Home / పోరు బాట / ఫిబ్ర‌వ‌రిలో మంగ‌ళ‌గిరికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. చేనేత‌ల త‌రుపున పోరుబావుటా..

ఫిబ్ర‌వ‌రిలో మంగ‌ళ‌గిరికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. చేనేత‌ల త‌రుపున పోరుబావుటా..

handధ‌ర్మ‌వ‌రం నుంచి పోచంప‌ల్లి, సిరిసిల్ల‌, గ‌ద్వాల్ వ‌ర‌కు చేనేత కార్మికుల ప‌రిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌చందంగా త‌యారైంది.. ఆయా ప్రాంతాల్లో మ‌న చేనేత‌లు., సొంత‌మ‌గ్గాల‌పై త‌యారు చేసే ప‌ట్టువ‌స్త్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన ఆధ‌ర‌ణ ఉంది.. కానీ ఆ వ‌స్త్రాన్ని త‌మ స్వ‌హ‌స్తాల‌తో నేసే., నేత‌న్న‌లు మాత్రం అత్యంత దుర్భ‌ర‌మైన జీవితాన్ని అనుభ‌విస్తున్నారు..

handdd అందుకు ఒక కార‌ణం ద‌ళారీ వ్య‌వ‌స్థ అయితే., రెండో కార‌ణం ఆ ద‌ళారీని అరిక‌ట్ట‌లేని పాల‌కులు.. చేతిలో క‌ళ ఉన్నా., పొట్ట‌కూటి కోసం దాన్ని అమ్ముకోవాల్సిందే.. మ‌న‌సు చంపుకుని అమ్ముకున్నా., క‌డుపు నిండ‌దు.. కుటుంబం గ‌డ‌వ‌దు.. సొంత మ‌గ్గాలు కొందామంటే పెట్టుబ‌డి ఉండ‌దు.. అస‌లైన ల‌బ్దిదారుల‌కి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులకు రూల్స్ ఒప్పుకోవు.. బ‌తికినంత కాలం., బ‌తుకుజీవుడా అంటూ అంటూ బ‌త‌క‌డం., బ‌త‌క‌లేమ‌నుకున్న‌ప్పుడు., బ‌ల‌వంతంగా ప్రాణాలు తీసుకోవ‌డం.. చేనేత‌ల ఈ దురావ‌స్థ‌లే జ‌న‌సేనానిని క‌దిలించింది.. ఆయ‌న మ‌న‌సుని కదిలించింది.. వారి త‌రుపున పోరాడేందుకు., వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పాల‌కుల్ని ప్ర‌శ్నించేందుకు పురిగొల్పింది.. కార్మిక సంఘాల ద్వారా చేనేత‌ల క‌ష్టాలు తెలుసుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న వంతు సాయంగా స్వ‌చ్చందంగా చేనేత‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు ఒప్పుకున్నారు..

img-20170117-wa0041img-20170117-wa0042

అంతేకాదు చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారించిన ఆయ‌న‌., వారి త‌రుపున ప్ర‌భుత్వాల‌పై పోరాడేందుకు సైతం ముందుకి వ‌చ్చారు.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి వేదిక‌గా నేత కార్మికులు నిర్వ‌హించ‌నున్న చేనేత స‌త్యాగ్ర‌హం, ప‌ద్మ‌శాలీ గ‌ర్జ‌న‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాల్గొన‌నున్నారు.. ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కాలని కార్మిక సంఘాలు విజ్ఞ‌ప్తి చేసిన వెంట‌నే., జ‌న‌సేనుడు వారి అభ్య‌ర్ధ‌న‌కు ఆమోదం ప‌లికారు.. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ., ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న ఆయ‌న‌., త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్యకూ ప‌రిష్కార మార్గాలు వెతుకుతూ ముందుకి సాగుతూ జ‌న‌ప‌థంలో దూసుకుపోతున్నారు.. ఈ క్ర‌మంలో నెలాఖ‌రులో ఒంగోలులో బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.. ఇక వ‌చ్చే నెల‌లో గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న కూడా ఖ‌రారు కావ‌డంతో., పార్ట్‌టైం పొలిటీషియ‌న్ అంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది..

Share This:

2,184 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =