Home / జన సేన / బాబాయ్ మాటిచ్చాడు.. అబ్బాయ్ అమ‌లు చేశాడు.. తిత్లీ బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోనున్న చెర్రీ..

బాబాయ్ మాటిచ్చాడు.. అబ్బాయ్ అమ‌లు చేశాడు.. తిత్లీ బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోనున్న చెర్రీ..

తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అక్క‌డ బాధితులు ఎదుర్కొంటున్న దుర్భ‌ర ప‌రిస్థితులు చూసి చ‌లించిపోయారు. తుపాను విధ్వంసం సృష్టించిన ప్ర‌తి గ్రామంలో తిరుగుతూ, అక్క‌డ జ‌రిగిన న‌ష్టాన్ని, బాధితుల స‌మ‌స్య‌ల్ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌, సామాజిక మాధ్య‌మాల్లో జ‌న‌సేన పార్టీకి ఉన్న అకౌంట్ల ద్వారా ప్ర‌పంచం దృష్టికి తీసుకు వ‌చ్చారు. అంతేకాదు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంద‌రికీ బాధిత గ్రామాల్ని ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వ్య‌క్తిగ‌తంగా కూడా చాలామంది పారిశ్రామిక వేత్త‌ల‌కి, ఎన్ఆర్ఐల‌కీ తిత్లీ బాధిత ప్రాంతాల‌ని ఆదుకోమంటూ విజ్ఞాప‌న‌లు పంపుతున్నారు.. శ‌నివారం వ‌జ్ర‌పుకొత్తూరు మండ‌లం అక్కుప‌ల్లి గ్రామంలో బాధితుల‌కి భ‌రోసా ఇచ్చేందుకు వెళ్లిన జ‌న‌సేనాని, అన్న కొడుకు, ప్ర‌ముఖ హీరో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌కి ఓ బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవాల‌ని సూచ‌న చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌, రామ్‌చ‌ర‌ణ్‌తో మాట్లాడుతా, ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ది ప‌ర‌చ‌మ‌ని సూచిస్తాన‌ని బాధితుల‌కి మాటిచ్చారు..

ప్ర‌జ‌ల సాక్షిగా జ‌న‌సేన అధినేత‌, బాబాయ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాటిచ్చారు.. మ‌రి చెర్రీ దాన్ని పాటించ‌కుండా ఊరుకుంటాడా.. పైగా బాబాయ్ అంటే పంచ ప్రాణాలు.. ఆయ‌న‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపే విష‌యంలో మిగిలిన వారికి భిన్నంగా ఉండాల‌ని ఆలోచించే చ‌ర‌ణ్‌కి బాబాయ్ మాట శాస‌నం.. అక్క‌డ అక్కుపాల్లి గ్రామంలో ప్ర‌జ‌ల‌కి ప‌వ‌న్ ఇలా మాటిచ్చారో లేదో, చెర్రీ ఓ గ్రామాన్ని దత్త‌త తీసుకునేందుకు సై అన్నారు.. బాబాయ్ సూచ‌న మేర‌కు ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోనున్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. త‌న బృందాన్ని తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు పంపి, ఏ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవాల‌ని అనే అంశంపై నిర్ణ‌యాన్ని అతిత్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు.. చెర్రీ నిర్ణ‌యాన్ని జ‌న‌సైన్యం స్వాగ‌తిస్తున్నారు.. త‌మ జ‌న‌సేనాని ఇచ్చిన హామీని నిల‌బెట్టినందుకు సామాజిక మాధ్య‌మాల్లో కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు..

Share This:

2,891 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − two =