Home / జన సేన / బెజ‌వాడ‌లో పేద‌ల కోసం రోడ్డెక్కిన జ‌న‌సైన్యం..

బెజ‌వాడ‌లో పేద‌ల కోసం రోడ్డెక్కిన జ‌న‌సైన్యం..

2
జ‌నం కోసం, జ‌నం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏర్పాటు చేసిన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆ ద‌శ‌గా కార్య‌చ‌ర‌ణ మొద‌లు పెట్టారు.. బెజ‌వాడ వేదిక‌గా పేదల కోసం గ‌ళ‌మెత్తారు.. పేద‌ల‌కి ఇచ్చిన ఇళ్ల ప‌ట్టాల‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీలుగా వెసులుబాటు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ విజ‌య‌వాడ‌లో జ‌న‌సైనికులు రోడ్డెక్కారు.. ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా అలంకార్ స‌ర్కిల్‌లో నిరుసన చేప‌ట్టారు.. న‌గ‌రంలో కొండ‌ల‌కి ఇరువైపులా పై వ‌ర‌కు ప‌ట్టాలు ఉన్న భూముల్లో పేద‌లు ఆవాసాలు ఏర్పాటు చేసుకోగా., వారికి ఆ స్థ‌లాల్ని రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశం లేదు.. దీంతో ఇళ్లు ఉన్నా బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేదు.. దీంతో అవ‌స‌రానికి ఫైనాన్స్ వ్యాపారుల వ‌ద్ద వ‌డ్డీలు తీసుకోవాల్సి వ‌స్తోంది.. ఆ వ‌డ్డీలు క‌ట్ట‌లేక చాలా మంది ఇళ్ల‌ను కూడా కోల్పోవాల్సి వ‌స్తోంది.. ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేన వారికి అండ‌గా నిల‌చింది.. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ స్కీంలో భాగంగా నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు వారికి ఆ ఇళ్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు.. పేద‌ల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని హెచ్చ‌రించారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

వార‌స‌త్వ ల‌క్ష‌ణం బ‌య‌ట‌పెట్టుకున్న జేసీ త‌న‌యుడు.. ప‌వ‌న్‌పై ప‌చ్చ పురాణంతో తెరంగేట్రం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో వివాదాల వీరుడు, కామెడీ పీస్ ఎవ‌రు అంటే.. అది జేసీ దివాక‌ర్ రెడ్డి అన్న విష‌యం వేరే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × two =

%d bloggers like this: