Home / జన సేన / బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా ఇసుక‌ల‌రేవు-వాల్తేరు గ్రామాల మ‌ధ్య నాగావ‌ళి న‌దిపై బ‌ల‌స‌ల‌రేవు వ‌ద్ద వంతెన నిర్మించాల‌న్నది ప్ర‌తిపాద‌న. ఇది బ్రిటీష్ కాలం నుంచి ఉంది. ఇక్క‌డ వంతెన నిర్మిస్తే రాజాం-ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వర్గాల్లోని సుమారు 50 గ్రామాల ప్ర‌జ‌ల‌కి ప్ర‌యాణ సుఖం చేకూరుతుంది. 56 ఏళ్ల క్రితం ఇసుక‌లరేవు-వాల్తేరు గ్రామాల మ‌ధ్య పడ‌వ బోల్తా కొట్టి ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు.. వంతెన క‌ట్టాల‌న్న ప్ర‌తిపాద‌న బ్రిటీష్ కాలం నుంచి ఉన్నా, ఈ ప‌డ‌వ ప్ర‌మాదం త‌ర్వాత బ‌ల‌స‌లరేవు వంతెన నిర్మాణం డిమాండ్ కాస్త ఉద్య‌మ‌రూపం దాల్చింది . ఈ వంతెన నిర్మాణం పూర్త‌యితే రెండు నియోజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య దూరం త‌గ్గ‌డంతో పాటు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూడా ప్ర‌యాణ దూరం గ‌ణ‌నీయంగా(15 కిలోమీట‌ర్ల‌కి) త‌గ్గిపోతుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ప్ర‌జ‌లు జిల్లా కేంద్రంలో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా పొందూరు, చిల‌క‌పాలెం మీదుగా తిరిగి వెళ్లాల్సి వ‌స్తోంది. అనారోగ్యం లాంటి అత్య‌వ‌స‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చినా 60 కిలోమీట‌ర్లు చుట్టు తిరిగి వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీంతో బ‌ల‌స‌ల‌రేవు వంతెన డిమాండ్ నానాటికీ బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది.
బ‌ల‌స‌లరేవు వంతెన డిమాండ్ ఏ స్థాయిలో ఉండేదంటే.. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆముదాల‌వ‌ల‌స‌-రాజాం నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కుల చేతిలో ఈ అంశం ఓ ఓట్ల సాధ‌నాస్త్రంగా మారిపోయింది.. ఎన్నిక‌ల వేళ హామీలు ఇవ్వ‌డం , అయ్యాక వంతెన నిర్మాణాన్ని ప‌క్క‌న‌పెట్ట‌డం ప్ర‌జాప్ర‌తినిధుల‌కి అల‌వాటు మారింది. అయితే 19 ఏళ్ల క్రితం , 1999లో నాటి టీడీపీ స‌ర్కారు జీవో 154 ద్వారా వంతెన నిర్మాణానికి ఉత్త‌ర్వులు ఇచ్చింది. 9 కోట్ల రూపాయిల అంచ‌నా వ్య‌వ‌యంతో, నిధులు కూడా విడుద‌ల చేసింది. నాటి మంత్రి త‌మ్మినేని సీతారాం బ‌ల‌స‌లరేవు వంతెన నిర్మాణానికి అనుమ‌తులు సైతం సాధించారు. భూ సామ‌ర్ధ్య ప‌రీక్ష‌ల అనంత‌రం నిర్మాణం మొద‌ల‌వుతుంది. మా క‌ష్టాలు తీరుతాయి అని ప్ర‌జ‌లు సంబ‌రాలు కూడా చేసుకున్నారు. డ‌బ్బు కూడా విడుద‌ల చేసినా వంతెన నిర్మాణం మాత్రం ముందుకి సాగ‌లేదు.. ముందుకి సాగ‌లేదు అనే కంటే పాల‌కులు నిర్మాణానికి చొర‌వ చూప‌లేదు అన‌వ‌చ్చు.. దీంతో 50 గ్రామాల ప్ర‌జ‌ల క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది.

