Home / జన సేన / బెజవాడ‌లో జ‌న‌సేనుడి ప్ర‌భంజ‌నం.. హోదా హీట్ పెంచిన మ‌హా పాద‌యాత్ర‌..

బెజవాడ‌లో జ‌న‌సేనుడి ప్ర‌భంజ‌నం.. హోదా హీట్ పెంచిన మ‌హా పాద‌యాత్ర‌..

నెర‌వేర‌ని వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల‌ని మోసం చేస్తున్నారు.. ఓట్ల కోసం నోటికి వ‌చ్చింద‌ల్లా మాట్లాడి ప్ర‌జ‌ల్ని వంచిస్తున్నారు.. ప్ర‌జ‌ల త‌రుపున నేను రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వ‌స్తే… ఎలావుంటుందో తెలుసా..? కొద్ది నెల‌ల క్రితం రాబోయే తుపాను గురించి జ‌న‌సేన అధినేత చేసిన హెచ్చ‌రిక ఇది.. ఇప్పుడు బెజ‌వాడ వేదిక‌గా శాంపిల్ కూడా చూపించేశారు.. విభ‌జ‌న హామీల అమ‌లు, ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం చేసిన న‌మ్మ‌క ద్రోహానికి నిర‌స‌న‌గా వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌ల‌సి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రోడ్డెక్కారు.. విజ‌య‌వాడ బెంజ్‌స‌ర్కిల్ నుంచి రామ‌వ‌ర‌ప్పాడు రింగ్ వ‌ర‌కు ఆరు కిలోమీట‌ర్ల మేర‌., త‌న కోసం త‌ర‌లి వ‌చ్చిన మ‌హా సేన‌తో క‌ల‌సి మ‌హా పాద‌యాత్ర చేప‌ట్టారు.. వేలాది మంది అడుగులు క‌ల‌ప‌గా., మండుటెండ‌లో జ‌నం కోసం జ‌న‌సేనాని ప్ర‌తి అడుగు ప్ర‌భంజ‌నంగా క‌దిలారు..

కేంద్రం చేసిన న‌య‌వంచ‌నకు నిర‌స‌న‌గా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఆయ‌న‌., ఏ ప్రాంతంలో వారిని ఆ ప్రాంతంలో రోడ్ల‌పై న‌డిచి నిర‌స‌న తెల‌ప‌మంటూ పిలుపునిచ్చారు.. ఎక్క‌డి వారు అక్క‌డ పాద‌యాత్ర చేప‌ట్టినా., బెజ‌వాడ ర‌హ‌దారులు జ‌న‌ప్ర‌వాహంతో నిండిపోయాయి.. వేస‌వి తాపాన్ని లెక్క‌చేయ‌క వామ‌ప‌క్ష నేత‌ల‌తో క‌ల‌సి జ‌న‌సేన అధినేత ప‌దం క‌దిపారు.. ఉద‌యం 9 గంట‌ల 45 నిమిషాల‌కు తుమ్ముల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల స‌మ‌ర్పించి పాద‌యాత్ర చేయ‌డానికి నేరుగా బెంజ్ స‌ర్కిల్‌కి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి జ‌న‌సంద్రం జ‌య‌జ‌య ధ్వానాల‌తో స్వాగ‌తం ప‌లికింది.. వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల్ని అదుపు చేయ‌డం ఒక ద‌శ‌లో పోలీసుల‌కి త‌ల‌కు మించిన ప‌ని అయ్యింది.. అయితే జ‌న‌సేన అధినేత కారు దిగి సిపిఐ, సిపిఎం నాయ‌కులు మ‌ధు, రామ‌కృష్ణ‌ల వ‌ద్ద‌కు చేరుకోగానే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా అయ‌న‌కి ర‌క్ష‌ణ వ‌ల‌యంగా మారిపోయారు.. అంత మంది ఒక్క చోట చేరినా ఎలాంటి తొక్కిస‌లాట‌లు చోటు చేసుకోకుండా క్ర‌మశిక్ష‌ణ‌తో ముంద‌డుగు వేశారు..

జ‌న‌సేన అధినేత‌కి ముందు, వెనుకా దాదాపు కీలో మీట‌ర్ పొడుగు మొత్తం జ‌న‌ప్ర‌వాహ‌నం ఆవ‌రించేసింది.. ప్ర‌త్యక్ష పోరాటంలో ఇది కేవ‌లం తొలి అడుగు మాత్ర‌మేన‌ని , కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి హోదా ఉద్య‌మాన్ని ఉదృతం చేస్తామ‌ని పాద‌యాత్ర సాక్షిగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కేంద్రానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.. పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా త‌ర‌లి వ‌చ్చి విజ‌య‌వంతం చేసిన‌ జ‌న‌సేన, వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌ల‌కి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.. త్వ‌ర‌లో పూర్తి స్థాయి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించనున్న‌ట్టు జ‌న‌సేన అధినేత తెలిపారు..

ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక‌పోయినా, పాద‌యాత్ర వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఉన్నా, ప్ర‌జ‌లు స‌హృద‌యంతో అర్ధం చేసుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.. అదే స‌మ‌యంలో కేవ‌లం జాతీయ ర‌హ‌దారికి ఒక వైపు మాత్ర‌మే కార్య‌క‌ర్త‌ల్ని కంట్రోల్ చేయ‌డం ద్వారా ఉద్య‌మంలో కూడా ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌తాయుత దృక్పదాన్ని జ‌న‌సేన అధినేత చూపారు.. పాద‌యాత్ర ముగిసే స‌మ‌యానికి పార్ల‌మెంటులో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే వాయిదా ప‌డ‌డంతో వామ‌ప‌క్ష నేత‌లు ఇక కాచుకోమంటూ కేంద్ర- రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి జ‌న‌సేనాని సాక్షిగా హెచ్చ‌రిక‌లు చేశారు..

ఓవ‌రాల్‌గా జ‌న‌సేనుడి మ‌హా పాద‌యాత్ర సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.. కేంద్ర‌-రాష్ట్రాల‌కి రాబోయే ప్ర‌మాదం తాలూకు హెచ్చ‌రిక‌ల‌ను పంపింది..

Share This:

1,512 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − eleven =