Home / పవన్ టుడే / ముగిసిన పొలాచ్చీ షెడ్యూల్‌.. హైద‌రాబాద్ తిరిగొచ్చిన కాట‌మ‌రాయుడు..

ముగిసిన పొలాచ్చీ షెడ్యూల్‌.. హైద‌రాబాద్ తిరిగొచ్చిన కాట‌మ‌రాయుడు..

15726380_1821740584773806_6985837993767903641_n 15727278_1821740648107133_8592363720915024947_n

జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ కాట‌మ‌రాయుడు పొలాచ్చీ షెడ్యూల్ ముగిసింది.. దాదాపు రెండు వారాల షెడ్యూల్ అనంత‌రం ప‌వ‌న్‌., హైద‌రాబాద్‌కి తిరిగి చేరుకున్నారు.. కేర‌ళ‌లోని పొలాచ్చి టూర్ ఆధ్యంతం హాట్ హాట్‌గా సాగింది.. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే., మ‌రోవైపు పాలిటిక్స్‌పైనా దృష్టి సారించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం ప్ర‌క‌టించారు.. ఐదు అంశాల‌పైనే జ‌న‌సేనాని ప్ర‌శ్నాస్త్రాలు సంధించిన‌ప్ప‌టికీ., వారం రోజుల పాటు ఈ ట్వీట్ ఫైట్ స‌ర్వ‌త్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

capture img-20161220-wa0090

అటు కాట‌మ‌రాయుడు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను పొలాచ్చీలో చిత్రీక‌రించారు.. ఇక్క‌డ షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు లోకేష‌న్ నుంచి ఏదో ఒక ఫొటో సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల్ని ప‌లుక‌రించాయి.. ప‌క్క రాష్ట్రాల్లో ఉన్న ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు ఆయ‌న్ని క‌లిసేందుకు ఔట్ డోరే క‌రెక్ట‌ని భావించిన చాలా మంది కేర‌ళ వెళ్లి., లోకేష‌న్‌లో సంద‌డి చేశారు..

img-20161224-wa0085 img-20161224-wa0084

ఇక షెడ్యూల్ ముగింపుకి గుర్తుగా హీరోయిన్ శృతీహాస‌న్‌లో క‌లిసి ఉన్న ఓ స్టిల్ క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ కానుక‌గా అభిమానుల్ని అల‌రిస్తోంది.. నెట్టింట అ పిక్ వైర‌ల్ అయ్యింది.. ప‌వ‌న్ సేన‌కు సంబంధించిన అన్ని వాట్స‌ప్ గ్రూప్‌లు ఈ లేటెస్ట్ పిక్‌ని త‌మ గ్రూప్ ఐకాన్‌గా మార్చేశాయి.. త్వ‌ర‌లో కాట‌మ‌రాయుడు ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని చిత్రం యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు.. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న కాట‌మ‌రాయుడు ఉగాది కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకి రానుంది..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 3 =

%d bloggers like this: