Home / ఎడిటోరియల్స్ / మాన‌వ‌త్వానికి నిలువెత్తు ప్ర‌తిరూపం జ‌న‌సేనాని..

మాన‌వ‌త్వానికి నిలువెత్తు ప్ర‌తిరూపం జ‌న‌సేనాని..

img-20170103-wa0127

మాన‌వ‌త్వం.. ఈ ప‌దం ఎక్క‌డో విన్న‌ట్టుందే అనుకుంటున్నారా.. ఈ రోజుల్లో ఈ ప‌దం గురించి మాట్లాడుకోవ‌డం, విన‌డం చాలా అరుదేలెండీ.. ఓ అన్న‌మో రామ‌చంద్ర అనే జ‌నం., మ‌రో ప‌క్క ఆ అన్నం ఎక్కువై పారేసే పెద్ద‌మ‌నుషులు.. రోడ్డు ప‌క్క‌న మనిషి ప్రాణం పోతుంద‌న్నా., క‌నీసం అటు త‌ల‌తిప్పి కూడా చూడ‌రు.. ఇలాంటి వ్య‌వ‌స్థ‌లో మాన‌వ‌త్వం అన్న ప‌దం ఎక్క‌డ విన‌బ‌డుతుంది.. అయితే జ‌న‌సేనాని ఇచ్చాపురం ప‌ర్య‌ట‌న‌లో అది అంద‌రికీ క‌న‌బ‌డింది.. విన‌బ‌డింది కూడా.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కిడ్నీ బాధితుల ప‌రామ‌ర్శ‌కి సంబంధించిన కార్య‌క్ర‌మం చూసిన అంద‌రూ., మాన‌వ‌త్వానికి రూపం ఏదైనా ఉందంటే., అది జ‌న‌సేనానే అని చెప్పుకుంటున్నారు….

img-20170103-wa0170 img-20170103-wa0172

పేద గొప్ప త‌ర‌త‌మ బేధాలు లేకుండా సాటి మ‌నిషి విలువ తెలిసిన వాడే మ‌హాత్ముడు.. మ‌ణికంఠ మ్యాక్స్‌లో ఉద్దానం బాధితుల ప‌రామ‌ర్శ కార్య‌క్ర‌మంలో భాగంగా., కేవ‌లం చిన్న‌పాటి ఇంట్ర‌డ‌క్ష‌న్ మాత్ర‌మే ఇచ్చి., వారి స‌మ‌స్య‌ల్ని చెప్పుకునే అవ‌కాశం ఉద్దానం కిడ్నీ బాధితుల‌కే ఇచ్చారు ప‌వ‌ర్‌స్టార్‌..సామాన్యుల్ని కుర్చీలో కూర్చోబెట్టి తాను నిల‌బ‌డ్డాడు., కింద కూర్చున్నాడు.. వారు మాట్లాడుతుంటే మైకు ప‌ట్టుకున్నాడు.. నిల‌బ‌డ‌లేని బాధితుల‌తో పాటు నేల‌పై కూర్చుని ఓపిక‌గా వారి బాధ‌లు విన్న ఆయ‌న‌., తీవ్ర‌మైన ఆవేధ‌న‌కి గుర‌య్యారు.. ముఖ్యంగా ఓ పేషెంట్ మాట్లాడుతూ మ‌న‌సేమో బ‌త‌కాలి అనిపిస్తోంది., ఆర్ధిక ప‌రిస్థితి ఏమో చ‌చ్చిపోవాలి అనిపిస్తుంద‌న్న సంద‌ర్బంలో జ‌న‌సేనాని క‌ళ్లు చ‌మ‌ర్చాయి..

img-20170103-wa0069

అందుకే వారికి స‌త్వ‌ర న్యాయం చేసేందుకు స‌ర్కారుకి 48 గంట‌ల డెడ్ లైన్ పెట్టారు.. మూత్ర‌పిండాలు య‌మ‌గండాలుగా మారితే., పిట్టాల్లా రాలిపోతున్న జ‌నం పిల్ల‌ల్ని అనాధ‌ల్ని చేసిపోతే., వారి త‌రుపున పోరాడేందుకు నేనున్నాను అని పాల‌కుల‌కి హెచ్చ‌రిక‌లు చేశారు.. ఉద్దానం నెఫ్రోప‌తి కార‌ణంగా అనాధగా మిగిలిన ఓ బాలుడికి అదే వేదిక పై నుంచి దారి చూపిన జ‌న‌సేనాని., ఇలాంటి అనాధ‌లంద‌రికి తానున్నాన‌ని భ‌రోసా ఇచ్చారు.. రోగం ముద‌ర‌క ముందే మందేయాలి.. అందుకు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయండి.. అదీ యుద్ధ‌ప్రాతి ప‌దిక‌న‌., లేకుండా అదే ప్ర‌జ‌ల‌తో క‌ల‌సి పోరాడేందుకు తాను సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు..

img-20170103-wa0071

జ‌న‌సేన మీడియా విభాగం రూపొందించిన డాక్యుమెంట‌రీ చూసి చ‌లించిన ఆయ‌న ఎలాంటి మాన‌వ‌త్వంతో అయితే ఉద్దానం వ‌చ్చారో., అదే మాన‌వ‌త్వంతో ఈ చావుల్ని ఆపాలి అని ప్ర‌తిన‌బూనారు.. అందు కోసం ఎక్క‌డి వ‌ర‌కైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు చెప్పారు.. త‌న ఉద్దానం ప‌ర్య‌ట‌న రాజ‌కీయాల కోసం కాద‌ని., తాను వ‌స్తే ఈ స‌మ‌స్య దేశం మొత్తం తెలుస్తుంద‌న్న మాట‌ల్లో., నిజాయితీ కూడా ఇదే మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌.. ఇక్క‌డ కొస మెరుపు ఏంటంటే., నిత్యం ఒక‌రిపై ఒక‌రు క‌ల‌బ‌డుతూ., నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ తిట్టునే నేటి త‌రం నాయ‌కుల్లో క‌న‌బ‌డ‌నిది కూడా అదే..

 

Share This:

1,349 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 12 =