Home / జన సేన / ఫ‌లితాన్నిస్తున్న జ‌న‌సైన్యం కృషి.. ప‌రిష్కారం దిశ‌గా జ‌న‌సేనుడి డిమాండ్లు.. ఉద్దానానికి మ‌రో డ‌యాల‌సిస్ ఊపిరి..

ఫ‌లితాన్నిస్తున్న జ‌న‌సైన్యం కృషి.. ప‌రిష్కారం దిశ‌గా జ‌న‌సేనుడి డిమాండ్లు.. ఉద్దానానికి మ‌రో డ‌యాల‌సిస్ ఊపిరి..

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏనాడైతే యుద్ధం ప్ర‌క‌టించారో., ఆ నాటి నుంచి యుద్ధ‌ప్రాతిప‌ధిక‌న స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ప‌డ్డాయి.. జ‌న‌సేనుడు స‌ర్కారు ముందు ఉంచిన డిమాండ్లు ఒక్కొక్క‌టే ప‌రిష్కారం అవుతున్నాయి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చాపురం వేదిక నుంచి చేసిన డిమాండ్ల‌కు., ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించినా., ఉద్దానానికి పూర్తి స్థాయి ఊర‌ట దిశ‌గా., ఆయ‌న నియ‌మించిన టీం ప‌నిచేస్తూనే ఉంది.. ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని మూలాల‌తో స‌హా పెక‌లించే దిశ‌గా జ‌న‌సేన డాక్ట‌ర్ల బృందం డాక్ట‌ర్ దుర్గారావు, డాక్ట‌ర్ ర‌వి ఆకుల అండ్ టీం., సందీప్ అండ్ టీం.. ఎన్ఆర్ఐ జ‌న‌సేన టీం శ‌శాంక్ నిమ్మ‌ల‌.,డాక్ట‌ర్ కుమార్ కొత్త‌ప‌ల్లి టీం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.. జ‌న‌సేన మాట‌లు చెప్ప‌దు చేత‌లు మాత్ర‌మే చేస్తుంది అని చెప్పేందుకు అమెరికా నుంచి వైద్యుల‌ను ఉద్దానం ర‌ప్పించి మ‌రీ ప‌రిశోధ‌న‌లు చేయించ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌.. దీంతో పాటు ఉద్దానం ప్రాంతంలో సౌక‌ర్యాల క‌ల్ప‌నలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా టీం జ‌న‌సేన ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూనే వ‌స్తోంది..

తాజాగా విదేశీ వైద్య‌నిపుణుల‌ను వెంట‌బెట్టుకుని ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన డాక్ట‌ర్ల బృందం డాక్ట‌ర్ దుర్గారావు, ర‌వి ఆకుల స‌ర్కారు ఎదుట కొన్ని డిమాండ్లు ఉంచారు.. కిడ్నీ రోగుల‌కి ఫించ‌న్లు., ర‌క్త నిధి కేంద్రం., ఉచిత మందుల పంపిణీ త‌దిత‌ర డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది.. గ‌తంలో జ‌న‌సేన చేసిన డిమాండ్ మేర‌కు సోంపేట‌లో డ‌యాల‌సిస్ యూనిట్‌కి ప్రారంభించిన వైద్య మంత్రి., ఈ నెల 15న జ‌రిగే కేబినెట్ స‌మావేశం త‌ర్వాత‌., ఉద్దానం బాధితుల‌కి ఫించ‌న్లు ఇచ్చే నిర్ణ‌యాన్ని స‌ర్కారు ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిపారు.. బ్ల‌డ్ బ్యాంక్ ఏర్పాటుకు కూడా ముందుకి వ‌చ్చారు..

20 ఏళ్ల నుంచి ప్ర‌భుత్వాలే ఏం చేయ‌లేక పోయాయి., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం చేస్తారు..? అని వెట‌కారంగా మాట్లాడిన వారి నాలుక‌లు., ఇప్పుడు మాట్లాడ‌టానికి వీల్లేని ప‌రిస్థితుల్లో మంద‌మ‌య్యాయి.. వ్యాది గ్ర‌స్తుల‌ని గుర్తించి చికిత్స అందించ‌డ‌మే కాదు.. వ్యాది మూలాల‌ని వెతికే ప‌నిని కూడా జ‌న‌సేన చేప‌ట్ట‌డం., స‌మ‌స్య ప‌రిష్కారం విష‌యంలో జ‌న‌సేనుడి నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నం.. ఉద్దానానికి కొత్త ఊపిరి ఊదే క్ర‌మంలో., జీవ‌శ్చ‌వాల్లా బ‌తుకులీడుస్తున్న బాధితుల‌కి భ‌రోసా క‌ల్పించే క్ర‌మంలో జ‌న‌సేనాని, ఆయ‌న టీం వేసే ప్ర‌తి అడుగు విజ‌యం ద‌శ‌గా సాగుతోంది.. సాగుతూనే ఉంటుంది.. ఇవే ప‌రిస్థితులు కొన‌సాగితే., ద‌శాబ్దాలుగా ఉద్దానం ప్ర‌జ‌ల ఊపిరి తీస్తున్న కిడ్నీ వ్యాదిని ఆ ప్రాంతం నుంచి త‌రిమేయ‌డం పెద్ద క‌ష్టం కాదు..

Share This:

1,418 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + eleven =