Home / జన సేన / ముక్త‌కంఠం..శాంతి మార్గం.. రాష్ట్ర బంద్‌లో జ‌న‌సైన్యం..

ముక్త‌కంఠం..శాంతి మార్గం.. రాష్ట్ర బంద్‌లో జ‌న‌సైన్యం..

ఒక్క బ‌స్ ఆప‌లేదు.. షాప్ మూయించ‌లేదు.. కానీ జ‌న‌సైన్యం చేప‌ట్టిన ఏపీ బంద్ మాత్రం విజ‌య‌వంత‌మైంది.. శాంతియుత మార్గంలో త‌మ గ‌ళాన్ని వినిపించ‌డంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు విజ‌యం సాధించారు.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో ఏ ఒక్క‌రిపైనా విమ‌ర్శ చేయ‌కుండా., ఉద్రిక్త‌త‌లు సృష్టించ‌కుండా., త‌మ ప‌ని తాము పూర్తి చేశారు.. ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించ‌డంలో త‌మ‌వంతు పాత్ర పోషించారు..

కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూ వామ‌పక్షాలు చేప‌ట్టిన బంద్‌కు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో., ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌న‌సేన శ్రేణులు రోడ్డెక్కాయి.. పార్టీ అధినేత పిలుపు మేర‌కు శాంతియుత నిర‌స‌న‌ల్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా ఉద‌య‌మే రోడ్ల‌పైకి వ‌చ్చిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు., ప్ర‌జ‌ల‌కి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండే విధంగా నిర‌స‌న మార్గాన్ని ఎంచుకున్నారు.. చాలా చోట్ల మౌన‌ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు.. జాతీయ నాయ‌కులు, స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుల విగ్ర‌హాల వ‌ద్ద త‌మ ఆందోళ‌న‌ని చేప‌ట్టారు..

న‌ల్ల రిబ్బ‌న్ల‌తో జాతీయ నాయ‌కుల విగ్ర‌హాల వ‌ద్ద బైఠాయించి.. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే., ప్ర‌త్యేక హోదా నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదాన్ని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ., ఒక్క మాటా మాట్లాడ‌కుండా బ‌లంగా వినిపించారు..

ఇచ్చాపురం నుంచి త‌డ వ‌ర‌కు.. తిరుప‌తి నుండి హిందూపురం వ‌ర‌కు ఎక్క‌డా ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా., జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చూపిన సంయ‌మ‌న స్ఫూర్తి ప్ర‌త్య‌ర్ధుల‌ని సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి.. చాలా శిభిరాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న తెలిపే ప్ర‌దేశాల‌కి మిగిలిన పార్టీల కార్య‌క‌ర్త‌లు కూడా వ‌చ్చి సంఘీభావం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం..

ముఖ్యంగా బంద్ కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయానికి సంబంధించిందే అయినా., ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రోసారి జ‌న‌సైన్యం జ‌నంలోకి తీసుకువెళ్ల‌గ‌లిగింది.. మిగిలిన పార్టీల నాయ‌కులు, పాత్రికేయులు సైతం హోదా విష‌యంలో జ‌న‌సేనతో గొంతుక‌లిపారు.. ఓవ‌రాల్‌గా ముక్త‌కంఠంతో జ‌న‌సైనికులు జ‌న‌సేనుడి మాటే త‌మ బాటని చాటారు.. అదే స‌మ‌యంలో శాంతి మంత్రంతో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్నారు..

మొద‌టిసారి సినిమా అభిమానులు అన్న విమ‌ర్శ‌ను తొల‌గించుకుని., తాము పూర్తి స్థాయి రాజ‌కీయ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌మ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చాటిచెప్పారు.. పార్టీ అధినేత గీసిన గీత దాటేది లేద‌ని తెలియ‌జెప్పారు..

Share This:

1,656 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =