Home / ఎడిటోరియల్స్ / మాటా.. చేతా.. బాటా.. ఒక్క‌టే.. అందుకే అంద‌రికీ జ‌న‌సేనుడు స్ఫూర్తి ప్ర‌ధాత‌..

మాటా.. చేతా.. బాటా.. ఒక్క‌టే.. అందుకే అంద‌రికీ జ‌న‌సేనుడు స్ఫూర్తి ప్ర‌ధాత‌..

pairport-1 pawan-kalyan-janasena-party-meeting-quotes-sayings-dialogues-quotesadda

నాకో చ‌ట్టం.. నీకో చ‌ట్టం.. ఒకరికి ఒక చ‌ట్టం.. ఇంకొక‌రికి ఇంకో చ‌ట్టం కాదు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసినా త‌ల‌తీసే చ‌ట్టం తెస్తాం.. జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన రోజున జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పిన మాట ఇది.. ఆవేశంలో చెప్పిన మాటా కాదు.. పొలిటిక‌ల్ వాగ్దానం అంత‌కంటే కాదు.. తాను ఆచ‌రించి., అనుస‌రించే మాట అది.. కోట్లాది మంది అభిమానులు.., స‌ర్కారునే శాసించ‌గ‌ల ద‌మ్ము., ఊ కొడితే కోట్లు కాళ్ల ముందు కుమ్మ‌రించే భ‌క్తులు.. ఇది ఆయ‌న శ‌క్తి.. ఎంతవున్నా.. సామాన్యుల్లో సామాన్యుడిగా క‌ల‌సి పోవ‌డం.. రూల్‌ని ఫాలో అవ‌డం వంటి విష‌యాల్లో జ‌న‌సేనాని త‌ర్వాతే ఎవ‌రైనా…

ఒక్క‌సారి ఎమ్మెల్యేగానో, ఎంపిగానో గెలిచారంటే., ఎవ‌ర్ని లెక్క‌చేయ‌ని నాయ‌కులున్న నేటి రోజుల్లో., హ‌నుమంతుడితో స‌మాన‌మ‌గు శక్తి, చాణ‌క్యుడితో స‌మాన‌మైన యుక్తి ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత ఒదిగి ఉంటాడో.. ఈ కింది వీడియో చూస్తే తెలిసిపోతుంది.. వ్య‌వ‌స్థ మీద ఆయ‌కి ఎంత గౌర‌వం ఉందో.. వ్య‌వ‌స్థ‌ని న‌డిపించే విష‌యంలో ఆయ‌న‌కున్న స్ప‌ష్ట‌త‌..


ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వ‌ద్ద ఆగి., మొత్తం చెక్ చేయించుకుని ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చారు.. ఉద్దానం ప‌ర్య‌ట‌న‌కు విశాఖ ఎయిర్‌పోర్టుకి వ‌చ్చిన‌ప్ప‌టి దృశ్యం ఇది.. వాస్త‌వానికి జ‌న‌సేనాని అక్క‌డ నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేదు.. కానీ ఓ రూల్, ఓ చ‌ట్టం.. దాన్ని పాటించే విష‌యంలో తానూ.. సామాన్యుడినేన‌ని జ‌న‌సేనాని చెప్ప‌క‌నే చెప్పారు.. ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు జ‌నానికి స్ఫూర్తి ప్ర‌ధాయ‌క మైన‌వే., ఎదుటివారు దాన్ని స్వీక‌రించే విధానాన్ని భ‌ట్టి అభిప్రాయం ఉంటుంది.. ఎవ‌రెమ‌న్నా., అనుకున్నా.. ప‌వ‌న్ నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట పూర్తి నిబ‌ద్ద‌త‌, నిజాయితీతో కూడుకున్న‌వ‌ని ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు చెప్ప‌క‌నే చెబుతాయి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

img-20170221-wa0044

అధికారంతో జ‌న‌సేనుడ్ని ఆప‌గ‌ల‌రా..? ప‌చ్చ స‌ర్కారుకి ఎందుకీ ఉలిక్కిపాటు..

ఓ వైపు అధికారం.. మ‌రోవైపు జ‌నం బ‌లం.. రెండింటిలో మొగ్గు ఎవ‌రి వైపు.. అధికారం తాల్కాలికంగా గెలిచాన‌నుకున్నా., అంతిమంగా జ‌న‌బ‌లం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 6 =