Home / ఎడిటోరియల్స్ / మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల నాయ‌కులు వారం త‌ర్వాత విహార యాత్ర‌ల‌కు వెళ్లిపోయారు.. ఫ‌లితాల‌కు 40 రోజులు గ‌డువు ఉండ‌డంతో త‌మ వ్యూహ‌క‌ర్త‌ల‌ను అస‌లు రిపోర్టులు తెమ్మ‌ని పుర‌మాయించారు.. అస‌లు స‌రుకు బ‌య‌ట‌ప‌డే స‌రికి, రోజుకు ఒక్క సీటు నుంచి ప‌ది సీట్లు త‌మ ఖాతా నుంచి తీసివేస్తూ, స‌ర్వేల రూపంలో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నారు.. అయితే రాజ‌కీయాలను మార్చేస్తామంటూ ముందుకు వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు భిన్నంగా., స‌మీక్ష‌ల వ్య‌వ‌హారంలో కూడా న్యూ ఏజ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపిస్తూ వ‌స్తోంది.. ప్ర‌చార హోరు, పోలింగ్ ప‌ర్వం ముగిసిన త‌ర్వాత కొంత విరామం తీసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., సీట్లు, ఓట్ల లెక్క‌ల స‌మీక్ష‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.. కేవ‌లం పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధులు ఒక‌రితో ఒక‌రు ప‌రిచ‌యం పెంచుకునే దిశ‌గా ముఖాముఖి స‌మావేశాల‌కు తెర‌తీశారు.. తొలి విడ‌త రాజ‌కీయాల వాస‌న ఎరుగ‌ని కొత్త అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి నిర్వ‌హించిన ఆయ‌న‌., రెండో విడ‌త మ‌రో 50 మందికి పైగా ఎమ్మెల్యే, ఎంపి అభ్య‌ర్ధుల‌తో స‌మావేశం అయ్యారు.. ఏ స‌మావేశంలోనూ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్క అభ్య‌ర్ధిని కూడా ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌ని గానీ, గెలుపు అవ‌కాశాలు ఎలా ఉన్నాయ‌ని గానీ ప్ర‌శ్నించ‌లేదు.. కేవ‌లం అంద‌రి ప‌రిచ‌య కార్య‌క్ర‌మంతో పాటు ఎల‌క్ష‌నియ‌రింగ్ అనుభ‌వాల‌ను మాత్ర‌మే అడిగి తెలుసుకున్నారు.. అభ్య‌ర్ధుల‌కు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణతో పాటు ధైర్యాన్ని నూరిపోశారు.. ఓట‌మి అనే భ‌యాన్ని పార‌ద్రోలే ప్ర‌య‌త్నం చేశారు.. తాను ఓట‌మి అంచుల నుంచి రాష్ట్ర రాజ‌కీయాలు శాసించే స్థాయికి పార్టీని తీసుకువెళ్ల‌గిలిగిన‌ప్పుడు, ఓ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏ స్థాయిలో ప‌ని చేయాలి అనే అంశాన్ని పార్టీ అభ్య‌ర్ధుల‌కు నిర్ధేశం చేశారు.. ఓవ‌రాల్‌గా శాతం ఎంత అనే అంశం ప‌క్క‌న‌పెడితే రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది అన్న అంశాన్ని మాత్రం ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.. ఈ మార్పు స్థాయే ప్ర‌త్య‌ర్దుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది..

