Home / ఎడిటోరియల్స్ / బ‌ల్ల‌కింద చేతుల రాజ‌కీయాల‌కి జ‌న‌సేనాని దూరం.. ప‌వ‌న్‌పై డీసీ ఆస‌క్తిక‌ర క‌థ‌నం..!

బ‌ల్ల‌కింద చేతుల రాజ‌కీయాల‌కి జ‌న‌సేనాని దూరం.. ప‌వ‌న్‌పై డీసీ ఆస‌క్తిక‌ర క‌థ‌నం..!

కావాల‌నుకుంటే కాళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చే సౌక‌ర్యాలు.. ప్ర‌యివేట్ జెట్‌లో ప్రయాణాలు.. ఇంద్ర‌లోకాన్ని త‌ల‌పించే సెవెన్‌స్టార్ హోట‌ళ్ల‌లో వ‌స‌తులు.. అడుగ‌డుగునా హంస‌తూలికా త‌ల్పాలు.. రాచ‌మ‌ర్యాద‌లు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కావాలి అని కోరుకుంటే ఇవ‌న్నీ కాళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చేస్తాయి.. కానీ రాజ‌కీయాల్లోకి రావ‌డం కోసం త‌న జీవ‌న‌శైలినే మార్చేసుకున్నాడు.. త‌న‌కు తాను అతిసామాన్యుడిగా మారిపోయాడు.. ముఖ్యంగా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ప్ర‌జ‌లు ఇచ్చిన ప్ర‌తి రూపాయికీ విలువ క‌డుతూ., అత్యంత సామాన్య జీవ‌నాన్ని సాగిస్తున్నాడు అంటోంది జాతీయ ప‌త్రిక డెక్క‌న్ క్రానిక‌ల్‌.. ప్ర‌స్తుతం టూర్‌లో ఈ అసామాన్యుడు.. ఎంత‌టి సామాన్య జీవితం గ‌డుపుతున్నారు..? అందుకు కార‌ణం ఏంటి అనే అంశాల‌ను క‌ళ్ల‌కి క‌ట్టింది.. ఉత్త‌రాంధ్ర‌లో పోరాట యాత్ర ప్రారంభించిన జ‌న‌సేనాని., అతి సామాన్య వ‌స‌తిలో., కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాధార‌ణ క‌ళ్యాణ మంట‌పాల్లో బ‌స చేయ‌డం.. అదీ త‌న ప‌రివారంతో స‌హా.. చాలా సింపుల్ లైఫ్‌.. ఎంత సింపుల్ అంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో ఉండే సింగిల్ కాట్ మంచాలు, ఏసీలకి దూరంగా మామూలు సీలింగ్ ఫ్యాన్లతో కూడిన రూములతో స‌రిపెట్టుకుంటున్న విష‌యాన్ని డీసీ ప్ర‌స్థావించింది..పోరాట యాత్ర ప్రారంభంలో బ‌స చేసిన అంబేద్క‌ర్ భ‌వ‌న్‌నే ప‌వ‌న్ అతిసామాన్య జీవ‌న విధానాన్ని తెలియ‌జేస్తోంద‌ని తెలిపింది..

వాస్త‌వానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చిన్న నాటి నుంచి అత్యంత సాధార‌ణ జీవితానికే అల‌వాటు ప‌డిన వ్య‌క్తి.. కోట్ల సంపాద‌న మీద‌, రాజ‌భోగాల మీద ఆయ‌న‌కి ఎప్పుడూ దృష్టి లేదు.. అయితే అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్ట‌డంతో., రాజ‌భోగాలు కూడా కోరుకోకుండానే వ‌చ్చేశాయి.. అయితే ప్ర‌జ‌ల క‌ష్టాలు చూడ‌లేక‌., గాడిత‌ప్పిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని దారిన పెట్టేందుకు స‌క‌ల సుఖాల‌ను త్య‌జించి అతి సామాన్యుడిలా సాదాసీదా జీవితాన్ని గ‌డుపుతున్నారు.. ఈ అతిసామాన్య జీవ‌న‌శైలి వెనుక బాధ్య‌త‌తో కూడిన భ‌రోసా ఉంది.. లెక్క కూడా ఉంది.. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే..

తెలుగు రాష్ట్రాల్లో విప‌రీత‌మైన జ‌నాధ‌ర‌ణ వున్న జ‌న‌సేన పార్టీకి అధినేత‌.. కావాల‌నుకుంటే కొండ మీద కోతి కూడా దిగివ‌స్తుంది.. ఇక రాజ‌కీయాలు కాద‌నుకుని ఎప్ప‌టిలా సినిమాల్లో న‌టిస్తే., కాలు కంద‌ని జీవితం.. మ‌రి జ‌న‌సేనాని ఎందుకు అంత క‌ష్ట‌ప‌డుతున్నారు..? ఈ ప్ర‌శ్న‌కి డెక్క‌న్ క్రానిక‌ల్ చెప్పిన స‌మాధానం.. ప‌వ‌న్‌లోని నిబ‌ద్ద‌త‌-నిజాయితీ ఆయ‌న ఎదుర్కొంటున్న ఆర్ధిక స‌మ‌స్య‌ల‌కి కార‌ణ‌మ‌న్న‌ది ఆ ఆంగ్ల ప‌త్రిక అభిప్రాయం.. ఉత్త‌రాంధ్ర నుంచి మొద‌లుపెట్టిన పోరాట‌యాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు అంత‌రాయాల న‌డుమ న‌డుస్తోంది.. అ బ్రేక్‌ల‌కి ఒక కార‌ణం కంటి స‌మ‌స్య అయితే., అస‌లు కార‌ణం ఆర్ధిక స‌మ‌స్య‌లేన‌న్న‌ది ఆ ప‌త్రిక విశ్లేష‌ణ‌.. పార్టీ నిర్వ‌హ‌ణ కోసం విరాళాలు సేక‌రిస్తున్న‌జ‌న‌సేనాని., సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి చిన్న చిన్న మొత్తాలను మాత్ర‌మే ఆయ‌న అంగీక‌రిస్తున్నారు..

