర‌ద గోదారిలో నాటు ప‌డ‌వ ప్ర‌యాణం, వంతెన పిల్ల‌ర్‌కి ఢీ కొట్టి బోల్తా కొట్ట‌డం, ఇందులో పాఠ‌శాల నుంచి ఇళ్ల‌కు తిరుగు ప్ర‌యాణంలో వ‌స్తున్న చిన్నారులు ఉన్నార‌న్న విష‌యాల‌ను తెలుసుకుని తీవ్ర మ‌నో వ్య‌ధ‌కి గ‌రైన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.. గ‌ల్లంతైన వారు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డి ఇంటికి చేరాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు..

కొద్ది నెల‌ల క్రితం వాడ‌ప‌ల్లి స‌మీపంలో జ‌రిగిన ప‌డ‌వ ప్ర‌మాద ఘ‌ట‌న క‌ళ్ల ఎదుట క‌ద‌లాడుతుండ‌గానే, గోదావ‌రిలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం ప‌ట్ల జ‌న‌సేనాని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. లంక గ్రామాల ప్ర‌జ‌లు జీవితాల్ని ప‌ణంగా పెట్టి నాటు ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణం చేసే ప‌రిస్థితుల నుంచి కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనే ఉంద‌న్నారు.. సుర‌క్షిత‌మైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌తో కూడిన న‌దీ ప్ర‌యాణాల్ని అందుబాటులోకి తీసుకురావాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు..

ప‌డ‌వ మున‌క ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌గా., గ‌ల్లంతైన వారిలో చాలా మందిని స్థానికులు కాపాడిన‌ట్టు తెలుస్తోంది..

Share This:

1,275 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + 19 =