Home / పెన్ పోటు / “మహా అవకాశవాద కూటమి”కి గాల్లో కలిసిన ప్రాణాల కంటే ఓట్లకై పొత్తులే ముఖ్యమా..?

“మహా అవకాశవాద కూటమి”కి గాల్లో కలిసిన ప్రాణాల కంటే ఓట్లకై పొత్తులే ముఖ్యమా..?

మిగులు బడ్జెటు కల తెలంగాణా రాష్ట్రములో బస్సులకు ఫిట్నెస్సులేక, సరిఅయిన టైరులు లేక బ్రేకులు లేక, బస్సులన్నీ మృత్యు శకటాల్లా తయారు అయ్యాయి. బస్సు/పడవ/ రైలు ప్రయాణము అంటే తిరిగి వస్తామో రామో అన్నట్లు, యమపురికి ప్రయాణమే అన్నట్లు తయారు అయ్యాయి. మొన్న ఆంధ్ర. నేడు తెలంగాణ. కక్కుర్తి పైసలు కోసము అనుమతిలేని రూటులలో, పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపేస్తుంటే సరిచూసే నాధుడే లేడు. ప్రతిపక్షానికి అడిగే దమ్మే లేదు. ఎత్తిచూపే మీడియానే లేదు. ఇది ప్రజా స్వామ్యమా లేక ఓట్ల కోసము, టీఆర్పీ రేటింగులు కోసము, ఎన్నికల పొత్తుల కోసము కొట్టుకు చచ్చే అవకాశవాద పార్టీల రాజ్యమా?

ఒక లక్ష ఖర్చు పెట్టి బస్సుని సరిచేసి, ఫిట్నెస్సుతో నడిపితే, ప్రజల ప్రాణాలు మిగిలేవి. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని ప్రభుత్వాలు, శవాలకు మాత్రము నష్ట పరిహారము నిస్తూ, తమ తప్పుల నుండి తప్పించుకొంటున్నాయి. రాజకీయ పార్టీలకు కావాలిసిన ప్రచారము కోసము శవాలకు విలువ కట్టడము కాదు పోయిన ప్రజల ప్రాణాలకు విలువ కట్టడము చేయాలి. ప్రమాదం జరిగిన తరువాత యువరాజ వారు, యువరాణి వారు వెళ్లిన హెలికాప్టర్ ఖర్చు, మృతులకు ఇచ్చే నష్టపరివారము, మిగిలిన వ్యయాలు కలిపితే సుమారు 30 కోట్లు రూపాయిలు అయినా ఖర్చు ఉంటుంది. ఈ డబ్బు ప్రమాదాలు జారగకముందే, బస్సుల ఫిట్నెస్సు మీద పెట్టి ఉంటే, రాష్ట్రములో ఉన్న డొక్కు బస్సులన్నింటికీ రిపేరుకి పనికి వచ్చి ఉండేది. నిన్న 58 ప్రాణాలను కూడా కాపాడగలిగేవాళ్ళము.

ప్రమాదానికి బాధ్యుడంటూ ఒక్క డిపో మేనేజర్’ని విధులనుండి తాత్కాలికంగా తొలగిస్తే సరిపోతుందా? సంబంధిత మంత్రి బాధ్యుడు కాదా? వారి అధినాయకుడు ముఖ్య మంత్రి బాధ్యుడు కాదా? ప్రభుత్వ బస్సులకు ఫిట్నెస్ ఉన్నదో లేదో నిత్యము ఎత్తిచూపడములో విఫలమైన ప్రతిపక్షాలు బాధ్యులు కాదా? జనసేనుని తిట్టడానికి మాత్రమే పని చేసే డబ్బా మీడియా భాధ్యులు కాదా? ఎక్కడో రైలు ప్రమాదం జరిగినదని, కేంద్ర రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన రోజులు ఎక్కడికి పోయాయి?

