Home / జన సేన / భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై జ‌న‌సేనాని దృష్టి.. త్వ‌ర‌లో న్యూ ప్యాక్‌..

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై జ‌న‌సేనాని దృష్టి.. త్వ‌ర‌లో న్యూ ప్యాక్‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల మీద జ‌న‌సేన పార్టీ విశ్లేష‌ణ మొద‌లైంది.. స‌మీక్ష‌తో పాటు భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నేతృత్వంలో క‌స‌ర‌త్తులు మొద‌ల‌య్యాయి.. మొద‌ట పార్టీ కోర్ టీమ్‌(ముఖ్య‌నేత‌లు)తో స‌మావేశం అయిన ప‌వ‌న్‌., అనంత‌రం జిల్లాల వారీగా పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.. ఇందులో భాగంగా మొద‌ట పార్టీ త‌ర‌ఫున అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త తెలుపుతూ తీర్మానం చేశారు.. మంగ‌ళ‌గిరి పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ మేర‌కు పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌భ్యులు, పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశం తీర్మానం చేసింది.. అనంత‌రం ఓట‌మి కార‌ణాలు, భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై పార్టీ అధినేత కీల‌క అంశాలు నేత‌లు ముందు ఉంచారు.. ఓటు వేసిన వారితో పాటు జ‌న‌సేన పోరాట‌యాత్ర‌, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌కు హాజ‌రైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపిన ప‌వ‌న్‌., ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఒక అనుభ‌వం అని , ఓట‌మిని ఓట‌మిగా గాక ఒక అనుభ‌వంగా తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.. నాలుగేళ్ల వ‌య‌సుగ‌ల జ‌న‌సేన పార్టీకి ఇన్ని ల‌క్ష‌ల మంది ఓటు వేశారంటే అది విజ‌యంగానే భావిస్తున్నట్టు తెలిపారు.. అయితే పార్టీని ఎద‌గ‌నివ్వ‌కూడ‌ద‌ని కొన్ని బ‌లీయ‌మైన శ‌క్తులు ప‌ని చేయ‌డంతో ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ఫ‌లితాలు చూడ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని తెలిపారు.. పార్టీకి బ‌ల‌మైన‌ క్యాడ‌ర్ ఉంద‌ని ఈ ఎన్నిక‌లు నిరూపించాయ‌ని, భ‌విష్య‌త్తులో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాలంటే పార్టీ కోసం ప‌ని చేసేవారంద‌రూ ఒకే తాటిపై ఉండి ఒకే ఆలోచ‌నా విధానంతో ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ఎన్నిక‌లలో వ‌చ్చిన ఫ‌లితాలలో పార్టీకి ఉప‌క‌రించే అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయ‌ని ఆయ‌న ప‌వ‌న్ చెప్పారు.. ఓట‌మికి వ్య‌క్తుల‌ను కార‌ణంగా చూప‌రాద‌ని అన్నారు.. దృడ‌మైన సంక‌ల్పంతో పార్టీ కోసం ప‌ని చేయాల‌నుకున్న‌వారే త‌న‌కు అవ‌స‌రం అని., క‌నీసం ప‌దేళ్ల పాటు పార్టీ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌గ‌లిగే వారై ఉండాల‌ని చెప్పారు.. పార్టీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఒకే త‌ర‌హా ఆలోచ‌న‌తో ముందుకు వెళ్ల‌క‌పోతే విజ‌యం సిద్దించ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. త‌న‌తో పాటు వ‌చ్చే వారు ఒక‌టి గుర్తుంచుకోవాల‌ని, త‌న‌తో ఉంటే కీర్తి ప్ర‌తిష్ట‌లు వ‌స్తాయి గానీ డ‌బ్బు రాద‌ని తెలిపారు.. పార్టీలోని ప్ర‌తి నేత ఈ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో స్వీయ విశ్లేష‌ణ చేసుకోవాల‌ని, త‌మ శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను ఎవ‌రికి వారు బేరీజు వేసుకోవాల‌ని చెప్పారు. పార్టీ అనుకూల‌ ప‌వ‌నాలు వీచిన‌ప్పుడు ఆ ఫ‌లితాలు వేరుగా ఉంటాయ‌న్నారు.. మ‌న‌కు జ‌న‌బ‌లం ఉంది ఆ బ‌లాన్ని పార్టీ కోసం ఉప‌యోగించుకోవ‌డం పార్టీ నేత‌ల ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం అని చెప్పారు.. త‌న తుదిశ్వాస వ‌ర‌కు పార్టీని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.. మ‌నం ఒక్కోసారి ఊహించ‌ని ఫ‌లితాలు చూడ‌వ‌ల‌సి ఉంటుంద‌న్న ఆయ‌న‌., దానిని ఎదుర్కోవాలంటే దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక, ముందు చూపు అవ‌స‌ర‌మ‌న్నారు.. తాను గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్ల పోటీ చేసిన‌ప్ప‌టికీ స‌మ‌యాభావం వ‌ల్ల ఏ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఓట‌ర్ల‌ను క‌లుసుకోలేక‌పోయాన‌ని అన్నారు.
త్వ‌ర‌లో కొత్త పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ
ప్ర‌స్తుతం ఉన్న పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ(రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ) కాలం ముగిసింద‌నీ., ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని గ‌తంలో ఈ క‌మిటీని నియ‌మించిన‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఈ క‌మిటీ పున‌ర్నీయామ‌కం చేయనున్న‌ట్టు వెల్ల‌డించారు.. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రో క‌మిటీని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు.. ఈ క‌మిటీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్ర‌ణాళికలు, అభ్య‌ర్ధుల ఎంపిక వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌నిచేస్తుంద‌న్నారు..
పార్టీ పక్ష ప‌త్రిక‌
పార్టీ భావ‌జాలం, నిర్ణ‌యాలు, ప్ర‌ణాళిక‌లు కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌చేయ‌డానికి పార్టీ త‌ర‌ఫున ఓ ప‌క్ష ప‌త్రిక‌ను వెలువ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ మీటింగ్‌లో వెల్ల‌డించారు. ఈ ప‌త్రిక‌లో రాష్ట్ర‌, దేశ విదేశాల‌కు చెందిన పాల‌సీ నిర్ణ‌యాలు, అభివృద్ది రంగాల‌కు చెందిన స‌మాచారం పొందుప‌ర‌చ‌నున్న‌ట్టు చెప్పారు. మేధావులు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు వెల్ల‌డించ‌డానికి ఈ ప‌త్రిక ఒక వేదిక కావాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకురావ‌డంతో పాటు వాటి ప‌రిష్కారానికి ఈ ప‌త్రిక తోడ్ప‌డాల‌ని ఆకాంక్షించారు.. ప‌త్రిక స్వ‌రూప స్వ‌భావాలు, ఎటువంటి శీర్షిక‌లు ఉండాలో నిర్ణ‌యించ‌డానికి ఒక క‌మిటీని నియ‌మించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. ప‌త్రిక తొలి ప్ర‌తిని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు.. ప‌త్రిక ఈ-మ్యాగ‌జైన్‌తో పాటు ముద్రిత సంచిక‌ను కూడా కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటు ఉండ‌నుంది.. ఆ స‌మావేశంలో మాదాసు గంగాధ‌రం, పి.రామ్మోహ‌న్ , తోట చంద్ర‌శేఖ‌ర్ , చింత‌ల పార్ధ‌సార‌ధి, ముత్తంశెట్టి కృష్ణారావు, బొమ్మ‌దేవ‌ర శ్రీధ‌ర్‌, బి. మ‌హేంద‌ర్‌రెడ్డి, పి.హ‌రిప్ర‌సాద్‌, శంక‌ర్‌గౌడ్‌, రియాజ్ , న‌గేష్‌, రామ్‌ తాళ్లూరి, వై. శ్రీను, డాక్ట‌ర్ యామిని జ్యోత్స్య‌, సుజాత పండా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This:

877 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 1 =