Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / భ‌యం..భ‌యం.. అణువ‌ణువునా భ‌యం.. జ‌న‌సేన భ‌యం.. అదే గ్రేట్‌”కుట్రాం”ధ్రా క‌క్కిన విష‌పుసిరా..

భ‌యం..భ‌యం.. అణువ‌ణువునా భ‌యం.. జ‌న‌సేన భ‌యం.. అదే గ్రేట్‌”కుట్రాం”ధ్రా క‌క్కిన విష‌పుసిరా..

భ‌యం లేదు.. వైసీపీ ప్యాన‌ల్ వెబ్‌సైట్ గ్రేట్ఆంధ్రా.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అయ‌న పార్టీ జ‌న‌సేన‌పై క‌క్కిన విష‌పు చుక్క‌కి మొద‌టి ప‌దం అది.. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు మీతో పిచ్చి రాత‌లు రాయిస్తున్న జ‌గ‌న్‌., జ‌న‌సేన‌ని చూసి భ‌య‌ప‌డుతున్నారా..? అందుకే మీ సాక్ష్యాలు, పాత్రికేయ విలువ‌లు లేని క‌థనానికి ముందే., మీకిచ్చిన మొత్తానికి(భారీగానే ముట్టి ఉంటుంది) న్యాయం చేస్తూ.. ఓదార్పుగా ప‌వ‌ర్‌స్టార్‌ని చూసి ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నారు.. అనేగా మీరు చెబుతోంది.. ప‌వ‌న్‌ని చూసి కేంద్ర‌మే వ‌ణుకుతోంది.. మీలాంటి పిల్ల‌కాకులెంత‌.. ప‌వ‌న్ గ‌మ‌నం ఏంటో జ‌నానికి తెలుసు.. అప్ప‌ట్లో మ‌ద్ద‌తు ఎందుకు ఇచ్చారో తెలుసు., ఇప్పుడు జ‌నం కోసం ఆ పాల‌కుల్నే న‌డిరోడ్డుపై ఎలా నిల‌దీస్తున్నారో తెలుసు.. మొన్న‌టి వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంటే… పిచ్చి ప‌వ‌న్ జ‌నం త‌రుపున పోరాడితే ఓట్లు ప‌డ‌తాయా అని వెట‌కారం చేసిన‌., మీ పార్టీ వాళ్లు.. న‌వ‌నాయ‌క‌త్వం కావాలి అంటూ జ‌న‌సేనాని ఇచ్చిన పిలుపుకి వ‌స్తున్న స్పంద‌న‌., త‌ద్వారా మారిపోతున్న స‌మీక‌ర‌ణాలు చూసి వ‌ణికిపోతున్నార‌నుకుంటా..? నాడు టీడీపీ, బీజేపీల‌కి మ‌ద్ద‌తిచ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేనుడు ఒకే మాట‌.. ఒకే బాట‌లో సాగుతున్నారు.. ప్ర‌జలు ఎక్క‌డ స‌మ‌స్య‌ల్లో ఉంటే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు.. వాటి అంతు చూస్తున్నారు.. మీ జ‌గ‌న్‌లా ముఖ్య‌మంత్రి పీఠం కోసం ప్ర‌తి నిమిషం క‌ల‌లు మాత్రం క‌న‌డం లేదు.. నాడు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన కేంద్రంపై నేటికీ పోరాడుతూనే ఉన్నారు.. మీ నేత మాత్రం హోదా సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి కేసుల మాఫీ కోసం., క‌మ‌ల‌నాధుల ముంగిట మొక‌రిల్లాడు.. ఇక్క‌డే అర్ధం అవుతోంది.. ఎవ‌రు దారం తెగిన గాలిప‌ట‌మో.. ఇదంతా జ‌నానికి అర్ధ‌మ‌య్యే స‌రికి., దాన్ని ప‌క్క‌దోవ‌ప‌ట్టించేందుకు., ఇలాంటి ఆధారాలు లేని ఆరోప‌ణ‌ల‌కు గాచిప్స్ అనే రంగు అద్ది., త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెడ‌తారా..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎలాంటి వారో., ఆయ‌న వ్య‌క్తిత్వం ఏంటో., ఆయ‌న పేరు తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.. మీ విషపు రాత‌లు., ఆయ‌న్నేం చేయ‌లేవు..