Advertisement.

బ‌ల్ల‌కింద చేతులు పెట్టి ఎక్కువ మొత్తాల్లో తీసుకుంటే ప‌రిస్థితి వేరుగా వుండేది., అయితే భారీ మొత్తాల్లో తీసుకునే డొనేష‌న్ల వ‌ల్ల., ఆ డోన‌ర్లు ఏదో ఒక‌టి ఆశించి మాత్ర‌మే ఇస్తారు కాబ‌ట్టి., పెద్ద మొత్తాల‌కి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేదు.. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి క‌న‌బ‌డిన ఈ స‌త్యం.. ప‌చ్చ మీడియాకి మాత్రం క‌న‌బ‌డ‌డం లేదు.. పైగా అస‌త్య ప్ర‌చారాలు చేస్తూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదొవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర‌కి ఒక్క రోజుకి ఆయ‌న‌కి గానీ, ఆయ‌న వెంట న‌డిచే 160 మంది సిబ్బందికి క‌లిపి 5 ల‌క్ష‌ల రూపాయల ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌ది ఆ ప‌త్రిక అంచ‌నా.. సినిమాల్లో సంపాదించిన మొత్తం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అతికొద్ది కాలంలోనే ఖ‌ర్చ‌యిపోయింది.. అయినా సాధార‌ణ ప్ర‌జ‌లు ఇచ్చే చిన్న చిన్న‌ మొత్తాల‌ని మాత్ర‌మే అంగీక‌రిస్తూ., ఆ మొత్తాన్ని బాధ్య‌త‌గా ఖ‌ర్చు చేస్తూ ముందుకి సాగుతున్నారు.. ముఖ్యంగా సొంత డ‌బ్బు ఎలా ఖ‌ర్చు చేసినా ప‌ర్వాలేదు కాబ‌ట్టి., సినిమాల్లో సంపాదించిన మొత్తంలో త‌న అవ‌స‌రాల‌కి స‌రిప‌డ మాత్ర‌మే ఉంచుకుని మిగిలిన దాన్లో ఎక్కువ శాతం గుప్త‌దానాల‌కి., అంటే ఎవరైనా క‌ష్టం అంటూ ఆయ‌న గ‌డ‌ప తొక్కితే., లేద‌న‌కుండా సాయం చేసేసేవారు.. అదీ మూడో కంటికి తెలియ‌కుండా.. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల నుంచి సేక‌రిస్తున్న విరాళాల‌కి, అంటే జ‌నం సొమ్ముకి ప్ర‌తి రూపాయికీ జ‌వాబుదారీత‌నం ఉండాల‌ని భావిస్తున్న జ‌న‌సేనాని., ఖ‌ర్చుని పూర్తిగా త‌గ్గించేశారు.. అందుకోసం అతిసామాన్య జీవితాన్ని గ‌డుపుతున్నారు..

Advertisement.

అయితే ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ముందు ముందు పార్టీని న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌న్న ఆందోళ‌న జ‌న‌సేన పార్టీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నా., ప‌వ‌న్ మాత్రం ఇబ్బందుల్ని ఎదురీద‌డానికే సిద్ధ‌ప‌డిన‌ట్టు డీసీ చెబుతోంది.. చిన్న చిన్న విరాళాలే అయినా వంద పైస‌లు క‌లిపితేనే రూపాయి అవుతుంద‌న్న స‌త్యాన్ని జ‌న‌సైనికులు గ్ర‌హించాల్సి వుంది.. మేం ఇచ్చే చిన్న మొత్తం ఆయ‌న‌కి ఎందుకు స‌రిపోతుంది అన్న భావం వీడి జ‌న‌సేన చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ని డెక్క‌న్ క్రానిక‌ల్ చాటి చెప్పింది..

అంటే ఆ మ‌ధ్య జ‌న‌సేనాని డొనేష‌న్ల కోసం మీటింగ్ పెట్టారంటూ వ‌స్తున్న ఓ విలువ‌ల వ‌లువ‌లు వ‌దిలేసిన పాత్రికేయుడు చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం నేతి బీర‌లో నెయ్యేన‌ని డీసీ తేల్చేసింది.. ప‌వ‌న్‌కి మిస్ట‌ర్ క్లీన్ అంటూ మార్కులు వేసేసింది..

Share This:

11,949 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × one =