Home / పెన్ పోటు / మమ్మల్ని అణచివేస్తుంటే-బానిసలుగా బ్రతకాలా అంటున్న బాబోరి అర‌ణ్య‌రోధ‌న‌..కాసింత ఆలోచించ‌డోస్‌!

మమ్మల్ని అణచివేస్తుంటే-బానిసలుగా బ్రతకాలా అంటున్న బాబోరి అర‌ణ్య‌రోధ‌న‌..కాసింత ఆలోచించ‌డోస్‌!

ఏడవ భాగస్వామి నుండి మూడవసారి విడిపోయిన తరువాత, కేంద్ర ప్రభుత్వము మన బాబులని పెడుతున్న బాధ వర్ణానాతీతము అంట.. నాలుగు సంవత్సరాలు చిలుకా, గోరింకల్లా కాపురము చేశారు.. విడిపోయి నట్లు నటిస్తున్నది నాలుగు-ఐదు నెలల నుంచే., అయినంత మాత్రాన‌ బానిసలుగా బతకాలా..? మీరు ఏమి చెబితే అది చేయాలా..? మా ప్రభుత్వాన్ని పడగొడతారా? మా ఆంధ్రులకు అన్యాయము చేస్తారా? అంటూ, నిన్న ఉత్తరాంధ్రలో పచ్చ కన్నీరు కారుస్తూ మన బాబు చేస్తున్న ప్రచారము ఆలోచింప చేసేదే?

విరహవేదనతో చేస్తున్న గోలనో లేక కొత్త భాగస్వామి (కాంగ్రెస్) ముందు తమ ప్రాతివత్యము చెప్పుకోవడానికో తెలియదుగాని మన బాబు వెళ్లగక్కుతున్న ఆవేదన వినతగినదే. ఎందుకంటే “నిజమైన బానిసల్లో” ఇప్పటికైనా మార్పు రావచ్చు!

తాడిత, పీడిత, బాధిత వర్గాలకు చెందిన ఓ బానిసల్లారా! ఆలోచించండి. నాలుగు నెలలకే బానిసల్లా బతకాలా అని ఆవేదన చెందుతున్నాడు మన పాలిత వర్గపు బాబు. తరాలుగా మన తాతలు, తండ్రులు, మనము ఈ బాబుల పాలనలో బానిసలుగానే బ్రతుకుతున్నాము. రేపు మన బిడ్డలు కూడా ఈ పాలిత వర్గాల పాలనలో బానిసలుగానే బతకాలా అనే ఆలోచన మనలో రాదేమిటారా..?

పాలకులకు ఉన్న నోరు, బానిస వర్గాల్లో వచ్చేదెన్నడురా? ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడుతూ పాలకుల బూట్లు పాలిష్ చేసే కుల నాయకులారా కళ్ళు తెరవండి. పాలకుడే బానిసల్లా బతకాలా అంటుంటే, బానిసవి నీలో మార్పు వచ్చేదెప్పుడురా.!!!

తరాలుగా పల్లకీలు మోస్తున్నాగాని, నీకు దక్కుతున్నది ఏమిటి? సమాజములో సంపద, వ్యవస్థల్లో ఆధిపత్యము, ప్రభుత్వములో ఆధిపత్యము లేకపోయినా గాని సమానమైన వాటా బానిసలకు ఎందుకు దక్కడము లేదు. పాలకులు వేసే ఎంగిలి మెతుకులు తింటూ బతకాలా? బిళ్ళ బంట్రోతు కూడా పట్టించుకోని పదవులు తీసికొని మన నాయకులు పాలకులకు సలాము కొడుతూ ఉంటే మనం గుడ్లు అప్పగిస్తూ చూస్తూ ఉండాలా? లే!!! ఆలోచించు.

సరే నీ బానిస పరివర్తన పక్కన పెడితే, ఆంధ్రులకు బీజేపీ అన్యాయము చేస్తున్నది అని మన బాబు అంటున్నారు. మరి కాంగ్రెస్ ఆంధ్రులకు చేసినది ఏమిటి? తలుపులు మూసి విడగొట్టి నడి రోడ్డుపై విసిరేసిన కాంగ్రెసుతో బాబు ఎందుకు సహజీవనం చేయడానికి నిర్ణయించారు? నిన్నటివరకు తిట్టిన కాంగ్రెసుతో బాబు నేడు ఎందుకు జత కడుతున్నారు.

అంటే బాబు ఎవరితో కాపురము చేస్తే, అఖిలాంధ్రులందరు అన్నీ మూసుకొని, దానికి తాళాలు వాహించాలా? బాబుకి మొహం మొత్తి విడిపోతే, మనం కూడా విడిపోవాలా? ఏ ప్రాతిపదికపై బీజేపీ అన్యాయము చేసినది అంటున్నారు. ఏ ప్రాతిపదికపై కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొంటున్నారు. ఇంతబ్రతుకు బతికి ఇంటివెనకాలా చచ్చేడు అన్నట్లు, బాబుల భాగస్వాములకు తాళాలు వేస్తూ మనమంతా బతకాలా?

బీజేపీని వదిలినట్లు నటిస్తూ కాంగ్రెసుతో సంబంధాలు పెట్టుకొన్న మన పచ్చ పార్టీలు, రేపు దొడ్డ దొరల పార్టీలతో కూడా రహస్య సంభందాలు పెట్టుకోవడము వాస్తవము. ఎందుకంటే బానిసల దగ్గర బానిసల్లా బ్రతికేకంటే, దొడ్డదొరలతో ఒప్పందమే బెటర్ అనే పాలక వర్గాల ఆలోచన బయటపడింది.

బానిస సోదర సోదరీమణులారా! నిజం తెలిసికొండి. రాబోయే ఎన్నికల్లో సరిఅయిన నిర్ణయము తీసికోండి. పాలకులు కారుస్తున్న పచ్చ కన్నీరులో ఉన్నది పన్నీరునా లేక ప్రజలందరిని మత్తులోకి దించే “పచ్చ నల్ల ముందు”నా?

Share This:

1,509 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 13 =