అధికార పార్టీకి ముందస్తు ఎన్నికలు తప్ప ఏమి అవసరము లేదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రములో డొక్కు బస్సులు నడపాలిసిన గతి ఏమిటి అని అడగకుండా, తాయిలాలు అలవాటు చేశారు. పోతే పక్కోడి ప్రాణమే. నాది కాదు. తాయిలాలు ఉంటే చాలు, ప్రాణాలు ఉన్నా లేక పోయినా పరవాలేదు అనుకొనే ప్రజలు ఉన్నంతకాలము అధికార పార్టీకి అడ్డూ అదుపూ ఉండదు.

డొక్కు బస్సుతో ఘోరాతి ఘోరమైన ప్రమాదం జరిగి, సుమారు 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే, ప్రతిపక్షాలు అన్నీ అవకాశవాద మహా కూటమి పేరుతో జరిగే మంతనాల్లో మునిపోయాయి. డొక్కు బస్సు అయితే నేమి? పోయేది ప్రజల ప్రాణాలే కదా అనుకొనే నేటి ప్రతిపక్షాలు ఉన్నా లేక పోయినా ఏమి ప్రయోజనము? పరస్పర విరుద్ధమైన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అంట. వీరికి సిద్దాంతాలు, విలువలు, ఏమి అవసరము లేదు. పదవే ముఖ్యము. ఇటువంటి పార్టీల సిద్దాంతాల కంటే వ్యభిచారి శీలము నీతివంతమైనది అని అనుకోవాలేమో!!!

నేటి పాతుకుపోయిన సిగ్గులేని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రయోజనము లేదు. ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోయినప్పుడే ఈ పార్టీలు చలిస్తాయి. అధికారము కాపాడుకోవడము కోసము అధికార పార్టీ, అధికార పార్టీని దింపడము కోసము ప్రతిపక్షాలు, తమ కుల పార్టీలను కాపాడుకోవడము కోసము మీడియా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

కమ్యూనిస్టు పార్టీల పేరు వింటే మనస్సులోనైనా ఒక్కసారి నమస్కరించుకొనేవాల్లము. అటువంటి సిద్దాంతాల పునాదులపై కమ్యూనిస్టు పార్టీలు పుట్టాయి. కానీ నేడు పాలిత వర్గాల వారే కమ్యూనిస్టు పార్టీలను ఆక్రమించుకొని, కమ్యూనిస్టు పార్టీలను “కమ్మాయిస్టు” పార్టీలు లేదా “దొడ్డాయిస్టు” పార్టీలుగా మార్చేశారు అనే అనుమానము నిజమవుతున్నది.

పార్టీలు ఏమైనా, తెలంగాణాలో దొడ్డలు అందరూ ఒక్కటవుతున్నారు. వారికి కమ్యూనిస్టులు (కమ్మ్యూనల్ ఇష్టులు) వంతపాడుతున్నారు.. ఆంధ్రాలో కమ్మని వర్గానికి భయపడి కమ్యూనిస్టులు (కమ్మ్యూనల్ ఇష్టులు) కూడా వంత పాడబోతున్నాయి అనే వారి సంఖ్య పెరుగున్నది. ప్రజలరా! వ్యభిచారులంటే హీనంగా పొత్తులు పెట్టుకొంటూ పాతుకుపోయిన రాజకీయ పార్టీలుమీముందుకు రాబోతున్నాయి. నేటి రాజకీయ పార్టీల అవకాశవాద పొత్తులపై, ప్రభుత్వ ముందస్తు ఎన్నికలపై ఒక్క సారి ఆలోచించండి.

“నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులౌతారో, అమ్ముకొని, ఓడిపోయి బానిసలౌతారో నిర్ణయం మీ చేతుల్లో ఉంది” అని డా.బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. నేటి రాజకీయ పార్టీల ముసుగులని తొలగించి చూసి ఓటు వేయడము చేర్చుకోండి? మీ బిడ్డల భవిత కోసమే గాని పరుల కోసము కాదు సుమా!

Advertisement.

Share This:

1,224 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + 13 =