Home / జన సేన / బెజ‌వాడ‌లో జ‌న‌సేన పోస్ట‌ర్ల అల‌జ‌డి..

బెజ‌వాడ‌లో జ‌న‌సేన పోస్ట‌ర్ల అల‌జ‌డి..

15055750_531423480401196_4505078102337100457_n

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. పార్టీ పెట్టిన నాటి నుండి నిన్న మొన్న‌టి ట్విట్ట‌ర్ ఫైట్ వ‌ర‌కు ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌త్య‌ర్ధులు స‌వాలుగానే స్వీక‌రిస్తున్నారు.. పైకి ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల్ని ప‌ట్టించుకోమ‌న్నా., అంత‌ర్గ‌తంగా మాత్రం జ‌న‌సేనాని జ‌వాబులు వెతుక్కుంటూనే ఉన్నారు.. ఇక అనంత స‌భ‌లో 2019 ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన నాటి నుంచి పొలిటిక‌ల్ పార్టీల్లో ఇంకో క‌ల‌వ‌రం మొద‌లైంది.. ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేస్తాడా..? ఎవ‌రితో అయినా క‌లుస్తాడా..? ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే వ‌చ్చే లాభ‌న‌ష్టాలేంటి అనే విష‌యంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.. జ‌న‌సేనాని బ‌లాన్ని చూసి., స‌ర్వేల్లాంటి వెన్నుపోటు వ్యూహాలు ఇప్ప‌టికే అమ‌ల‌య్యాయి.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం జ‌న‌సేనాని, ఆయ‌న సైన్యం వేసే ప్ర‌తి అడుగునూ గ‌మ‌నిస్తూనే ఉన్నాయి.. ఇటీవ‌ల తూర్పుగోదావ‌రిలో పార్టీ ఔత్సాహికులంతా స‌మావేశాల మీద స‌మావేశాలు నిర్వ‌హిస్తుండ‌డం., స్థానిక నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌నీయ‌డం లేదు..

img-20161226-wa0062 img-20161226-wa0063

ఇప్పుడు రాజ‌ధాని న‌గ‌రం బెజ‌వాడ‌లో క్రిస్మ‌స్‌, న్యూయిర్ లోక‌ల్ లీడ‌ర్స్‌తో పాటు అధికారపార్టీని క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేశాయి.. సిఎం, మంత్రుల‌తో పాటు నేత‌లంతా నిత్యం తిరిగే రాజ‌ధానితో మిగిలిన పార్టీల హ‌డావుడి కాస్త త‌క్కువే.. ఇటీవ‌లే జ‌న‌సైనికులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు.. ఆ మ‌ధ్య ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదాకి మ‌ద్ద‌తుగా మండ‌లి రాజేష్ అనే జ‌న‌సైనికుడు న‌గ‌రంలో చేప‌ట్టిన సంత‌కాల సేక‌ర‌ణ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. అధికార పార్టీ నేత‌లు అత‌నికి, పార్టీకి ఉన్న సంబంధాల‌పై ఆరా తీసే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది..

img-20161226-wa0065 img-20161226-wa0067

తాజాగా అదే మండ‌లి రాజేష్ క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ న‌గ‌రంలోని అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేయ‌డం., చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన పార్టీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి కేడ‌ర్‌ని ప్ర‌క‌టించ‌లేదు.. మ‌రి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హ‌డావుడి ఏంటి..?  కొంద‌రు యువ‌కులు ఔత్సాహికుల మంటూ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.. జ‌న‌సేనానిపై ఈగ వాలితే., జ‌నం రోడ్డెక్కేస్తున్నారు.. ఏదైనా సంద‌ర్బం వ‌స్తే పార్టీ ఉనికిని చాటుతూ ఇలా భారీ హోర్డింగులు పెట్టేస్తున్నారు.. తెర‌వెనుక పార్టీ వీరితో ట‌చ్‌లో ఉందా..?  పార్టీ కోసం ఎవ‌రికి వారు స్వ‌చ్చందంగా ముందుకు వ‌స్తున్నారా..?  పార్టీ ట‌చ్‌లో లేకుండా., అధినేత ఆదేశాలు లేకుండానే ఇంత హ‌డావిడి జ‌రుగుతుంటే., ఆయ‌న మాట తీసుకుంటే ప‌రిస్థితి ఇంకా ఎలా వుంటుంది..?  రాజ‌ధానిలో ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా ఇదే అంశంపై చ‌ర్చించుకుంటున్నారు… హోర్డింగులు క‌ట్టిన కుర్రాళ్ల గురించి., పోస్ట‌ర్‌లో ఉన్న పేర్ల గురించి ఆరాలు కూడా తీస్తున్నారు.. న‌గ‌రంలో పార్టీ బ‌లంపై వ‌స్తున్న రిపోర్టులు చూసి ఉలిక్కిప‌డుతున్నారు..

Share This:

1,887 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

One comment

  1. Chintamaneni house should be encircled. He should not dare to comment again on PA1. He should publicly apologize.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + fourteen =