Home / జన సేన / బెజ‌వాడ‌లో ఆర‌ని పోస్టర్ మంట‌లు.. మేయ‌ర్ కార్యాల‌యం ముట్ట‌డించిన జ‌న‌సైన్యం..

బెజ‌వాడ‌లో ఆర‌ని పోస్టర్ మంట‌లు.. మేయ‌ర్ కార్యాల‌యం ముట్ట‌డించిన జ‌న‌సైన్యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీకి సంబంధించి అప్ర‌క‌టిత ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.. ఈ ఆంక్ష‌లు గ్రామ స్థాయి నుంచి రాజ‌ధాని న‌గ‌రం వ‌ర‌కు ఉన్నాయి.. జ‌న‌సేన పార్టీకి అడుగ‌డుగునా ల‌భిస్తున్న జ‌నాధ‌ర‌ణ చూసి త‌మ ఓర్వ‌లేని త‌నాన్ని పాల‌కులు బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు.. ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీల జెండా దిమ్మెలు క‌ట్టుకోవడానికి అనుమ‌తి ఇస్తున్న అధికారులు, జ‌న‌సేన పార్టీ దిమ్మెల‌కి మాత్రం అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు.. హోర్డింగ్‌లు, పోస్ట‌ర్ల వ్య‌వ‌హారంలో కూడా అదే ప‌ద్ద‌తిని అవ‌లంభిస్తున్నారు.. బెజ‌వాడ న‌గ‌రం వేదిక‌గా కూడా జ‌న‌సేన పోస్ట‌ర్లు క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. న‌గ‌రం మొత్తం మ‌ళ్లీ మీరే రావాలి.. అంటూ జ‌నం అడ‌గ‌కున్నా సెల్ఫ్ డ‌బ్బా పోస్ట‌ర్లు వేసుకుంటున్న తెలుగు త‌మ్ముళ్లు.., జ‌న‌సేన పోస్ట‌ర్ క‌న‌బ‌డితే మాత్రం ఓర్వ‌లేక‌పోతున్నారు.. వాటిని తొల‌గించే వ‌ర‌కు అధికారుల్ని నిద్ర‌పోనివ్వ‌డం లేదు.. ఇందుకోసం ప్ర‌త్యేకంగా స్టాఫ్‌ని పెట్టి మ‌రీ జ‌న‌సేన పోస్ట‌ర్లు వేసిన కొద్ది గంట‌ల్లోనే తొల‌గిస్తున్నారు.. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని దూషిస్తూ ఓ తెలుగు త‌మ్ముడు పోస్ట‌ర్ వేస్తే చూసి ఆనందించిన ప‌చ్చ పార్టీ., జ‌న‌సేన నాయ‌కులు వేయించిన కౌంట‌ర్ పోస్ట‌ర్‌ని మాత్రం క్ష‌ణాల్లో తొల‌గించేసింది..

జ‌న‌సేన నాయ‌కులు కూడా ఈ పోస్ట‌ర్ల తొల‌గింపు వ్య‌వ‌హారాన్ని తేలిగ్గా వ‌దిలిపెట్టేలా క‌న‌బ‌డ‌డం లేదు.. ముఖ్యంగా పండుగ‌లు, ప‌బ్బాల‌కి వేసే ఫ్లెక్స్‌ల‌ని కూడా ఒక రోజు గ‌డ‌వ‌క ముందే తొల‌గించ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.. ఇక క‌మ‌ర్షియ‌ల్ హోర్డింగులు అద్దెకు తీసుకుందామ‌న్నా., ప‌చ్చ ప్ర‌భుత్వం వాటిని కూడా బ్లాక్ చేసేసింది.. ప్ర‌జాధ‌నాన్ని విప‌రీతంగా దుర్వినియోగం చేస్తూ, కోట్ల రూపాయిలు స‌ద‌రు కంపెనీల‌కి ఇస్తూ.. ప్ర‌త్య‌ర్ధి పార్టీల పోస్ట‌ర్లు న‌గ‌రంలో క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటిస్తోంది.. త‌మ పోస్ట‌ర్ల తొల‌గింపుపై ఆగ్ర‌హంతో ర‌గిలిసోతున్న జ‌న‌సైన్యం ఈ వ్య‌వ‌హారంపై ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించారు.. ఇప్ప‌టికే అందుకు సంబంధించి మొద‌టి అడుగుని కూడా వేసేశారు.. బెజ‌వాడ న‌గ‌ర మేయ‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించి ఆందోళ‌నకు దిగారు.. బెజ‌వాడ ఎవ‌డ‌బ్బ సొత్తు..? అంటూ నిల‌దీశారు.. అన్ని పార్టీల‌కీ స‌మాన హ‌క్కులు కావాలి.. జ‌న‌సేన జోలికి వ‌స్తే జాగ్ర‌త్త అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ…నిన‌దించారు.. అమ‌రావ‌తి అధికార ప్ర‌తినిధి మండ‌లి రాజేష్ నేతృత్వంలో జ‌రిగిన ఈ ముట్ట‌డికి మేయ‌ర్ దిగివ‌చ్చారు.. అయితే పోస్ట‌ర్ల వివాదంతో త‌న‌కు సంబంధం లేదంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.. నెపాన్ని అధికారుల మీద‌కి నెట్టే ప్ర‌య‌త్నం చేశారు.. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా అధికారుల్ని అదుపు చేయాల్సిన బాధ్య‌త‌ను మండ‌లి రాజేష్ మేయ‌ర్‌కి గుర్తు చేశారు.. బెజ‌వాడ న‌గ‌రం వేదిక‌గా సాగుతున్న పోస్ట‌ర్ల వివాదం.. హోర్డింగుల ముసుగులో సాగుతున్న దందాల‌పై ఓ ప్ర‌శ్నావ‌ళితో కూడిన విన‌తిప‌త్రాన్ని మేయ‌ర్‌కి అంద‌చేశారు..ఈ వ్య‌వ‌హారంపై స్పందించ‌కుంటే ఉద్య‌మం మ‌రింత ఉగ్ర‌రూపం దాలుస్తుంద‌ని హెచ్చ‌రించారు..

