Home / ఎడిటోరియల్స్ / ముగిసిన జ‌న‌సేనుడి డెడ్‌లైన్‌.. లెక్క‌లు చెప్ప‌ని కేంద్ర‌-రాష్ట్రాలు.. విమ‌ర్శ‌లే బ‌దులు..

ముగిసిన జ‌న‌సేనుడి డెడ్‌లైన్‌.. లెక్క‌లు చెప్ప‌ని కేంద్ర‌-రాష్ట్రాలు.. విమ‌ర్శ‌లే బ‌దులు..

విభ‌జ‌న హామీల లెక్క‌లు తేల్చేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌రుపున వ‌కాల్తా తీసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న భిన్న‌మైన ప్ర‌క‌ట‌న‌ల నిగ్గు తేల్చేందుకు JFC(Joint Fact Finding Committee)ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.. JFC ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.. ఎందుకంటే ఎక్క‌డా ర‌హ‌స్యం అనేది లేకుండా., JFC విధివిధానాలు ఆయ‌న సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌లోనే ప్ర‌జ‌ల‌కి తేట‌తెల్లం చేశారు.. JFCలో ఆయ‌న స‌భ్యుడు కూడా కాదు..రాజ‌కీయాల‌కి అతీతంగా ఏర్పాటు చేసిన JFC., రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కేంద్రం రాష్ట్రానికి చేసిన న్యాయం ఏంటి..? ఎన్ని నిధులు ఇచ్చింది.. ఈ వ్య‌వ‌హారంలో రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న ఏంటి..? ఏపీకి నిధుల కేటాయింపు వ్య‌వ‌హారంలో ఇరుప‌క్షాల వాద‌న‌లు భిన్నంగా ఉన్న నేప‌ధ్యంలో., ప్ర‌జ‌లు తిక‌మ‌క ప‌డుతున్న నేప‌ధ్యంలో., ఎవ‌రు చెప్పేమాట నిజం.. ఎవ‌రు చెబుతోంది అబ‌ద్దం అన్న విష‌యాన్ని అదే ప్ర‌జ‌ల‌కి తెలియ‌జెప్పే ఉద్దేశంతోనే ఈ JFCని ఏర్పాటు చేశారు.. కేంద్ర‌-రాష్ట్రాల ముందు నాలుగు రోజుల క్రితం మీడియా ముఖంగా ఓ విజ్ఞాప‌న కూడా ఉంచారు.. మీరు చెప్పే లెక్క‌లపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తే., ఎవ‌రు చెప్పేది నిజం.. ఎవ‌రు చెబెతోంది అబ‌ద్దం అన్న విష‌యాన్ని JFC(Joint Fact Finding Committee) నిర్ధారిస్తుంది.. ప్ర‌జ‌ల ముందు ఉంచుతుంది అని స్ప‌ష్టం చేశారు.. ఇక్క‌డ ఆయ‌న కేంద్ర‌-రాష్ట్రాల‌ని ప్ర‌శ్నించ‌డానికి కార‌ణం అంద‌రిలాగే త‌న మ‌న‌సులో రేగిన అనుమానం ఒక‌టైతే., గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల గెలుపు కోసం త‌న‌వంతు సాయం అందించినందుకు గాను., వారి కోసం ఓట్లు అడిగినందుకు గాను., ప్ర‌జ‌ల‌కి జ‌వాబుదారీగా ఉండాల‌న్న ఆలోచ‌న రెండోది..

