Home / జన సేన / మార్చ్ 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ మ‌హాస‌భ‌.. స‌భ కోసం చురుగ్గా ఏర్పాట్లు-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

మార్చ్ 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ మ‌హాస‌భ‌.. స‌భ కోసం చురుగ్గా ఏర్పాట్లు-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

జ‌న‌సైనికుల‌కి పండుగ రోజు.. ప్ర‌జా స్వామ్యవాదుల‌కి వేడుక రోజు.. జ‌న‌సేన పార్టీ ఆవిర్భ‌వించిన రోజు.. స‌రిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చ్ 14న హైద‌రాబాద్ సాక్షిగా పుట్టిన జ‌న‌సేన., ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వ్య‌వ‌హారంలో త‌న అప్ర‌తిహ‌త జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ ముందుకి సాగుతోంది.. అదే మార్చ్ 14న జ‌న‌సేనుని అభిమానించే అంతా ఓ చోట క‌ల‌సి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల సేవ‌కు పున‌రంకిత‌మ‌వుతూ భారీ స‌భ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.. జ‌న‌సేన సిద్ధాంతాలు, నాలుగేళ్ల ప్ర‌యాణంపై ప్ర‌జా వేదిక‌పై నుంచి మాట్లాడే త‌రుణం కోసం కొన్ని కోట్ల క‌ళ్లు వేచిచూస్తున్న త‌రుణాన‌.. పార్టీ అధినేత స‌భ‌కి సంబంధించిన వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించి., జ‌న‌సేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.. పార్టీ కార్యాల‌యం నుంచి విడుద‌లైన ప్ర‌క‌ట‌న ద్వారా ఈ నెల 14న జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ గుంటూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ట్టు జ‌న‌సేనాని ప్ర‌క‌టించారు..

నాలుగేళ్ల క్రితం హైద‌రాబాద్‌లో పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న‌ను స‌భా ముఖంగా ప్ర‌క‌టించిన నాటి నుంచి సాగిన ప్ర‌స్థానంపై పార్టీ అభిమానులు, నాయ‌కుల‌తో క‌ల‌సి స‌భ‌ని నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని ప‌వ‌న్ తెలిపారు.. నాగార్జునా యూనివ‌ర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జ‌ర‌గ‌నున్న ఈ మ‌హా స‌భ కోసం., 35 ఎక‌రాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న‌ట్టు జ‌న‌సేనాని చెప్పారు.. స‌భ కోసం భారీ వేదిక నిర్మాణం జ‌రుగుతున్న‌ట్టు తెలిపిన ఆయ‌న‌., ఉభ‌య తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా., ఇత‌ర రాష్ట్రాల నుంచి పార్టీ అభిమానులు, జ‌న‌సైనికులు ఈ మ‌హా స‌భ‌కి త‌ర‌లివ‌స్తున్న‌ట్టు అందుతున్న స‌మాచారం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగించిన‌ట్టు ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు..

స‌భ‌కి త‌ర‌లి వ‌చ్చే ప్ర‌తి కార్య‌క‌ర్తా క్షేమంగా స్వ‌స్థ‌లాల‌కి తిరిగి చేరుకునేలా అన్ని ర‌కాల ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. స‌భా ప్రాంగ‌ణంలో ర‌క్ష‌ణ, ఇత‌ర వ‌సతులు, స‌భ ప్ర‌తి ఒక్క‌రికీ క‌నిపించేలా చ‌ర్య‌లు, భారీకేడింగ్ ఇత‌ర ప‌నులు ప్ర‌ణాళికాబ‌ద్దంగా సాగుతున్న‌ట్టు తెలిపారు.. మార్చ్ 14వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లకి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో స‌భ ఘ‌నంగా ప్రారంభం కానుంది.. ఇక స‌భా ప్రాంగ‌ణం ఆధ్యంతం తెలుగు రాష్ట్రాల కోసం త్యాగాలు, అనిత‌ర సేవ చేసిన నాయ‌కుల‌ని గుర్తు చేసేలా నిర్మిస్తున్నారు.. స‌హా ప్రాంగ‌ణం, స్వాగ‌త తోర‌ణాలు పూర్తిగా ఆ త్యాగ‌ధ‌నుల పేర్ల‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి..

దీంతో పాటు స‌భ‌కి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల స‌మ‌న్వ‌యం కోసం విజ‌య‌వాడ వినాయ‌క్ థియెట‌ర్ ఎదురుగా ఉన్న భార‌తిన‌గ‌ర్‌లో ఓ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించిన‌ట్టు జ‌న‌సేన అధినేత త‌న ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు.. స‌భ‌కి సంబంధించి ఎలాంటి వివ‌రాలు కావాల‌న్నా., సంబంధిత కార్యాల‌యం స‌మ‌న్వ‌య ప‌ర్చ‌నుంది..

Share This:

1,843 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 7 =