Home / జన సేన / ప‌సిడి కాంతుల తెలుగు తేజానికి జ‌న‌సేన ప్రోత్సాహం.. రాహుల్‌కి 10 ల‌క్ష‌ల న‌జ‌రానా..

ప‌సిడి కాంతుల తెలుగు తేజానికి జ‌న‌సేన ప్రోత్సాహం.. రాహుల్‌కి 10 ల‌క్ష‌ల న‌జ‌రానా..

అత‌ను భ‌ర‌త‌మాత కీర్తిప‌తాక‌ని కామ‌న్‌వెల్త్ కోట‌పై పాతాడు.. తెలుగు వారంతా త‌లెత్తుకు తిరిగేలా చేశాడు.. అత‌ని క‌ష్టాన్ని జ‌న‌సేన గుర్తించింది.. త‌న‌వంతు ఆర్దిక‌సాయం అందించింది.. ఈ స్టోరీ మొత్తం  వెయిట్ లిఫ్ట‌ర్‌ రాగాల వెంక‌ట రాహుల్ గురించే.. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణ ప‌థ‌కంతో రికార్డు సృష్టించిన ఈ స్టువ‌ర్టుపురం కుర్రాడు., చేతిలో అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న ప‌రిస్థితుల నుంచి యావ‌త్ భార‌త జాతి గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేశాడు.. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో 85 కేజీల విభాగంలో ఓవ‌రాల్‌గా 338 కిలోల బ‌రువెత్త‌డం ద్వారా బంగారు ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు.. ఆర్దికంగా వెనుక‌బాటు, సౌక‌ర్యాల లేమి ఇబ్బందులు పెడుతున్నా మొక్క‌వోని ఆత్మ‌విశ్వాసంతో రాహుల్ అడుగులు వేసిన తీరు అభినంధ‌నీయం..

అందుకే స్వ‌యంగా రాగాల వెంక‌ట రాహుల్ ఫోటోతో స‌హా అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.. జ‌న‌సేనాని.. రాహుల్‌కి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపిన ఆయ‌న., అత‌న్ని మ‌రింత ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేన పార్టీ త‌రుపున 10 ల‌క్ష‌ల రూపాయిల చెక్‌ని న‌జ‌రానాగా ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. రాహుల్ స్వ‌ర్ణం సాధించి మాతృభూమి గ‌ర్వ‌ప‌డేలా చేశార‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. నీ అద్భుత విజ‌యం ప‌ట్ల మేము గ‌ర్విస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. . జ‌న‌సేన పార్టీ నీకు సెల్యూట్ చేస్తోందంటూ ప్రెస్ నోట్ ముగించారు..

ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిసినా ఆగ‌లేని త‌నం.. ఎవ‌రికి ఏ అవ‌స‌ర‌మొచ్చినా, ఈ చేతిది ఆ చేతికి తెలియ‌కుండా సాయం చేయ‌డం.. కేవ‌లం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి మాత్ర‌మే అది సాధ్యం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అస‌లు ‘సూత్ర‌ధారి’.. ”అజ్ఞాత‌వాసి” టీవీ9 ‘ర‌విప్ర‌కాషే’.. కెమెరామెన్ ‘ట్విట్ట‌ర్‌’తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

రెండు రోజులుగా వ‌రుస ట్వీట్ల‌తో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. శ‌నివారం ఉద‌యం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − two =

%d bloggers like this: