Home / జన సేన / ముగిసిన జ‌న‌సేన ఆశావ‌హుల స్క్రీనింగ్ ప్ర‌క్రియ‌.. అభ్య‌ర్ధిత్వం కోరుతూ 2410 ద‌ర‌ఖాస్తులు..

ముగిసిన జ‌న‌సేన ఆశావ‌హుల స్క్రీనింగ్ ప్ర‌క్రియ‌.. అభ్య‌ర్ధిత్వం కోరుతూ 2410 ద‌ర‌ఖాస్తులు..

జ‌న‌సేన అధినేత పిలుపుతో రాజ‌కీయాల‌ని మార్చేసేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ముందుకి వ‌చ్చారు.. రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటూ ప్ర‌క్షాళ‌న అసాధ్యం అని భావించే వారు, అవ‌కాశం వ‌స్తే స‌త్తా చాటాల‌ని ఎదురు చూస్తున్న వారు జ‌న‌సేన పార్టీ ఇచ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకున్నారు.. జ‌న‌సేన పార్టీ త‌రుపున త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలోకి దిగేందుకు త‌మ అభ్య‌ర్ధిత్వాన్ని ప‌రిశీలించాల‌ని కోరుతూ స్క్రీనింగ్ క‌మిటీకి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు.. ఈ నెల 12న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీకి త‌న మొద‌టి బ‌యోడేటాని స‌మ‌ర్పించ‌గా., 13 నుంచి 25 వ‌ర‌కు సుమారు 12 రోజుల పాటు స్క్రీనింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది.. నిత్యం వంద‌ల సంఖ్య‌లో బ‌యోడేటాలు స్క్రీనింగ్ క‌మిటీ ముందుకి వ‌చ్చాయి.. క‌మిటీ స‌భ్యులు మాదాసు గంగాధ‌రం, పి.హ‌రిప్ర‌సాద్‌, అర్హంఖాన్‌, టి.శివ‌శంక‌ర్‌, మ‌హేంద‌ర్‌రెడ్డిలు త‌మ ముందుకి వ‌చ్చిన ప్ర‌తి బ‌యోడేటానీ క్షుణ్ణంగా ప‌రిశీలించి, అభ్య‌ర్ధుల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.. చివ‌రి రోజు వ‌చ్చిన 260 బ‌యోడేటాల‌తో క‌లిపి., స్క్రీనింగ్ క‌మిటీ ముందుకి మొత్తం 2410 మంది ఆశావ‌హులు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు.. పార్టీ అధినేత బాట‌లో జ‌న‌సేన పార్టీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న ప్ర‌ముఖులు, నాయ‌కులు సైతం త‌మ బ‌యోడేటాలు స్క్రీనింగ్ క‌మిటీ ముందు ఉంచారు.
చదువుకున్న యువతతోపాటు వృత్తి నిపుణులు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు, మహిళలు జనసేన అభ్యర్థిత్వం కోసం బయో డేటాలు సమర్పించారు. డాక్టర్లు, ఐ.టీ. నిపుణులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉన్నతాధికారులు, రక్షణ రంగంలోనివారు జనసేన తరఫున బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన యువత త‌మ బయో డేటాలను ప‌రిశీల‌న‌కి ఇచ్చారు. పాత్రికేయ వృత్తిలో ఉంటూ స‌మాజాన్ని, రాజ‌కీయాన్ని ద‌గ్గ‌ర నుంచి చూస్తున్న జ‌ర్న‌లిస్టులు కూడా జ‌న‌సేనాని త‌ల‌పెట్టిన య‌జ్ఞంలో మేము సైతం అంటూ ముందుకి వ‌చ్చారు.. జనసేనాని పవన్ కల్యాణ్ సంకల్పం, పార్టీ సిద్ధాంతాలు తమను ఉత్తేజితుల్ని చేశాయనీ, పార్టీ తరఫున పని చేయాలనే ఆకాంక్ష తమలో ఉందని బయో డేటాలు ఇచ్చినవారు స్క్రీనింగ్ కమిటీకి చెప్పారు.. 25 ఏళ్ల భవిష్యత్ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తాను అనే జ‌న‌సేనాని మాటలోని చిత్తశుద్ధి యువ ఆశావహుల్లో చైతన్యం నింపింది.. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని బయో డేటాలను విశ్లేషించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఆశావహుల నేపథ్యం, విద్యార్హతలు, ప్రజా సమస్యలపై, రాజకీయాలపై ఉన్న అవగాహన తదితర అంశాలను విశ్లేషించేందుకు స్క్రీనింగ్ కమిటీ నేతృత్వంలో ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

Share This:

499 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − eleven =