జ‌న‌సైనికులు మేయ‌ర్‌కి ఇచ్చిన విన‌తిప‌త్రంలోని వివ‌రాలు ఇలా ఉన్నాయి..
గౌర‌వ‌నీయులైన వియ‌జ‌వాడ న‌గ‌ర మేయ‌ర్,
శ్రీ కోనేరు శ్రీధ‌ర్‌ గార్కి,
విష‌యం: రాజ‌ధాని వేదిక‌గా సాగుతున్న హోర్డింగుల కుంభ‌కోణం, టీడీపీయేత‌ర పార్టీల పోస్ట‌ర్ల తొల‌గింపు గురించి.
అయ్యా,
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంత‌మైన విజ‌య‌వాడపై న‌గ‌ర పౌరులు, అన్ని రాజ‌కీయ పార్టీలు స‌మాన హ‌క్కు క‌లిగి వున్నాయి. ఈ విష‌యాన్ని అధికార తెలుగుదేశం పార్టీ మ‌రియు విజ‌య‌వాడ పుర‌పాల‌క సంస్థ మ‌ర‌చిన‌ట్టు తోస్తుంది. న‌గ‌రం మొత్తం వున్న హోర్డింగులు మొత్తం అధికార టీడీపీకి గంప‌గుత్తకి ఇచ్చిన‌ట్టుగా పుర‌పాల‌క ఉద్యోగుల వ్య‌వ‌హార శైలి తోస్తోంది. టీడీపీయేత‌ర పార్టీలు న‌గ‌రంలో ఎలాంటి ఫ్లెక్స్‌, పోస్ట‌ర్ వేసినా 24 గంట‌లు తిర‌గ‌క ముందే తొల‌గిస్తున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీకి సంబంధించిన పోస్ట‌ర్ల వ్య‌వ‌హారంలో అయితే మీ ఉద్యోగుల తీరు మ‌రీ దారుణంగా వుంది. ఉద‌యం పోస్ట‌ర్ క‌న‌బ‌డితే మ‌ధ్యాహ్నానికే వాటిని తొల‌గిస్తున్నారు. విజ‌య‌వాడ న‌గ‌రం ఏమైనా అధికార పార్టీకి తాత‌ల నాటి సొత్తా.? టీడీపీకి ఎలాంటి హ‌క్కు ఉందో, మిగిలిన పార్టీల‌కి అలాంటి హ‌క్కు లేదా.? అలా అని రాజ్యాంగంలో ఎక్క‌డైనా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు చ‌ట్టం చేయించారా.? లేదా ఎవ‌రికీ తెలియ‌కుండా ర‌హ‌స్య జీ.వో ఏమైనా పాస్ ,,చేయించారా.? న‌గ‌రం మొత్తం నిత్య ప‌చ్చ తోర‌ణాల ర‌హ‌స్యం ఏంటి.? ఇక తెలుగు రాష్ట్రాల్లో హోర్డింగులు వేసే ప్ర‌కాష్ ఆర్ట్స్ సంస్థ‌కీ మునిస్ప‌ల్ కౌన్సీల్‌కీ సంబంధం ఏంటి.? ప‌్ర‌కాష్ ఆర్ట్స్‌కీ తెలుగుదేశం పార్టీకి ఉన్న బంధం ఏంటి.? ప‌్ర‌కాష్ ఆర్ట్స్ సంస్ధ‌కి సంబంధించిన హోర్డింగులు మొత్తం ప్ర‌భుత్వం గంప‌గుత్త‌గా గుత్త‌కి తీసుకుందా.? ఒక్కో హోర్డింగుపై ప్ర‌చారానికి ఎన్ని కోట్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తున్నారు.? ఒక్క వాణిజ్య ప‌న్నుల శాఖ‌కే స‌ద‌రు సంస్థ 12 కోట్ల టాక్స్ ఎగ‌వేసిందంటే., న‌గ‌ర కార్పోరేష‌న్‌కి ప్ర‌కాష్ ఆర్ట్స్ నుంచి