ఇక్క‌డ జ‌న‌సేన అధినేత వేసిన ప్ర‌శ్న త‌న ఒక్క‌డికి తోచింది కాదు.. ఎవ‌రి వ్య‌క్తిగ‌త‌మూ అంత‌కంటే కాదు.. ప్ర‌జ‌ల‌కి.. వారి సొమ్ము లెక్క చెప్ప‌మ‌న్నారంతే.. లెక్క‌లు చెప్పేందుకు ఆయ‌న ఇచ్చిన గ‌డువు(డెడ్‌లైన్‌) ఫిబ్ర‌వ‌రి 15, గురువారంతో ముగిసింది.. అయితే గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రు అంటే భుజాలు త‌డుముకున్న చందంగా ఉంది.. పాల‌క‌ప‌క్షాల ప‌రిస్థితి.. ఓ వైపు అధికారుల్ని రంగంలోకి దించి డ్రామాలు చేయిస్తూ., మ‌రోవైపు లెక్క‌లు అడిగినందుకు జ‌న‌సేన అధినేత‌పై విమ‌ర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.. ఆ విమ‌ర్శ‌ల్లో కూడా క‌నీసం కామ‌న్‌సెన్స్ లేదు.. ఒక ప‌చ్చ‌చొక్కా వారు సామాజిక మాధ్య‌మాల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా రెమ్యూనిరేష‌న్ ఎంత అని ప్ర‌శ్నిస్తారు.. ఐటీ ఎంత క‌ట్టార‌ని అడుగుతారు.. జ‌న‌సేన అధినేత ఐటీ స‌రిగా కట్ట‌లేదు అన్న అనుమానం ఉంటే., ఆయ‌న‌పై వెంట‌నే ఆధాయ‌పు ప‌న్నుశాఖ అధికారుల‌తో దాడులు చేయించండి.. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. మీక‌ది పెద్ద ప‌నేం కాదు.. అస‌లు విష‌యానికి వ‌స్తే జ‌న‌సేన అధినేత అడిగింది చంద్ర‌బాబుగారి ఆస్తుల లెక్క‌లో., మోడీగారి సూట్‌ల వివ‌రాలో కాదు.. ప్ర‌జ‌ల సొమ్ము.. ప్ర‌జ‌లు ఓట్లేసి గెలిపించిన ప్ర‌భుత్వాల‌కి ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల‌కి లెక్క చెప్పాల్సిన బాధ్య‌త ఉంది.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు.. ఆ ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా ఒక‌రు.. టీడీపీ అధికారంలో ఉంది కాబ‌ట్టి., ప్ర‌భుత్వ ఖ‌జానా అంతా మా పార్టీ సొత్తు అని భావిస్తే ఎలా..? అలా భావిస్తే ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోరు.. మీ చేతిలో ఉన్న అధికారం మ‌రికొద్ది నెల‌ల్లో ముగుస్తుంది.. ఆ విష‌యం తెలుసుకోండి ముందు.. ఇది ఐదు కోట్ల ఆంధ్ర‌ల మాటే..

ఇక గౌర‌వ శాస‌న స‌భ్యుడి హోదాలో ఉన్న ఓ క‌మ‌ల‌నాధుడికి కేంద్రాన్ని ప్ర‌శ్నించినందుకు కాలింది.. పైగా ఆయ‌న రాజుగారు.. ఆ కావ‌ర‌మో., లేక క‌నీసం రాజ్యాంగ ప్రాధ‌మిక సూత్రాలు కూడా తెలియ‌వో అర్ధం కావ‌డం లేదు.. ఏం అధికారం ఉంద‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అడిగితే లెక్క‌లు చెప్పాల అన్న‌ది ఈయ‌న‌గారి ప్ర‌శ్న‌.. అయ్యా మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌రుపున చెబుతున్నాం., ఆయ‌న ఆడిగింది మీ ఆస్తుల లెక్క‌లు కాదు.. మీరు స‌ద్వినియోగం చేశామ‌ని చెబుతున్న ప్ర‌జాధ‌నం లెక్క‌లు.. ఓట‌మి అంచున మిమ్మ‌ల్ని గెలిపించేందుకేమో అదే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కావాలి.. ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డితేనేమో., ఆయ‌న మీకు శ‌త్రువు.. మీ ద‌గ్గ‌ర నిజాయితీ ఉంటే ఆ ఉలిక్కిపాటు ఏలా..? కొంప‌తీసి మీరు అదే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ చెబుతున్న లెక్క‌ల్లో బొక్క‌లు గాని ఉన్నాయా.. ఏంటి..?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో మీ ప్ర‌తి అడుగు ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు.. జ‌న‌సేన అధినేత‌కి లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా., రేపు ప్ర‌జ‌ల‌కి మాత్రం ఖ‌చ్చితంగా లెక్క‌లు చెప్పాల్సిందే గుర్తుంచుకోండి.. అన‌వ‌స‌ర ప్రేలాప‌న‌ల‌తో టైం పాస్ చేయ‌కుండా ముందు లెక్క‌లు JFC(Joint Fact Finding Committee) ముందు ఉంచండి.. ఇది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల డిమాండే..

Share This:

5,590 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 4 =