Home / జన సేన / మంచాన ప‌డిన తూర్పు ఏజెన్సీ.. గిరిపుత్రుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సైన్యం దృష్టి..

మంచాన ప‌డిన తూర్పు ఏజెన్సీ.. గిరిపుత్రుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సైన్యం దృష్టి..

img-20161212-wa0048 img-20161212-wa0056

జ‌న‌సేన‌కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ఇజం.. ఎక్క‌డ జ‌నం కష్టాల్లో ఉంటే అక్క‌డ తాను ఉంటాన‌ని చెప్పిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన హామీని తూచా త‌ప్ప‌కుండా పాటించేందుకు ఆయ‌న సైన్యం కూడా రెఢీ అయ్యింది.. ఎక్క‌డ ఎవ‌రు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., త‌మ ఓపిక మేర‌కు వారిని ఆదుకోవ‌డ‌మే లక్ష్యంగా జ‌న‌సైనికులు ముందుకి సాగుతున్నారు.. త‌మ సేవ‌కు ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలైనా అడ‌వులతో నిండిన ఏజెన్సీ ప్రాంతాలైనా ఒక్క‌టేన‌ని నిరూపిస్తున్నారు.. వర్షాకాలం మొద‌లైందంటే ఏజెన్సీ గ్రామాలు మంచాన ప‌డిన‌ట్టే., వేస‌వి సెగ‌లు వ‌చ్చే వ‌ర‌కు గిరిపుత్రులు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో నానా ఇబ్బందులు పడ‌తారు.. పేరుకి ఆసుప‌త్రులు ఉన్నా., డాక్ట‌ర్లు మాత్రం ఉండ‌రు.. ఆ ప్రాంతాల్లో ఎన్నికల స‌మ‌యంలో మిన‌హా నాయ‌కుల జాడ కాన‌రాదు.. ఇలాంటి ప్రాంతాల‌నే త‌మ సేవ‌కు ఎంచుకుంది జ‌న‌సైన్యం.. డెంగీ, మ‌లేరియా, టైఫైడ్‌ల‌తో పాటు కాళ్లు, చేతుల వాపులు లాంటి అంతులేని రోగాల‌తో వ‌ణుకుతున్న మ‌న్యంపై దృష్టి సారించింది..

img-20161212-wa0051

తూర్పుగోదావ‌రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి మండ‌లాల్లో స‌మ‌స్య‌ల్ని స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పార్టీ నాయ‌కుల దృష్టికి తీసుకురాగా., జ‌న‌సేవ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరిట సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న జ‌న‌సైనికురాలు గంటా స్వ‌రూప స్పందించింది.. గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌యాణించి ఆయా మండ‌లాల్లోని ఏటుకూరు, చిల‌క‌పాక‌లు, పూజారిపాక‌లు త‌దిత‌ర గ్రామాల్లో ఆమె ప‌ర్య‌టించారు.. అక్క‌డ ప్ర‌జ‌ల్ని ప‌లుక‌రించి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.. విద్యార్ధుల‌తో మాట్లాడి అక్క‌డ ప్ర‌జ‌ల‌కి ఎలాంటి వైద్య సేవ‌లు అవ‌స‌రం., ఏఏ డాక్ట‌ర్లు కావాలి., ఏజెన్సీ వాసుల్ని ఇబ్బంది పెడుతున్న రోగాలు ఏంటి..? మ‌ందులు ఏం కావాలి..? అనే అంశాల‌పై ఆరా తీశారు.. పురిటి నొప్పుల స‌మ‌యంలో కూడా స‌రైన వైద్యం అందుబాటులో లేక‌., ఇక్క‌డ మ‌హిళ‌లు ప‌డుతున్న వెత‌ల్ని గుర్తించారు.. వారం రోజుల్లో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి మెడిక‌ల్ క్యాంపు నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇచ్చారు.. స్థానిక జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు వెంక‌ట‌ర‌మ‌ణ‌, స‌త్య మిత్ర బృందం ఆమెకు స‌హ‌క‌రించారు..

15442251_1767260340157712_4962432077254026509_n

img-20161212-wa0054

ఏజెన్సీ వాసుల వెత‌ల‌తో పాటు మ‌రికొన్ని అంశాలు త‌న దృష్టికి వ‌చ్చిన‌ట్టు గంటా స్వ‌రూప ప‌వ‌న్‌టుడేకి తెలిపారు.. ముఖ్యంగా ఇక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిన విషయం త‌న దృష్టికి వ‌చ్చిన‌ట్టు చెప్పారు.. ఏజెన్సీ వాసుల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా తీసుకుని వారికి అందాల్సిన సంక్షేమ ఫ‌లాల్ని కూడా దోచుకుంటున్న‌ట్టు గుర్తించారు.. ఇలాంటి సామాజిక స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి స్వ‌రూప సై అన్నారు.. దీన్ని జిల్లా ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకువెళ్తామ‌న్నారు.. ఈ వారాంతంలో గాని, వ‌చ్చే వారంలో గాని పూర్తి స‌దుపాయాల‌తో జ‌న‌సేన పార్టీ త‌రుపున గిరిపుత్రుల‌కి వైద్య సేవ‌లు అందించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు..

Share This:

2,269 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

One comment

  1. Masineedi kanaka raju

    Yes I like pawankalyan sir.he is a great man.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 8 =