Home / జన సేన / ప‌శ్చిమ‌లో పోరాటం ముగిసింది.. 15 క‌వాతుకి జ‌న‌”సేన” క‌దులుతోంది..

ప‌శ్చిమ‌లో పోరాటం ముగిసింది.. 15 క‌వాతుకి జ‌న‌”సేన” క‌దులుతోంది..

జ‌న‌సేన అధినేత పిలిచారు.. ధ‌వ‌ళేశ్వ‌రం బ్రిడ్జి క‌వాతు చ‌ప్పుడు దేశ మొత్తం ప్ర‌కంప‌న‌లు పుట్టించాలి అని.. అవినీతి. అక్ర‌మాల రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై సంధించిన ఈ పోరుబావుటా, అక్ర‌మార్కులు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టాలి అని.. మొద‌టిసారి జ‌న‌సేనాని పిలిచారు.. ఏం చేస్తారో.. చెయ్యండ‌ని.. భీమ‌వ‌రం నుంచి మొద‌లైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోరాట యాత్ర‌, ఎన్నో స‌మ‌స్య‌ల‌ని ప్ర‌భుత్వం దృష్టికి, యావ‌త్ భార‌త దేశం దృష్టికి తీసుకువెళ్ల గ‌లిగారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. భీమ‌వ‌రం ఢంపింగ్ యార్డ్ బాధితుల ద‌గ్గ‌ర నుంచి ఏలూరు, దెందులూరుల్లో చింత‌మ‌నేని బాధితులు, ప్ర‌భుత్వ దిశానాల‌తో పెరిగిన పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఆటో వాలాలు, టీచ‌ర్లు, రైతులు, పోల‌వ‌రం నిర్వాసితుల వ‌ర‌కు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో.., ప్ర‌తి స‌మ‌స్య ఆయ‌న దృష్టికి వ‌చ్చాయి. అంతే కాదు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ఏ స‌మ‌స్య‌కైనా ప‌రిష్కార మార్గం దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డింది. భీమ‌వ‌రం నుంచి పోరాట యాత్ర‌గా బ‌య‌లు దేరిన జ‌న‌సేనానికి, త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించుకునేందుకు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎగ‌బ‌డిన తీరే అందుకు నిద‌ర్శ‌నం.. ప్ర‌తి మండ‌లం, గ్రామ స్థాయిలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, స‌మ‌స్య ఉన్న చోటుకి వెళ్లి అధ్య‌య‌నం చేస్తూ. ఆధ్యంతం ఆయ‌న పోరాట యాత్ర సాగడం కూడా జ‌నంలో ఆయ‌న మీద న‌మ్మ‌కం బ‌ల‌ప‌డ‌డానికి ఒక కార‌ణం.. ఆ క్ర‌మంలో జ‌నం మ‌ద్ద‌తు పెరుగుతున్న కొద్ది చేరిక‌లు వేగ‌వంతం అయ్యాయి.. పార్టీ పెట్టిన నాడు న‌మ్మ‌కం లేనివారు కూడా క్ర‌మేపీ ప్ర‌జ‌ల్లో బ‌లం పుంజుకుంటున్న నేప‌ధ్యంలో జ‌న‌సేన వైపు చూడ‌డం మొద‌లు పెట్టారు. జ‌న‌సేన తీర్ధం పుచ్చుకునేందుకు ఎగ‌బ‌డ్డారు.. అయితే జ‌న‌సేనాని ఏదైతే సిద్ధాంతంతో ముందుకి వెళ్తున్నారో.. అదే సిద్ధాంతానికి క‌ట్టుబ‌డిన నాయ‌కుల్ని మాత్ర‌మే పార్టీలోకి ఆహ్వానిస్తూ వ‌చ్చారు..

కొవ్వూరు బ‌హిరంగ స‌భ‌లో ప‌శ్చిమ పోరాట యాత్ర ముగిసింది.. జ‌న‌సేనాని తూర్పు గోదావ‌రి జిల్లాలో పెట్టే అడుగు ఓ ప్ర‌భంజ‌నం క‌వాల‌ని నిర్ణ‌యించారు.. ఆ నిర్ణ‌యం వెనుక ల‌క్ష్యం ప్ర‌జ‌ల్ని నిర్ల‌క్ష్యం చేసి, రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులుగా వాడుకుంటున్న కుహ‌నా రాజ‌కీయ వాదుల‌కి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని చాట‌డ‌మే.. యువ‌త‌రంతో న‌వ‌త‌రం రాజ‌కీయ‌ల‌కి నాందీ ప‌లికిన జ‌న‌సేనాని, త‌న జైత్ర యాత్ర‌ని కొన‌సాగిస్తూ, జ‌న‌సేన స‌త్తాని రాజ‌మండ్రి వేదిక‌గా ప్ర‌పంచానికి తెలియ చేయ‌నున్నారు.. ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలితే ఏం జ‌రుగుతుందో., జ‌నం ఎదురు తిరిగితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో..? రాజ‌కీయ జ‌వాబుదారీ త‌నం పూర్తిగా వ‌దిలేసిన నాయ‌కుల‌కి తెలియ చెప్పాల‌ని భావిస్తున్నారు..

అందుకే గోదావ‌రి తీరంలో పోటెత్త‌నున్న జ‌న ఉప్పెన.. యువ‌ర‌క్తం.. న‌వ స‌మాజ స్థాప‌న‌కి ఉప్పెనై ఉర‌క‌లెత్తాలి.. అవినీతి.. అక్ర‌మాల‌తో నిండిన రాజ‌కీయ వ్య‌వ‌స్థకి కూక‌టి వేళ్ల‌తో స‌హా పెకిలించేందుకు ఓ న‌వ‌త‌రం రాజ‌కీ వ్య‌వ‌స్థ నిర్మాణంలో ఇది ఓ కీల‌క మైలు రాయి కావాల‌ని జ‌న‌సేన అధినేత పిలుపునిస్తున్నారు.. పార్టీ శ్రేణులు, సామాన్య జ‌నం కూడా జ‌న‌సేనుడి వెంటే మేమున్నామంటూ ధ‌వ‌ళేశ్వ‌రంలో అల‌జ‌డి రేపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.. ఇప్ప‌టికే జిల్లాల వారీగా రూట్ మ్యాప్‌లు కూడా సిద్ధం అవుతున్నాయి.. ఈ క‌వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌ని తిర‌గ రాస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.. ఎన్ని ల‌క్ష‌ల మంది వ‌చ్చినా.. క‌వాతుకి మేముసైతం అంటూ జ‌నం సిద్ద‌మ‌వుతున్న‌ట్టు అన్ని జిల్లాల నుంచి సందేశాలు వ‌స్తున్నాయి.. జ‌న‌సేనాని క‌వాతు త‌ర్వాత బూట‌క‌పు స‌ర్వేల‌తో నిర్మించుకున్న ఆశ‌ల కోట‌లు బ‌ద్ద‌లుకాక త‌ప్ప‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి..

Share This:

1,485 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 1 =