గ్రేట్ఆంధ్రా.. ఎందులో మీరు గ్రేటు.. ప‌చ్చ నోట్ల కోసం పాత్రికేయాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డంలోనా., పార్టీల‌కు ప‌క్క‌లేయ‌డంలోనా..??? గ‌త ఎన్నిక‌ల్లో మ‌మ్మ‌ల్ని గెలిపించిన దేవుడు అంటూ స్వ‌యానా ప‌చ్చ‌చొక్కాలే ప‌వ‌న్‌ని కొలుస్తుంటే., ఆయ‌న బ‌లం తెలియ‌జేడానికి అంత‌కంటే థియ‌రీలు ఏం కావాలి.. అధికారం చేతుల్లోకి వ‌చ్చేసింద‌ని క‌ల‌లుగ‌న్న మీ జ‌గ‌న్‌కి కూడా ఓట‌మి వెనుక ఉన్న థియ‌రీ ఏంటో భాగా తెలుసు.. అంత‌కంటే ఉద్ధండ పిండాల్ని మీరు ఇప్ప‌టికే కోట్లిచ్చిమ‌రీ తెచ్చుకుని స‌ర్వేలు వేయిస్తున్నారుగా.. వారు చెబుతారు..

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ థియ‌రీ ప్ర‌జాసేవ‌.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. దాన్ని మ‌రింత ప‌టిష్టంగా అమ‌లుప‌రిచే్ందుకే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు.. మీ నాయ‌కుడి లెక్క ప్ర‌కారం., ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు అంటే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఒక‌టేనా..? అధికారం రాకున్నా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండొచ్చు., ప్ర‌జాసేవ చేయొచ్చు.. ఆ మాత్రం స్ప‌ష్ట‌త కూడా తెలియ‌ని మీరు పాత్రికేయులు.. సారీ పెయిడ్ పాత్రికేయం అలాగే ఉంటుందంట క‌దా.. మేం అక్ష‌రాలు అమ్ముకోం కాబ‌ట్టి ఆ విష‌యం మాకు తెలియ‌దు..

గ్రేట్ఆంధ్రా వేదిక‌గా టిక్కెట్ల విష‌యంలో మీరు క‌క్కిన విష‌పు చుక్క‌ల్లో ఒక్క‌టి మాత్రం నిజం ఉంది.. జ‌న‌సేన‌కు అభ్య‌ర్ధులు రెఢీ.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా., మీకు ఆర్ధిక ఆస‌రా ఇస్తున్న పార్టీకి పోటాపోటీ అభ్య‌ర్ధులు సిద్ధంగా ఉన్నారు.. అందుకే జ‌న‌సేనుడు నేరుగా ఎన్నిక‌ల‌కి ఇప్పుడైనా సిద్ధం అంటూ స‌మ‌ర‌నాధం చేశారు.. అలాంటి ద‌మ్ము మీకు లేక‌నే ఈ భ‌యాలు.. అస‌త్య క‌థ‌నాలు.. గెల‌వ‌డం ఎలా..? అధికారం సాధించ‌డం ఎలా..? ముఖ్య‌మంత్రి అయిపోవ‌డం ఎలా..? మీ మ‌ద్ద‌తు పార్టీ ధ్యాసంతా ఇదే అంశాల చుట్టూ తిరుగుతుండ‌డమే ఈ క‌థ‌నం వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం అన్న‌ది కూడా ఇట్టే తెలిసిపోతోంది..

చేతిలో కంప్యూట‌ర్‌.. కీ బోర్డ్ ఉంటే చాలు.. మ‌న‌కి ఆర్ధిక అండ‌గా ఉన్న‌పార్టీల ప్ర‌త్య‌ర్ధుల‌పై సిరా అవ‌స‌రం లేకుండానే అక్షరాల‌తో విషం క‌క్కేయొచ్చు.. అక్క‌డ విష‌యం లేకున్నా ప‌ర్వాలేదు.. గ్రేట్ఆంధ్రా.. సారీ కుట్రాంధ్రా చేస్తోంది కూడా అదే.. మొన్న‌టి వ‌ర‌కు పార్టీకి కేడ‌ర్ లేదు.. కేడ‌ర్ లేదు అంటూ మొరిగారు.. ఇప్పుడు కేడ‌ర్ రిక్రూట్‌మెంట్ జెట్ స్పీడ్‌తో సాగుతుండ‌డంతో., ఇలా మొద‌లు పెట్టారు.. పార్టీ టిక్కెట్ రేటెంత అంటూ హెడ్డింగ్ పెట్టిన మీరు.. అభ్య‌ర్ధికి ఎంత ఆస్తి ఉండాలన్న అంశం చుట్టూ క‌థ‌నం అల్లారు.. విష‌యం ఏదైనా కుట్రాంధ్రా వెంక‌ట్‌రెడ్డి గారు., మీ క‌థ‌నంలో నిజ‌నిరూప‌ణ‌కి సిద్ధంగా ఉన్నారా..? మీరు చేస్తున్న ఆరోప‌ణ‌లు., కేవ‌లం డ‌బ్బు కోసం చేస్తున్న పొలిటిక‌ల్ ప్రేలాప‌న‌లేనా..? నిజం ఉందా..? ఉంటే నిరూపించండి.. అప్పుడు నిజంగా జ‌నసైన్య‌మంతా మీరు ఆంధ్రాకే గ్రేట్ అని ఒప్పుకుంటుంది.. క‌నీసం మీ క‌థ‌నంలో నీతి-నిబ‌ద్ద‌త ఒక్క సిరా చుక్కంతైనా ఉంటే., ఆర్ధిక‌శ‌క్తి అనే అంశం గురించి మాట్లాడిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ పెద్ద మ‌నుషులు ఎవ‌రు.. ఆ అతి స‌న్నిహితులు ఎవ‌రో వారి పేర్లు వెల్ల‌డించండి.. జ‌న‌సైన్యం చేస్తున్న డిమాండ్ ఇది..

