అయ్యా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిఎండి వేమూరి రాధాకృష్ణగారు.. నెల రోజుల క్రితం మీడియా మొత్తం కోడై కూసిన ఈ వార్త మీరు చూడలేదా.. అదే మామ చంద్రబాబు పాలనపై కోడలు బ్రహ్మణీ వేసిన సర్వే వార్త.. చూసే ఉంటారులే.. లేకపోతే ఇది ఈ హెడ్లైన్స్ ఒక్కసారి చూడండి.. రెండు నెలల క్రితం స్వయానా ఏపీ సిఎంగారి కోడలు వేయించిన సర్వేలో., టీడీపీ కేవలం 57 సీట్ల లోపుకే పరిమితమని వచ్చింది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే., సైకిల్ పంక్చర్ కావడం ఖాయమని తేలిపోయింది.. పచ్చ చొక్కాలు కూడా నిన్నమొన్నటి వరకు ఇదే వ్యవహారంపై చర్చించుకున్నారు.. తమ్ముళ్లు చర్చించుకున్నది మీ చెవిన పడకుండా ఎందుకు ఉంటుంది లెండి.. మరి మీ సర్వ మాట ఏంటి..? పాపం ఏదో చిన్న పిల్ల లోకం పోకడ ఇంకా తెలియక నీతిగా నిజాయితీగా సర్వే చేయించి ఉంటుంది.. అందుకే అధికారం చేజారడం ఖాయమని తేల్చేసింది.. మరి రెండు నెలల్లో జనం మనసు మార్చేసుకున్నారో ఏమో మీ సర్వేలో మాత్రం సూపర్ మెజార్టీ ఖాయమని వచ్చింది.. ఈ లోపే జనం మనసు మార్చేసుకునేంత మంచి పని ప్రభుత్వం ఏం చేసిందో మీకే తెలియాలి.. రైతు, డ్వాక్రా రుణమాఫీ లాంటి వ్యవహారాలు జనం సర్కారుని చీదరించుకునే పరిస్థితికి తెచ్చాయి.. అలాంటిది ఒక్కసారిగా బాబుగారు జనానికి ఏదో చేసేశారు కాబట్టి మళ్లీ గెలిచేస్తారు.. అదీ ఎలాంటి పొత్తు లేకుండా అని మీరు డబ్బా కొడుతున్నారు..
రాధాకృష్ణగారు.. ఇంతకీ సిఎం కోడలి సర్వే కరెక్టా., మీది కరెక్టా..? లేక ఆమె సర్వే ద్వారా వచ్చిన వ్యతిరేక పవనాల్ని., సానుకూల పర్చే పనిలో భాగమా..? అవును ప్రభుత్వానికి మీకు మధ్య ఆర్ధిక లావాదేవీలతో కూడిన దృడమైన బంధం ఉంది కదూ.. ఆ రుణం తీర్చుకునే ప్రయత్నమే ఇదా..? విలువలేని ఇలాంటి సర్వేలు ఎన్ని వేసినా., ఎలాంటి ప్రచారాలు చేసినా మా జనసేనానికి వచ్చిన ఇబ్బందేం లేదు.. ఎందుకంటే జనం అండ ఆయనకి ఉంది.. మర్చిపోయా బ్రహ్మణీ సర్వేలో టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం జనసేనాని వైపు తిరుగుతున్నట్టు వచ్చిందంటగా..? అందుకే ఎలాగు పోటీ కాని ప్రధాన ప్రతిపక్ష నేతని వదిలేసి., మీకు అందనంత ఎత్తులో ఉన్న పవన్కళ్యాణ్ మీద పడ్డారా.. మీ సర్వే ఎలాంటిదో.. మీ మీద మీ మీడియా మీద జనానికి ఉన్న అభిప్రాయం ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి.. మరో సారి జనసేనాని ఊసు కూడా ఎత్తే ప్రయత్నం చేయరు.. ఎంత సొంత డబ్బాలు కొట్టాలనుకుంటే మాత్రం., దాన్ని జనం మీదకి ఆపాదించాలా.. అలా చేస్తే జనమూ ఊరుకోరు.. ఇప్పటికే విలువలేని సర్వేగా ముద్ర పడింది.. ఇకనైనా ఆ పిచ్చి వార్తల ప్రచారం ఆపండి.. లేకపోతే జనం మీ మీడియాని పూర్తిగా బ్యాన్ చేసే రోజులు వస్తాయి.