తాజా ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌ల‌స‌ల‌రేవు వంతెన నిర్మాణం వ్య‌వ‌హారం మ‌రో కొత్త మ‌లుపు తిరిగింది.. జ‌నం కోరుకుంటున్న ప్ర‌దేశంలో బ్రిడ్జి నిర్మాణానికి సాంకేతిక అనుమ‌తులు రాలేద‌న్న నేపంతో, ప్ర‌భుత్వ విప్ కూన ర‌వికుమార్ వంతెన ప్లాన్‌ని రెండు వైపులా ఆముదాలవ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గానికే ఉప‌యోగ‌ప‌డేలా రీ డిజైన్ చేయించారు. డిజైన్ మార్పు చేయ‌డానికి కార‌ణం కాన్‌కాస్ట్ కంపెనీయే అన్న‌ది ప్ర‌జ‌ల ఆరోప‌ణ . ఆ కంపెనీ కోస‌మే కూన ర‌వికుమార్‌, బ్రిడ్జిని త‌ర‌లిస్తున్నార‌ని జ‌నం మండిప‌డుతున్నారు. దీంతో పాటు ఇసుక అక్ర‌మ ర‌వాణాకి మ‌రింత ఊత‌మిచ్చేందుకు ర‌వికుమార్ స్థ‌ల‌మార్పిడికి పాల్ప‌డ్డాడ‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా ప్ర‌తిపాధ‌న ప్ర‌కారం ముద్దాడ‌పేట‌-గండ్రేడు మ‌ధ్య వంతెన నిర్మించాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించి 48 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో నివేదిక‌లు కూడా పంపింది. స్థ‌ల మార్పిడికి సంబంధించి ఉత్త‌ర్వులు కూడా విడుదల అయ్యాయి. ప్ర‌స్తుతం నాగావ‌ళి న‌దిపై 560 మీట‌ర్ల వంతెన నిర్మాణానికి రంగం సిద్ధ‌మ‌య్యింది.. అయితే 50 గ్రామాల ప్ర‌జ‌లు మాత్రం బ‌ల‌స‌ల‌రేవు వంతెన స్థ‌ల‌మార్పిడి వ్య‌వ‌హారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతా క‌ల‌సి బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న స‌మితి పేరిట ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుత డిజైన్ వ‌ల్ల ఆముదాల‌వ‌ల‌స‌, పొందూరు మండ‌లాల‌కి మాత్ర‌మే ఉప‌యోగం. అయితే బ‌ల‌స‌ల‌రేవు వ‌ద్ద నిర్మిస్తే రాజాం నుంచి స‌ర‌బుజ్జిలి, ఎల్‌.ఎన్ పేట మండ‌లాల ప్ర‌జ‌లు కూడా దీన్ని వినియోగించుకుంటారు. బ‌ల‌స‌ల‌రేవు సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో సుమారు రెండేళ్లుగా వంతెన కోసం ఉద్య‌మాలు సాగుతూనే ఉన్నాయి. 608 రోజుల నుంచి ప్ర‌జ‌లు రిలే నిరాహార దీక్ష‌లు సాగిస్తున్నారు. ఇద్ద‌రితో మొద‌లైన ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్త మద్ద‌తు సాధించింది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దీక్ష‌లో16000 మంది పాల్గొన‌డం, బ‌ల‌స‌ల‌రేవు వంతెనపై ప్ర‌జ‌ల్లో ఉన్న కాంక్ష‌ని తెలియ‌చేస్తోంది. వాల్తేరు, ప‌న‌స‌పేట‌, జీ.ఎన్‌పురం, బూరాడ‌పేట‌, హౌంజారాం, చిత్తారిపురం,కావ‌లి, గోక‌ర్ణిప‌ల్లి, సిరిపురం, అప్ప‌లగ్ర‌హారం, జాన‌కీపురం,మండాకురిటీ త‌దిత‌ర గ్రామ‌ల ప్ర‌జ‌లు ఈ దీక్ష‌ల్లో పాల్గొన్నారు. ఇప్ప‌టికీ వీరి పోరాటం అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూనే ఉంది.. నిధులు విడుద‌ల చేసి, వంతెన ఆవ‌శ్యక‌త‌ని గుర్తించి, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని తెలుగు దేశం పార్టీ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కింద‌న్న మండిపాటు 50 గ్రామ‌ల ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది.. గ‌త ఏడాది ప్ర‌జా సంఘాలు, జ‌న‌సేన‌, క‌ల‌సి వ‌చ్చే పార్టీల‌తో క‌ల‌సి వంతెన కోసం జిల్లా కేంద్రంలో వంద‌ల మంది ప్ర‌జ‌లు భారీ నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర‌కి శ్రీకాకుళం జిల్లా వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ స‌మ‌స్య ఆయ‌న దృష్టికి వ‌చ్చింది. అయితే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత‌, రాజాం, ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన క‌వాతు స‌భ‌ల్లో బ‌ల‌స‌ల‌రేవు వంతెన వెంట‌నే నిర్మించాల‌ని డిమాండ్ చేశారు కూడా.

అయితే మీరు వ‌స్తే, మా స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ల‌భిస్తుంది అన్న బ‌ల‌స‌ల‌రేవు సాధ‌న స‌మితి డిమాండ్ మేర‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ‌నివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించి, ఉద్య‌మ‌కారుల‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ వంతెన నిర్మాణ వ్య‌యం 60 కోట్ల రూపాయిల‌కి చేర‌డంతో పాటు ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్న బ్రిడ్జి డిజైన్‌ని ఆయ‌న ప‌రిశీలించారు. వ‌యోవృద్దులు, మ‌హిళ‌లు కూడా వంతెన సాధ‌న కోసం దీక్ష‌లు చేయ‌డాన్ని చూసి చ‌లించిపోయారు. బావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం వ‌య‌సు మ‌ళ్లిన వారు సైతం ఉద్య‌మించ‌డం ప్ర‌జ‌ల బ‌ల‌మైన ఆకాంక్ష‌ని ప్ర‌తిభింభిస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ్ర‌హించారు. బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న స‌మితి దీక్షా శిభిరం నుంచి ప్ర‌భుత్వానికి ఓ డెడ్‌లైన్ పెట్టారు. 2019 ఎన్నిక‌ల లోపు వంతెన మీరు క‌ట్ట‌కుంటే, జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత మేము క‌ట్ట‌చూపిస్తామ‌ని వంద‌లాది మంది ప్ర‌జ‌ల సాక్షిగా హామీ ఇచ్చారు. జ‌న‌సేన అధినేత సంద‌ర్శ‌న‌తో బ‌ల‌స‌ల‌రేవు వంతెన వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇన్ని గ్రామాల‌కి ఉప‌యోగ‌ప‌డే వంతెన‌పై ప్ర‌భుత్వం ఇంత నిర్ల‌క్ష్య ధోర‌ణితో ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తుంది..? కాన్‌కాస్ట్ కంపెనీ కోసం, కార్పొరేట్ శ‌క్తుల కోసం ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ని ఎందుకు మూట గ‌ట్టుకుంటోంది..? అన్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్ర వ్య‌క్త‌మ‌వుతున్నాయి..

Share This:

1,421 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 15 =