Home / జన సేన / ముఖ్య‌మంత్రిగారూ.. ఆరోగ్యంగా జీవించే హ‌క్కు అంద‌రికీ లేదా..? డంపింగ్ యార్డ్ సాక్షిగా జ‌న‌సేనుడి ప్ర‌శ్న‌..

ముఖ్య‌మంత్రిగారూ.. ఆరోగ్యంగా జీవించే హ‌క్కు అంద‌రికీ లేదా..? డంపింగ్ యార్డ్ సాక్షిగా జ‌న‌సేనుడి ప్ర‌శ్న‌..

ఎక్క‌డ చూసినా చెత్త.. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్ఘంధం.. 25 గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా అన్నం తిన‌లేని దుస్థితి.. కంటి నిండా నిద్ర పోలేని దారుణ‌మైన ప‌రిస్థితులు.. తినే తిండే కాదు పండే పంట‌కు నీరంద‌ని ప‌రిస్థితి.. ఈ కంపు దెబ్బ‌కి 200 మంది విద్యార్ధుల్ని తీర్చిదిద్దే ఓ స్కూల్ మేత‌ప‌డ‌గా., భీమ‌వ‌రానికే త‌ల‌యానిక‌గా నిలిచే డిఎన్ఆర్ క‌ళాశాల విద్యార్ధులు సైతం ఈ కంపు పీల్చుకుంటూ చ‌దువుకోవాల్సిందే.. ఏళ్ల త‌ర‌బ‌డి అప‌రిష్కృతంగా ఉన్న య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ పక్క‌న ఉన్న భీమ‌వ‌రం డంపింగ్ యార్డ్ బాధితుల క‌న్నీటి గాధ ఇది.. ప‌శ్చిమ పోరాట‌యాత్ర‌లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి స్థానికులు ఈ స‌మ‌స్య‌ను తీసుకురాగా., తాను డంపింగ్ యార్డ్ ప్రాంతానికి వ‌చ్చి ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్తాన‌ని మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట మేర‌కు శ‌నివారం ఆయ‌న య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ ప్రాంతంలో ప‌ర్య‌టించారు..

భీమ‌వ‌రం స‌మీపంలో ప‌ట్ట‌ణం చెత్త మొత్తం య‌న‌మ‌దుర్రు కాలువ‌గ‌ట్టుపై ఏళ్ల త‌ర‌బ‌డి డంప్ చేస్తూ వ‌స్తున్నారు.. చినుకు ప‌డితే ఒక బాధ‌, ప‌డ‌కుంటే ఒక బాధ‌.. కాలువ గ‌ట్టు మొత్తం బుర‌ద‌య‌మంగా మారి బ‌రించ‌లేని దుర్వాస‌న‌.. అక్క‌డ బాధితుల వెత‌లు ఆల‌కించేందుకు బుర‌ద‌లో సుమారు కిలో మీట‌రు పొడుగు న‌డిచారు.. డంపింగ్ యార్డ్ వ‌ల్ల సుమారు 25 గ్రామాల ప్ర‌జ‌లు నిత్యం ఈ దుర్వాస‌న‌, దోమ‌లు, ఈగ‌ల‌తో ప‌డుతున్న అవ‌స్థ‌లు బాధితుల నోటి నుంచి విని చ‌లించిపోయారు.. భీమ‌వ‌రం డంపింగ్ యార్డ్ కోసం 10 ఎక‌రాల భూమిని సేక‌రించి ఏళ్లు గ‌డుస్తున్నా., దాన్ని ఏర్పాటు చేయ‌లేద‌న్న విష‌యాన్ని బాధితులు జ‌న‌సేనుడి ఎదుట ఉంచారు..

బాధితుల వెత‌లు ఆల‌కించి, అక్క‌డ నివ‌సిస్తున్న చిన్నారుల దుస్థితిని చూసి జ‌న‌సేనాని క‌ళ్లు చ‌మ్మ‌గిల్లాయి.. య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ స‌మ‌స్యను జ‌న‌సేన పార్టీ ప‌రిష్క‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.. స‌మ‌స్య ఉన్న చోటు నుంచే ప్ర‌శ్నించే జ‌న‌సేనుడు., సిఎం చంద్ర‌బాబుని డంపింగ్ యార్డ్ సాక్షిగా నిల‌దీశారు.. ముఖ్య‌మంత్రిగారూ ఆరోగ్యంగా జీవించే హ‌క్కు మీకు, మీ పిల్ల‌ల‌కే కాదు య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ ప‌క్క‌న నివ‌సించే పిల్ల‌ల‌కి కూడా ఉందంటూ ధ్వ‌జ‌మెత్తారు.. బాధిత చిన్నారుల‌తో కూడా విజ్ఞ‌ప్తి చేయించారు.. భావి భార‌త పౌరులం అయిన మాకు ఆరోగ్యంగా జీవించే హ‌క్కు ఉంది.. ఒక్క మీ పిల్ల‌ల‌కే కాదు మాకూ ఉంది.. ద‌య‌చేసి ఆరోగ్య‌క‌ర‌మైన భీమ‌వ‌రాన్ని ఇవ్వండి ముఖ్య‌మంత్రి గారు అంటూ విజ్ఞ‌ప్తి చేయించారు..

ప్ర‌జా స‌మ‌స్య‌లు తాను తెలుసుకోవ‌డం మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్ల‌డం ద్వారా పాల‌కుల‌కి క‌నువిప్పు క‌లిగించాల‌న్న త‌న సిద్ధాంతాన్ని భీమ‌వ‌రం డింపింగ్ యార్డ్ స‌మ‌స్య విష‌యంలోనూ అమ‌లుప‌రిచారు.. మ‌రి ప్ర‌పంచం చెవిన ప‌డిన ఈ స‌మ‌స్య‌, పాల‌కుల చెవిన ప‌డిందో..? లేదో..? వేచిచూడాలి..

Share This:

664 views

About Syamkumar Lebaka

Check Also

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని దారులు అటువైపే.. తారా స్థాయికి ప్ర‌వాసగ‌ర్జ‌న హీట్‌..!!!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అల‌జ‌డి మొద‌లైంది.. డ‌ల్లాస్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ర్జన‌కి ముహుర్తం ఖ‌రారైన రోజునే ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 4 =