Home / జన సేన / బీసీల‌కి జ‌న‌సేన మొద‌టి ఎమ్మెల్యే టిక్కెట్‌.. ముమ్మిడివ‌రం అభ్య‌ర్ధిగా మాజీ కానిస్టేబుల్ పితాని..

బీసీల‌కి జ‌న‌సేన మొద‌టి ఎమ్మెల్యే టిక్కెట్‌.. ముమ్మిడివ‌రం అభ్య‌ర్ధిగా మాజీ కానిస్టేబుల్ పితాని..

కులాల్ని క‌లిపే ఆలోచ‌నా విధానం.. మ‌తాల్ని గౌర‌వించే నినాదం.. ఇవి కేవ‌లం ప‌బ్లిక్ మీటింగుల్లో దంచే స్పీచ్‌లు కాదు.. జ‌న‌సేన అధినేత నిబ‌ద్ధ‌త‌కి ద‌ర్ప‌ణాలు.. చట్ట స‌భ‌ల్లో బీసీల‌కి త‌గిన ప్రాధాన్య‌త ఇస్తాం అన్న ప్ర‌క‌ట‌న‌కి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రిమితం కాలేదు.. పార్టీ 2019లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించాక‌., తాను ఏ స్థానం నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణ‌యించుకోలేదు.. కానీ మొద‌టి టిక్కెట్‌ను ప్ర‌క‌టించేశారు.. బీసీల‌కి హామీ ఇచ్చిన కొన్ని వారాల్లోనే దాన్ని అమ‌లుప‌రుస్తూ., జ‌న‌సేన పార్టీ తొలి అభ్య‌ర్ధిగా ఓ సాధార‌ణ కానిస్టేబుల్‌గా ప‌ని చేసిన పితాని బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు.. ముమ్మిడివ‌రం జ‌న‌సేన పార్టీ టిక్కెట్‌ని బాల‌కృష్ణ‌కి ఇస్తున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచారు.. జ‌న‌సేన పార్టీ ఒక కులానికో, మ‌తానికో, ప్రాంతానికో చెందిన పార్టీ కాద‌న్న జ‌న‌సేనాని., అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల‌కి స‌మాన ప్రాతినిధ్యం జ‌న‌సేన పార్టీలో క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.. మిగ‌లా పార్టీల మాదిరి ఒక్క కులంతో పార్టీని నింపాల‌నుకుంటే త‌న‌కు ఎంతోసేపు ప‌ట్ట‌ద‌ని స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్‌., పితాని లాంటి క‌మిట్‌మెంట్ వున్న నాయ‌కుల కోసం నిరీక్షిస్తున్నాన‌న్నారు.. అందుకే పార్టీ నిర్మాణం ఆలస్యం అవుతుంద‌ని తెలిపారు.. పార్టీ నిర్మాణ చేయ‌లేకో., చేత‌కాకో వెయిట్ చేయ‌డం లేద‌ని తేల్చేశారు..

తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన వివిధ పార్టీల నేత‌లు పెద్ద ఎత్తున మంగ‌ళ‌వారం జ‌న‌సేన‌లో చేర‌గా., అందులో ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త పితాని బాల‌కృష్ణ‌, , అత్తిలి సీతారామస్వామి, జి. జ‌మ్మి, మ‌త్స్య‌కార నాయ‌కుడు పాలెపు ధ‌ర్మారావు, మ‌చ్చా నాగ‌బాబు పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు 500 మంది అనుచ‌రులు జ‌న‌సేన పార్టీలో చేరారు.. వీరంద‌రికీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్వ‌యంగా కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు..ఇదే వేదిక‌పై పితాని బాల‌కృష్ణను జ‌న‌సేన మొట్ట‌మొద‌టి ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు.

టిక్కెట్ ప్ర‌క‌టించిన అనంత‌రం జ‌న‌సేన అధినేత మాట్లాడిన రెండు మాట‌లు., తొలి అభ్య‌ర్ధి పితానిని తీవ్ర ఉధ్విగ్నానికి గురిచేశాయి.. పితాని బాల‌కృష్ణ క‌మిట్‌మెంట్ చూసి టిక్కెట్ ఇస్తున్న‌ట్టు తెలిపిన ప‌వ‌న్‌., పితానిదీ, త‌న‌దీ ఒకే కులం అన్నారు..అది పోలీస్ కులం అన్న ఆయ‌న అందుకు సంబంధించి వివ‌ర‌ణ ఇచ్చారు.. త‌న తండ్రి కానిస్టేబుల్‌, పితాని కూడా కానిస్టేబుల్‌గా ప‌నిచేశార‌ని గుర్తు చేసిన ఆయ‌న శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కి తొలి టికెట్ ప్ర‌క‌టించ‌డం వెనుక కార‌ణాన్ని కూడా తెలిపారు.. పాయ‌క‌రావుపేట‌లో ఫ్లెక్సీలు క‌డుతూ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నాగ‌రాజు ఆత్మ‌కి శాంతి క‌లిగించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌క‌టించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు..కుల నిర్మూల‌న జ‌ర‌గాలంటే కులాల ఐక్య‌త చాలా అవ‌స‌ర‌మ‌న్న‌ డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మాట‌ల్ని గుర్తు చేశారు.. ఆ మ‌హానుభావుడిని ఆరాధించేవాడిగా ఆయ‌న ఆశ‌యాల‌ను నేర‌వేర్చేందుకు శ‌క్తి మేర‌కు కృషి చేస్తాన‌ని హామీఇచ్చారు..

జ‌న‌సేన పార్టీకి ప‌త్రిక‌లు, ఛాన‌ల్స్ లేక‌పోవ‌చ్చు కానీ ప్ర‌తి జ‌న‌సైనికుడి గుండె ఒక ఛాన‌ల్ అన్నారు. భావ‌జాలం బ‌లంగా ఉంటే ప్ర‌జ‌ల మ‌న‌సులే మ‌న‌కు ఛాన‌ల్స్ గా ప‌నిచేస్తాయన్నారు.. ఇవాళ జ‌న‌సేన పార్టీ లేక‌పోయి ఉంటే తుమ్మ‌పాల సుగ‌ర్ ఫ్యాక్ట‌రీ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేది కాదన్నారు.. జ‌న‌సైనికులు చేసిన బ‌ల‌మైన పోరాటం వ‌ల్లే ప్ర‌భుత్వం రూ. 30 కోట్లు విడుద‌ల చేసింద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. అదే నేను డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి ప్ర‌భుత్వానికి లొంగిపోయి ఉంటే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేది కాదని తెలిపారు.. యువ‌త‌కు ఉద్యోగాలు లేవు. కోన‌సీమ నుంచి గ్యాస్ త‌ర‌లిస్తుంటే అడిగే వాడు లేడు. వీట‌న్నింటినీ ప్ర‌శ్నించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను త‌ప్ప‌.. డ‌బ్బు సంపాదించాల‌ని కాదన్నారు.. డ‌బ్బు మీద ఆశే ఉంటే రెండు మూడు సినిమాలు చేసుకుంటే రూ. 100 కోట్లు సంపాదించేవాడినష‌ని ప‌వ‌న్‌ చెప్పారు..

Advertisement.

Share This:

2,578 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × four =