Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / బీజేపీపై జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ పంజా.. విధానాల్లో చిత్త‌శుద్దిపై ప్ర‌శ్నల వర్షం..

బీజేపీపై జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ పంజా.. విధానాల్లో చిత్త‌శుద్దిపై ప్ర‌శ్నల వర్షం..

capture4

ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్ట‌డ‌మే కాదు., పాల‌న అదుపుత‌ప్పిన‌ప్పుడు నిల‌దీయాలి.. పోరాడాలి.. ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌శ్నించాలి.. అదే జ‌న‌సేన ల‌క్ష్యం.. 2014 ఎన్నిక‌ల్లో కొన్ని సిద్దాంతాల‌కు క‌ట్టుబ‌డి టీడీపీ, బీజేపీల భాగ‌స్వామ్యానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయా పార్టీల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై గ‌ళం విప్పారు.. అందుకు ట్విట్ట‌ర్‌ని వేదిక‌గా చేసుకున్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ టీడీపీ, బీజేపీల‌కు త‌న పార్టీ త‌రుపున మ‌ద్ద‌తు ప‌లికాన‌న్న ఆయ‌న‌., ఆ హ‌క్కుతోనే కేంద్రంలో అధికారం వెల‌గ‌బెడుతున్న బీజేపీకి ఓ ఐదుల్లో వివ‌ర‌ణ కోరుతూ ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు.. విషయం ఏదైనా ముఖ‌మాటం లేకుండా., ముఖంపైనే ప్ర‌శ్నించే అల‌వాటున్న జ‌న‌సేనాని., ఏఏ అంశాల్లో త‌న‌కు అనుమానాలున్నాయో పాయింట్ల వారీగా ప్ర‌క‌టించారు.. మొద‌టిది గోవ‌ధ నిషేధం కాగా., ఆ త‌ర్వాతి అంశాలు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌, దేశ‌భ‌క్తి, నోట్ల ర‌ద్దు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా..

capture1 capture2 capture3

ఇందులో గోవ‌ధ నిషేధానికి సంబంధించి బీజేపీపై సూటిగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.. గోవ‌ధ నిషేధంపై మీకు చిత్త‌శుద్ధి ఉందా..? ఉంటే గోవాతో స‌హా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు బీఫ్ అమ్మ‌కాలు నిషేధించ‌లేక‌పోయారు..? గోవ‌ధ నిషేధంపై నిజాయితీ ఉంటే., బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ లెద‌ర్‌తో త‌యారైన వ‌స్తువులు వాడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.. లెద‌ర్ బెల్టులు, చెప్పుల వాడ‌కాన్ని బీజేపీ నిషేధించాల‌న్నారు.. గో సంర‌క్ష‌ణ విషయంలో మీకు నిబ‌ద్ధ‌త ఉంటే., వాటిని ర‌క్షించాల‌ని భావిస్తే ప్ర‌తి బీజేపీ కార్య‌క‌ర్త ఓ ఆవుని పెంచుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు..

capture

ట్విట్ట‌ర్ యుద్ధంలో భాగంగా తొలి ప్ర‌శ్నాస్త్రాన్ని సూటిగా క‌మ‌ల‌నాధుల‌కి విసిరిన జ‌న‌సేనాని., శుక్ర‌వారం తాను విస‌ర‌బోయే రెండో అస్త్రం ఏంటో కూడా ముందు చెప్పేశారు.. రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంపై శక్ర‌వారం స్పందించ‌నున్న‌ట్టు తెలిపారు..

Share This:

1,723 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

One comment

  1. Excellent tweets by Pawan sir……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =