Home / జన సేన / భూములు లాక్కొంటే ఊరంతా చ‌చ్చిపోతాం.. జ‌న‌సేనుడి ముందు రైతు ఘోష‌.. జ‌నస‌భ‌కి ప‌వ‌న్ సిద్ధం..

భూములు లాక్కొంటే ఊరంతా చ‌చ్చిపోతాం.. జ‌న‌సేనుడి ముందు రైతు ఘోష‌.. జ‌నస‌భ‌కి ప‌వ‌న్ సిద్ధం..

ఓ ఊరికి ఓ స‌మ‌స్య వ‌చ్చింది.. కంచే చేనుని మేసిన చందంగా ప్ర‌జల‌ స‌మ‌స్య‌లు తీర్చాల్సిన స‌ర్కారే ఆ గ్రామ ప్ర‌జ‌ల పాలిట స‌మ‌స్య‌గా మారింది.. ఎకాన‌మీ సిటీ అంటూ రైతుల పొట్ట కొట్టే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.. ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్షం అయిపులేదు.. చావో.. రోవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లో చీక‌ట్లో చిరు దివ్వెలా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వారికి క‌నిపించారు.. త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌గ‌లిగే స‌త్తా ఆయ‌న‌కి మాత్ర‌మే ఉంద‌న్న న‌మ్మ‌కంతో జ‌న‌సేన గ్యారేజ్‌లో అడుగు పెట్టారు..

మా భూములు లాక్కొంటే ఊరు ఊరంతా ఉరిపెట్టుకుంటామంటూ త‌మ గోడు జ‌న‌సేనుడి ముందుంచారు.. తిరుప‌తి అర్బ‌న్ గ్రామం శెట్టిప‌ల్లి వాసుల దీన గాధ ఇది.. నాకు ఇద్ద‌రు కూతుళ్లు.. త‌లో ప‌ది సెంట్లు క‌ట్నంగా ఇచ్చి పెళ్లి చేశాను.. ఆ భూములు అమ్ముకునేందుకు వీలు లేద‌న‌డంతో., కూతుళ్ల‌ని తిరిగి పుట్టింటికి పంపేశారు.. మా బ‌తుకులు ఏం కావాలి..? ఊర్లో ప్ర‌తి రైతు ఇంట ఇలాంటి క‌న్నీరే.. స‌రోజిన‌మ్మ అనే ఓ మ‌హిళా రైతు ఆవేద‌న ఇది.. మా గ్రామ దేవ‌త ముత్యాల‌మ్మ సాక్షిగా ఊళ్లో రైతుల‌కి ప‌ట్టాలు ఇస్తామ‌ని మాట ఇచ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు., అధికారంలోకి వ‌చ్చాక భూములు లాక్కుంటామంటున్నారు.. అలా చేస్తే చ‌చ్చిపోతాం.. శెట్టిప‌ల్లికి చెందిన వ‌ర‌ల‌క్ష్మి అనే మ‌రో మ‌హిళ ఆవేద‌న ఇది..
వీరిద్ద‌రే కాదు.. శెట్టిప‌ల్లిలో ఏ ఇంటికి క‌దిపినా ఇవే క‌న్నీటి గాధ‌లు.. శెట్టిప‌ల్లిలో ఎకాన‌మిక్ సిటి క‌డ‌తా, ఐటీ హ‌బ్ పెడ‌తా అంటూ భూములు తీసుకుంటామంటున్నారు.. ల్యాండ్ పూలింగ్ పేరుతో కొల‌త‌లు వేస్తున్నారు.. మా ఊరికింద ఉన్న భూముల‌న్నీ ఇనందారీవే.. రైతుల‌కి ప‌ట్టాలు లేవు.. అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా చేశారు..ఓ వైపు దేశానికి వెన్నెముక రైతు అని చెబుతూ., మ‌రోవైపు ఆ వెన్నునే విరిచేస్తున్నారు.. ప్రాణాలైనా వ‌దులుతాం గానీ మా భూములు మాత్రం వ‌దిలే ప్ర‌స‌క్తి లేదు.. ముని మోహ‌న్ అనేమ‌రో రైతు ఆవేద‌న ఇది.. 400 సంవ‌త్ప‌రాలుగా శెఎట్టిప‌ల్లి ఇనాందారీ గ్రామంగా ఉంది., ముత్తాత‌ల కాలం నుంచి సాగు చేసుకుంటున్నా., ఇప్ప‌టికీ ప‌ట్టాలు లేవ‌ని చెప్పారు.. ముత్యాల‌మ్మ సాక్షిగా మూడు నెల‌ల్లో ప‌ట్టాలు ఇస్తామ‌న్న బాబు., ఇప్పుడు భూములు లాక్కుంటామని చెప్ప‌డం మాత్ర‌మే కాదు.. ఆ భూముల‌కి ప‌రిహారం అనే మాట కూడా మాట్లాడ‌డం లేదు.. గ‌తంలో రైల్వే వాళ్లు కోచ్ ఫ్యాక్ట‌రీ పెట్టిన‌ప‌పుడు ప‌రిహారంతో పాటు కుటుంబానికో ఉద్యోగ‌మూ ఇచ్చారు..పైడి ప‌ల్లి అనే ఊరు కూడా ఇలాంటి ఇనాం గ్రామ‌మే., ఆ ఊరికి మాత్రం చంద్ర‌బాబు హ‌యాంలోనే జీవో ఇచ్చి మ‌రీ ప‌ట్టాలు ఇచ్చారు.. అలాగే మాకూ న్యాయం కావాలి.. మ‌రో రైతు డిమాండ్ ఇది..
హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదుట శెట్టిప‌ల్లి రైతులు ఉంచిన ప్ర‌భుత్వ పాపాల చిట్టా ఇది.. రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల‌కు మాత్రం లే అవుట్ అప్రువ‌ల్స్ ఉంటాయి.. రైతుల‌కి మాత్రం భూములు అమ్ముకునే వీలు లేదు.. రైతుకీ రియ‌ల్ట‌ర్‌కి మ‌ధ్య అంత వ్య‌త్యాసం ఎందుకు.. మాకు ఫ్యాక్ట‌రీలు వ‌ద్దు, సిటీలు వ‌ద్దు.. ఎంత క‌ష్ట‌మైనా వ్య‌వ‌సాయ‌మే చేస్తామ‌ని ఆయ‌న‌కి చెప్పుకున్నారు.. ఆడ‌పిల్ల‌ల‌కి పెళ్లిళ్లు సైతం చెయ్య లేక‌పోతున్నామంటూ మ‌రో రైతు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదుట క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యాడు..

డాక్ట‌ర్ ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ సాయంతో జ‌న‌సేన గ్యారేజ్‌కి చేరిన ప్ర‌తి రైతు క‌న్నీటి గాధ‌ని విన్న జ‌న‌సేన అధినేత‌., శెట్టిప‌ల్లి రైతుల‌కి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.. ఈ నెల 23 లోపు ఆదే గ్రామ న‌డిబొడ్డున జ‌న‌స‌భ నిర్వ‌హించి రైతుల ఆక్రోశాన్ని ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.. ముత్యాల‌మ్మ సాక్షిగా శెట్టిప‌ల్లి ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట‌ని బాబు గారికి గుర్తు చేద్దామ‌న్నారు.. నాలుగైదు త‌రాలుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవాల‌నుకోవ‌డం స‌రికాద‌ని స‌ర్కారుకి సేచించారు.. రైతు క్షేమ‌మే దేశ క్షేమ‌మ‌న్న జ‌న‌సేనాని, జ‌న‌స‌భ ద్వారా రైతుల స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం చూపుతామ‌న్నారు.. స‌మ‌స్య ఉంటే దాని ప‌రిష్కారం కోసం ఎక్క‌డికైనా వ‌స్తాన‌న‌ని మ‌రోసారి జ‌న‌సేన అధినేత నిరూపించారు..

Share This:

1,524 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − eight =