ఇక ఆదివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మం తాలూకు సారాంశం విష‌యానికి వ‌స్తే.. మార్పు మొద‌లైందనీ., అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుందనీ, ఎంత ఏంటి అనే సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని మాత్రం ఎవ్వ‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దని ఆ పార్టీ అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. జ‌న‌సేన బ‌లం తెలియ‌దు అన్న ప‌దం ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించారు.. కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త వెంట ఉన్నార‌ని అన్నారు. మీడియా, మందీ మార్బలం లేకుండా ఇంత మంది ఎన్ని కోట్లు ఇస్తే వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు. పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం భ‌యం లేదు. ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్ట‌లేదు. ఎంత పోరాటం చేశామ‌న్న అంశం మీదే నా ఆలోచ‌న‌. మార్పు కోసం మ‌హిళ‌లు చాలా బ‌లంగా నిల‌బ‌డ్డారు. గెలుస్తారా.? లేదా.? అన్న అంశం ప‌క్క‌న‌పెట్టి భ‌య‌ప‌డ‌కుండా వ‌చ్చి ఓట్లు వేశారు. పొలిటిక‌ల్ ప్రాసెస్‌లో స‌హ‌నం-ఓపిక అవ‌స‌రం. గుండె ధైర్యం కావాలి. అంతా క‌న్వెన్ష‌న‌ల్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజ‌కీయాలు చేయ‌ను. డ‌బ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఓట‌మి లోతుల నుంచి బ‌య‌టకు వ‌చ్చాను. నాకు నిగ్ర‌హం-నియ‌మం ఉన్నాయి. ఎన్నో అవ‌మానాలు, వెట‌కారాలు భ‌రించాను. 2014లో జ‌న‌సేన పార్టీ స్థాపించే స‌మ‌యంలో ఎన్ని సీట్లు వ‌స్తాయి అన్న ఆలోచ‌న చేయ‌లేదు. ఎక్క‌డో ఒక చోట మార్పు రావాలి అని మాత్ర‌మే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు. ప్ర‌జాస్వామ్యంలో అలాంటి ప‌దాల‌కు తావులేదు. అంతా పార్టీ నిర్మాణం జ‌ర‌గాలి అని స‌ల‌హాలు ఇస్తున్నారు. అది అంత తేలిక ప‌ని కాదు. అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్ర‌ట‌రీ, వారికి అది అని ఇచ్చే ప‌ద‌వులు నిర్మాణం కాదు. కొత్త‌ద‌నాన్ని త‌యారు చేస్తున్నాం. అంతా ఓ భావ‌జాల‌నికి అల‌వాటు ప‌డాలి. నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్తున్నాం. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు లీడ‌ర్స్ లేరు జ‌న‌సైనికులు మాత్ర‌మే ఉన్నారు. అదే జ‌న‌సైనికులు కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త రూపంలో మీ వెంట ఉన్నారు. అంతా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే యువ‌త‌. వారికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్ప ఎవ‌రూ తెలియ‌దు. ఎవ‌రి మాట విన‌రు. ఇదంతా ముడి స‌రుకు దాన్ని శుద్దిచేయాలి, సాన‌బ‌ట్టాలి. అందుకు నిబ‌ద్ద‌త అవ‌స‌రం. పార్ల‌మెంట‌రీ క‌మిటీలు కూర్చుని వేస్తే రెండు రోజుల్లో ముగించేయొచ్చు. రెండు వారాలు రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డితే గాని పూర్తి కాలేదు. పోరాటం చేస్తారు అన్న న‌మ్మ‌కంతోనే సీటు ఇచ్చాం. ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు డిఫెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఎవ‌రి మ‌న‌సులో అయినా మోసం చేయాల‌న్న భావ‌న వ‌స్తే అది నన్న మోసం చేసిన‌ట్టు కాదు. మీకు మీరే చేసుకున్న‌ట్టు. ఎన్ని సీట్లు గెలిచామ‌న్న దానికంటే, ఎంత ప‌ర్సంటేజ్ వ‌చ్చింది అన్న‌ది, ఎంత మందిని మార్పు దిశ‌గా క‌దిలించామ‌న్న‌దే ముఖ్యం. ముందుగా ఓట్లు వేసిన వేలాది మందిని గౌర‌వించండి. ఎంత బాగా పోరాడాం అన్న అంశం మీద ఆలోచ‌న చేయండి. స్థానిక స‌మ‌స్య‌ల మీద, స్థానిక ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టండి. మార్పు మొద‌లైంది. అది మ‌న గెలుపు. మార్పు అన్న‌ది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్న‌ది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ప‌వ‌న్ స్పీచ్ ఓట‌మి భ‌యం ఉన్న అభ్య‌ర్ధుల‌కు సైతం ఓ టానిక్‌గా పున‌రుత్తేజం క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు..

Share This:

926 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − seven =