Home / జన సేన / భ‌య‌పెడుతున్నారా..? భ‌య‌ప‌డుతున్నారా..? అర్ధ‌రాత్రి అల్ల‌ర్ల మ‌ర్మ‌మేంటి..?

భ‌య‌పెడుతున్నారా..? భ‌య‌ప‌డుతున్నారా..? అర్ధ‌రాత్రి అల్ల‌ర్ల మ‌ర్మ‌మేంటి..?

లోప‌ల ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత జ‌నాధ‌ర‌ణ క‌లిగిన పార్టీ అధినేత‌.. కోట్లాది మంది గుండెల్లో పెట్టుకున్న నాయ‌కుడు.. ఆయ‌న బ‌య‌టికి అడుగు పెడితే ప్ర‌తి అడుగు ప్ర‌భంజ‌న‌మే.. వంద‌ల కిలోమీట‌ర్ల ప్ర‌యాణం అయినా., ప‌ది అడుగుల న‌డ‌క అయినా, ప్ర‌తి అడుగులో ప‌దం క‌లిపేందుకు కొన్ని వంద‌లు, వేల అడుగులు నిత్యం సిద్ధంగా ఉంటాయి.. అలాంటి నాయ‌కుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి బ‌య‌లుదేరి, ఓ క‌ళ్యాణ మంట‌పంలో బ‌స చేస్తే., ఆయ‌న‌కి భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన క‌నీస బాధ్య‌త ప్ర‌భుత్వానికీ, పోలీస్ యంత్రాంగానికీ లేదా..? క‌నీసం ఒక్క కానిస్టేబుల్‌ని కూడా ర‌క్ష‌ణ‌గా ఇవ్వ‌రా..? నిన్న‌టి వ‌ర‌కు ఎంతో కొంత భ‌ద్ర‌త ఇచ్చిన పోలీసులు ఒక్క‌సారిగా ఎందుకు ఖాళీ చేసి వెళ్లిపోయారు..? పోలీసులు వెళ్లిపోవ‌డం, అదే స‌మ‌యంలో అల్ల‌రి మూక‌లు హ‌డావిడి చేయ‌డం..? దేనికి ఇది సంకేతం.. త‌ప్పు చేసిన వాడికి ఇది త‌ప్పు అని చెప్ప‌డం త‌ప్పా..? లేక మీ ఎమ్మెల్యేకి ఇచ్చిన మాట మేర‌కు ప్ర‌భుత్వం వెళ్లిపొమ్మంటూ పోలీసుల‌కి ఆదేశాలు ఇచ్చిందా..? అల్ల‌రి మూక‌ల్ని.. అదే మీ రౌడీ ఎమ్మెల్యే, గాలి ఎమ్మెల్యే పంపిన రౌడీ మూక‌ల్ని ఏం చేద్దామ‌నుకున్నారు..? ప‌్ర‌జ‌ల కోసం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం కోసం జ‌న‌సేన అధినేత పోరాట యాత్ర చేస్తుంటే., ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా ఆయ‌న్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారా..? నా హ‌త్య‌కి కుట్ర జ‌రుగుతుంది అని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ చెప్పిన కొన్ని గంట‌ల్లోనే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం.. అదీ పోలీసులు లేని స‌మ‌యం చూసి.. ముంద‌స్తు వ్యూహం ప్ర‌కార‌మే ఇవాళ పోలీసులు ముందుగా మాయం అయ్యారా..?

బైక్‌ల మీద త‌ప్ప‌తాగి వ‌చ్చిన ఈ అల్ల‌రి మూక‌ల్ని ఎవ‌రు పుర‌మాయించారు.. అదే ఆ రౌడీ ఎమ్మెల్యే ప‌నే ఇది… అల్ల‌రి మూక‌లు వేసుకొచ్చిన మోటార్ బైక్‌పై ఆ ఆకు రౌడీ, వీధి రౌడీ ఫోటోతో స‌హా అడ్డంగా బుక్క‌య్యాడు.. ఇంకో మ్యాట‌ర్ ఏంటంటే., అల్ల‌రి మూక‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మ‌యంలో అక్క‌డ లేని పోలీసులు, గోడ దూకిన వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు అదుపులోకి తీసుకునేందుకు మాత్రం ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.. గోడ దూకిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న వెంట‌నే మ‌ళ్లీ మాయం అయ్యారు.. దీంతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.. ఈ లోపు ఆ నోటా, ఈ నోటా జ‌న‌సేనానిపై దాడికి య‌త్నం అన్న వార్త వ్యాపించింది.. అంతే అందుబాటులో ఉన్న జ‌న‌సైనికులు పెద్ద ఎత్తున క్రాంతి క‌ళ్యాణ మంట‌పానికి చేరుకున్నారు.. జ‌న‌సేనుడికి మేం కాప‌లాగా ఉంటామంటూ ముందుకి వ‌చ్చారు..

అర్ధ‌రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితుల‌కి కార‌ణం ఎవ‌రు..? ఎందుకు..? వ‌చ్చిన రౌడీ మూక‌లు చింత‌మ‌నేని చిల్ల‌ర బ్యాచేన‌ని నిర్ధార‌ణ అయినా.. వెనుక మాత్రం పచ్చ పార్టీ హ‌స్తం ఉంద‌న్న విష‌యం తేట‌తెల్లం అవుతోంది.. ఒక్క‌సారిగా పోలీసులు జారుకోవ‌డం., అదే స‌మ‌యంలో దాడికి య‌త్నించ‌డం.. జ‌న‌సేన అధినేత పోరాట యాత్ర‌కి వేలాది మంది త‌ర‌లివ‌స్తుండ‌డంతో., అది చూసి భ‌రించ‌లేని తెలుగుదేశం స‌ర్కారే ఈ ప‌ని చేయించి ఉంటుద‌న్న ఆనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ముఖ్యంగా గురువారం జ‌రిగిన రెండు మీటింగ్‌ల‌కి భారీ ఎత్తున జ‌నం త‌ర‌లిరావ‌డంతో ఉలిక్కి ప‌డిన స‌ర్కారు., పోరాట యాత్ర‌ని అడ్డుకునేందుకే ఇలాంటి చిల్ల‌ర వ్యూహాలు ర‌చిస్తుంద‌న్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.. అయితే ఇలాంటి తాటాకు చ‌ప్పుళ్ల‌కి జ‌న‌సేన‌, జ‌న‌సైన్యం భ‌య‌ప‌డ‌ర‌న్న సంగ‌తి వారికి తెలియ‌దు పాపం.. అందుకే వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌య‌త్నం అయ్యింది..

Advertisement.

Advertisement.

Share This:

3,379 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + eleven =