వ‌చ్చే ఆదాయం ఎంత‌.? ఆ కోట్ల రూపాయిల మొత్తం ఖ‌జానాకి వెళ్తోందా.? లేక ప‌చ్చ నేత‌లు, అధికారుల జేబులు నింపుతోందా.? న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో నిర్మిస్తున్న బ్రాండ్ న్యూ బ‌స్టాపుల్లో 35 కోట్ల రూపాయిల విలువైన‌ యాడ్స్ కాంట్రాక్టు, ఎలాంటి టెండ‌ర్ పిల‌వ‌కుండా ప్ర‌కాష్ యాడ్స్‌కి క‌ట్ట‌బెట్ట‌డం వెనుక ర‌హ‌స్యం ఏంటి.? జ‌న‌సేన పార్టీకి చెందిన పోస్ట‌ర్ క‌న‌బ‌డితే పాపంగా ప్ర‌కాష్ యాడ్స్ వ్య‌వ‌హ‌రించ‌డం(డ‌బ్బు తీసుకుని కూడా) కార‌ణం ఈ టెండ‌ర్ మ‌హిమేనా.? న‌గ‌ర ప్ర‌ధ‌మ పౌరులుగా ఉన్న మేయ‌ర్ శ్రీ కోనేరు శ్రీధ‌ర్ గారి వ‌ద్ద పై ప్ర‌శ్న‌ల‌న్నింటికీ జ‌వాబులు ఆశిస్తున్నాం. ప‌వ‌ర్‌లో ఉన్న‌ది ఎవ‌రైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంపైనా, రాజ‌ధాని న‌గ‌రంపైనా అన్ని పార్టీల‌కీ స‌మాన హ‌క్కులు ఉన్నాయి. అధికారంలో ఉన్నవారు ప్ర‌జ‌ల్ని దోచుకుంటుంటే, ఆ జ‌నం త‌రుపున పోరాటం చేస్తున్న జ‌న‌సేన పార్టీకి అంద‌రికంటే ఎక్కువే హ‌క్కులు వున్నాయి. ఎటు చూసినా మీ పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడే క‌న‌బ‌డుతుంటే, చాలా మంది ప్ర‌జ‌లు ఉద‌యాన్నే వారి ముఖం చూడాల్సి వ‌స్తున్నందుకు బాధ ప‌డుతున్నారు కూడా. ద‌య చేసిన రాజ్యాంగం ప్ర‌జ‌ల‌కి, పార్టీల‌కి ఇచ్చిన హ‌క్కుల‌ని కాపాడండి. హోర్డింగుల వ్య‌వ‌హారంలో అన్ని పార్టీల‌కి స‌మాన అవ‌కాశాలు ఇవ్వండి. లేదంటే ఇవాళ వంద మందితో మొద‌లైన ఈ ఉద్య‌మం, మీ పీఠాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న బాబుగారి పీఠాన్ని ఊడగొట్టేయ‌డం ఖాయం. అంద‌రి క్షేమం కోరి జ‌న‌సేన పార్టీ త‌రుపున చేస్తున్న ఈ సూచ‌న‌ని స్వీక‌రిస్తార‌ని కాంక్షిస్తూ..
అంటూ.. పార్టీ అమ‌రావ‌తి అధికార ప్ర‌తినిధి మండ‌లి రాజేష్ ఈ హెచ్చ‌రిక‌తో కూడిన లెట‌ర్‌ని బెజ‌వాడ న‌గ‌ర మేయ‌ర్‌కి అంద‌చేశారు.. మొన్న‌టికి మొన్న కౌంట‌ర్ పోస్ట‌ర్‌తో ఉక్కిరి భిక్కిరి అయిన ప‌చ్చ పార్టీ., వ్య‌వ‌హారం కాస్త ముదిరి పాకాన ప‌డుతుండ‌డంతో మ‌రింత కంగారు ప‌డుతోంది..

Share This:

1,162 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 4 =