డ‌బ్బుపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఎంత‌టి మ‌మ‌కారం ఉందో., మీ అండ‌దండా జ‌గ‌న్‌కి ఎంత మ‌మ‌కారం ఉందో.. ఇరువురి జీవ‌న‌శైలే చెబుతోంది.. జ‌నానికి సేవ చేసేందుకు జ‌న‌సేనుడు ఉన్న ఇంటిని అమ్ముకుంటే., మీవాడు జ‌నాన్ని దోచిన సొమ్ముతో బెంగ‌ళూరులో రాజ‌సౌధం నిర్మించుకున్న సంగ‌తి అంద‌రికీ తెలుసు.. పార్టీ ఫండ్ పేరుతో కోట్ల‌కి కోట్లు వ‌సూళ్లు చేసే సంస్కృతి మీది., పార్టీని న‌డిపించేందుకు క‌ష్టార్జితాన్ని ఖ‌ర్చు చేసే సంస్కృతి జ‌న‌సేనుడిది.. అలాంటి వ్య‌క్తిపై అభాండాలు వేస్తే., జ‌నం చూస్తూ ఊరుకోరు..

పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జ‌న‌సేనుడు చెబుతోంది.. చేస్తోంది ఒక‌టే.. పోరాటం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం.. అదే సంపాద‌న కావాల‌నుకుంటే., పార్టీ ద్వారాలు తెరిస్తే., ఏం జ‌రిగేదో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. మీ పార్టీ నుంచి ఎంత మంది గోడ దూకేవారో మీకూ తెలుసు.. అవినీతి., అక్ర‌మాల‌కు జ‌న‌సేన దూరం అందుకే నేటి త‌రం నాలుక మ‌డ‌త రాజ‌కీయ నాయ‌కుల్ని దూరంగా ఉంచుతోంది.. గ్రేట్ ఆంధ్రా., అలియాస్ కుట్రాంధ్ర వెంక‌ట్‌రెడ్డి గారు.. మీ క‌థ‌నానికి అస‌లు ప్రాతిపదిక ఏంటో ద‌య‌చేసి విశ‌ద‌ప‌రిచి., తెలుగు ప్ర‌జ‌ల‌ని సంతృప్తి ప‌ర‌చండి.. లేదంటే చేసిన త‌ప్పుకి లెంప‌లు వేసుకోండి.. అదీ మీరు నిజాయితీ ప‌రులైతే.. పాత్రికేయాన్ని అమ్ముకుంటే., మీ అవ‌స‌రాల‌కి ఆ సోమ్మునే న‌మ్ముకుంటే మాత్రం మీ ప‌ని మీరు చేసుకోండి.. జ‌నం ప‌ని జ‌నం చేస్తారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

స‌కుటుంబ‌..స‌ప‌రివార స‌మేతం.. ఆస్వాధించే స్టోరీ.. అజ్ఞాత‌వాసికి సామ‌న్య ప్రేక్ష‌క రేటింగ్‌..

అజ్ఞాత‌వాసి స్టోరీ ఊహాతీతం కాదు.. జ‌నం క‌ష్టాలు తొల‌గించేందుకు జ‌న‌సేనుడిగా మారిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిజ‌జీవిత గాధ‌లా ఉంది.. మొద‌టి రోజు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =

%d bloggers like this: