Home / పాలి 'ట్రిక్స్' / భ‌య‌పెడుతున్న ప‌వ‌న్ ప‌వ‌ర్‌.. అనంత స‌భ‌పై మొద‌లైన కాకి గోల‌..

భ‌య‌పెడుతున్న ప‌వ‌న్ ప‌వ‌ర్‌.. అనంత స‌భ‌పై మొద‌లైన కాకి గోల‌..

jana-sena-party-meeting-in-vizag-photos-107

జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. పొలిటిక‌ల్ ఎంట్రీ అన‌గానే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు సైతం చాలా మంది తెగ‌బ‌డ్డారు.. అందుకు కార‌ణం., కంటెంట్ ఉన్న వాడిపై కామెంట్ చేస్తేనే త‌మ క‌టౌట్ వెలుగులోకి వ‌స్తుంద‌న్న భావ‌నే కార‌ణం.. చాలా మంది ఆ విష‌యంలో విజ‌యం సాధించారు కూడా.. ప‌వ‌న్ పుణ్య‌మా అని అడ్ర‌స్ గ‌ల్లంతైన చాలా మంది., మ‌ళ్లీ లైమ్‌లైట్ లోకి వ‌చ్చారు.. ఈ బ్యాచ్ మొత్తానిదీ ఒక‌టే ప‌ని., జ‌న‌సేనాని వేసే ప్ర‌తి అడుగుపైనా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, త‌ద్వారా జ‌నాల్లో గుర్తింపు సాధించ‌డం.. ఆఖ‌రుకి త‌ప్పు చేసిన‌వారిపై విమ‌ర్శ‌లు గుప్పించే హ‌క్కు కూడా ప‌వ‌న్‌కి లేద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తించారు.. ఇప్పుడు విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి ఆయ‌న ప్ర‌శ్నిస్తుంటే ఎవ‌రూ వెనుకరారు.. విభ‌జ‌న హామీ ప్ర‌త్యేక హోదా గురించి పోరాడుతుంటే క‌నీస మ‌ద్ద‌తు తెల‌ప‌రు.. పైగా పోరాడుతున్నందుకు కామెంట్లు,సెటైర్లు, విమ‌ర్శ‌లు.. ఇంత‌కీ ఆయ‌న చేస్తున్న త‌ప్పేంటి..? ప‌్ర‌జ‌ల త‌రుపున‌, ప్ర‌జ‌ల కోసం పోరాటం చేయ‌డ‌మేనా..? వారి కోసం న‌డి వీధిలో నాయ‌కుల్ని నిల‌దీయ‌డ‌మేనా..? మీరు ఇచ్చిన హామీలు మీరు నిల‌బెట్టుకుంటే., ఓ ప‌క్క‌న‌ప‌డి సినిమాలు తీసుకునే జ‌న‌సేనానికి రోడ్డెక్కాల్సిన ప‌నేంటి..? ఆ నా డు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావాలి.. అందుకోసం కావాలంటే ఇంటికెళ్లి మ‌రీ ఆయ‌న కాళ్లు ప‌ట్టుకుంటారు.. వేదిక‌లు పంచుకుంటారు.. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎక్క‌డ‌ని ప్ర‌శ్నిస్తే, అదే కాళ్లుప‌ట్టుకు లాగుదామ‌ని చూస్తున్నారు..

ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మం మొద‌లుపెట్టిన జ‌న‌సేనాని., కాకినాడ స‌భ‌లో నిజాలు చెబితే చాలా మంది ఉలిక్కిప‌డ్డారు.. జ‌నం చూస్తున్నార‌న్న సంగ‌తి కూడా మ‌ర‌చి నోటికి వ‌చ్చిన అబ‌ద్ద‌మ‌ల్లా అడేశారు.. ఇప్పుడు అనంత‌లో స‌భ అని ప్ర‌క‌టించ‌గానే ప‌వ‌న్ అప్‌డేట్ అవ‌లేదు అంటున్నారు.. కేంద్రం ప్యాకేజీ ఇచ్చేసిందంట‌., టీడీపీ స‌ర్కారు పుచ్చేసుకుందంట‌.. ఇంకా హోదా రాదంట‌.. ఇంత ప‌బ్లిక్‌గా జ‌నాన్ని మోసం చేసేందుకు మ‌ళ్లీ నాయ‌కులు, వారికి కొమ్ముకాసే మీడియా సిద్దం అయిపోయాయి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పుడు, ఇప్పుడు ఒక‌టే చెప్పారు., చెబుతున్నారు.. ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు ఉద్య‌మం ఆపేది లేద‌ని., సాధించ‌డం చేత కాని చేవ చ‌చ్చిన నేత‌లు., త‌మ త‌ప్పుని క‌ప్పిపుచ్చుకునేందుకు ప్యాకేజీ వ‌చ్చేసిందిగా అంటే., స‌రిపోతుందా..? ఏ ముఖం పెట్టుకుని వీరంతా జ‌నం ముందుకి వెళ్తారో తెలియ‌దు గాని., జ‌న‌సేనాని మాత్రం చివ‌రి వ‌ర‌కు పోరాడేందుకే రెడీ అయ్యారు.. దీంతో జ‌నంలో ఇప్ప‌టికే మ‌స‌క‌బారిన త‌మ ఇమేజ్‌, ఇంకా ఎక్క‌డ డ్యామేజ్ అవుతుందోన‌న్న భ‌యం వారిలో ప‌ట్టుకుంది.. అందుకే అనంత‌లో స‌భ అంటూ పార్టీ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే., కాకిగోల మొద‌లు పెట్టేశారు.. ప‌వ‌న్‌కి టైమింగ్ లేద‌ని., ఆయ‌న స‌భ అసంబ‌ద్ద‌మ‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు.. ప‌వ‌న్ సైన్యం, రాష్ట్ర ప్ర‌జ‌లు ఇదంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు.. త‌మ టైమింగ్‌తో మీ విమ‌ర్శ‌ల‌ని తిప్పికొడ‌తారు.. ప‌వ‌న్ ప‌వ‌ర్ ట్రాన్స్‌పౌండ‌ర్‌., ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. బీ కేర్ ఫుల్‌..

Share This:

1,708 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − 2 =