Home / సేన సేవ / మృత్యువుతో ప‌సి హృద‌యాల పోరాటం.. ప‌వ‌న్‌ని క‌ల‌వాల‌న్న ఆరాటం..

మృత్యువుతో ప‌సి హృద‌యాల పోరాటం.. ప‌వ‌న్‌ని క‌ల‌వాల‌న్న ఆరాటం..

img-20161223-wa0120 img-20161223-wa0123

వారంతా చేయ‌ని త‌ప్పుకి శిక్ష అనుభ‌విస్తున్న ప‌సి హృద‌యాలు.. త‌ల్లిదండ్రులు పోతూ పోతూ భ‌యంక‌ర‌మైన HIVని వారి ఆన‌వాలుగా త‌మ‌ పిల్ల‌ల శ‌రీరాల్లో వ‌దిలి వెళ్తే., ఆ రోగాన్ని అనుభ‌విస్తూ నిత్యం న‌ర‌కాన్ని భ‌రిస్తున్నారు.. త‌ల్లిగ‌ర్భం నుంచి భూమిపై ప‌డే స‌మ‌యానికే ఆ భ‌యాన‌క HIV వైర‌స్ ఈ అభాగ్యుల శ‌రీరాల్లోకి భాగ‌మై ఉంది.. త‌ల్లిదండ్రుల నుంచి వీరికి ఈ వ్యాధి సంక్ర‌మించింది.. వ్యాధిని వీరిని భూమి మీద వ‌ద‌లి., అమ్మానాన్న‌లు కాలం చేశారు.. అందులో కొంద‌రు వృద్దులైన అమ్మ‌మ్మ‌లు, నాన్న‌మ్మ‌ల ద‌గ్గ‌ర పెరుగుతుంటే., కొంద‌రు బంధువుల ఆద‌ర‌ణ‌కు కూడా నోచుకోక అనాధ‌లుగా మిగిలారు.. పుట్టిన నాటి నుండి నిత్యం మృత్యువుతో పోరాడ‌టం మిన‌హా వీరు చేయ‌గ‌లిగింది లేదు..

img-20161223-wa0116 img-20161223-wa0121

ఇలాంటి ప‌సి హృద‌యాల‌ను చేర‌దీసి., వారి జీవితాల్లో ఓ ఆశ‌ని., వారికంటూ మేమున్నాం అనే కొత్త చుట్టాల్ని ప‌రిచ‌యం చేసింది స్నేహ‌మిత్ర చిల్డ్ర‌న్స్ ట‌స్ట్‌.. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ 123 మంది HIV బాధిత పిల్ల‌ల్ని గుర్తించి., ప్ర‌తి నెలా వారిని ఆసుప‌త్రికి తీసుకువెళ్ల‌డం., న్యూట్రీషియ‌న్ ఫుడ్ అందించ‌డం లాంటి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.. అంతేకాదు నెల‌లో రెండు రోజులు పూర్తిగా వీరి కోసం స‌మ‌యం కేటాయిస్తున్న స్నేహ‌మిత్ర నిర్వాహ‌కులు., అంద‌ర్నీ ఓ చోట చేర్చి., ఒక‌రికి ఒక‌రికి సంబంధ బాంధ‌వ్యాలు ఏర్ప‌ర్చారు.. అన్న‌, అక్క‌, చెల్లి, త‌మ్ముడు, ఫ్రెండ్స్ త‌మ‌కు ఉన్నార‌న్న ఆలోచ‌న రేకెత్తించి., బ‌తుకుమీద ఆశ రేపారు..

2012 నుంచి ఇలా త‌ల్లిదండ్రులు చ‌నిపోయి., బంధువుల వ‌ద్ద జీవ‌శ్చ‌వాల్లా కాలం వెళ్ల‌దీస్తున్న ప‌సి హృద‌యాలకి సాయం చేసే ప‌నిని భుజాన వేసుకున్న స్నేహ‌మిత్ర చిల్డ్ర‌న్స్ ట్ర‌స్ట్ నిర్వాహ‌కుడు శివ‌ప్ర‌సాద్‌., వృత్తి రిత్యా కేబుల్ ఆప‌రేట‌ర్‌. సేవా కార్య‌క్ర‌మాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న ఆయ‌న‌., 2002 నుంచి ప్ర‌భుత్వ స‌హ‌కారంతో జిల్లా వ్యాప్తంగా HIV అవ‌గాహ‌నా స‌ద‌స్సులు నిర్వ‌హించే వారు.. ఆ స‌మ‌యంలో ఇలాంటి పిల్ల‌ల‌కి ఏదో ఒక‌టి చేయాల‌న్న ఆలోచ‌న‌తో స్నేహ‌మిత్ర ట్ర‌స్ట్ ఏర్పాటు చేశారు.. గ‌త నాలుగేళ్లుగా ఈ ట్ర‌స్ట్ 123 మంది HIV బాధిత పిల్ల‌ల్ని చేర‌దీసింది.. ప్ర‌తి నెలా పిల్ల‌లంద‌ర్నీ వారి వారి ఇళ్ల నుంచి కాకినాడ పెద్దాసుప‌త్రికి తీసుకువ‌చ్చి మందులు ఇప్పించ‌డం., న్యూట్రీషియ‌న్ ఫుడ్ అందించ‌డంతో పాటు అంద‌ర్నీ ఓ చోట చేర్చి ఆట‌ల పోటీలు నిర్వ‌హిస్తూ., వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. వారంద‌ర్నీ ఓ చోట చేర్చి హాస్ట‌ల్ లాంటి కేర్ టేక‌ర్ హోం నిర్వ‌హించాల‌ని ఆశ ఉన్నా., అంత స్థోమ‌త లేకపోవ‌డంతో ఆగిపోయారు.. ప్ర‌భుత్వం ఏదైనా భ‌వ‌నం నిర్మించి సాయం చేస్తే., వారి బాధ్య‌త తీసుకునేందుకు ఈ సంస్థ సిద్దంగా ఉంది..

ఇక ఈ 123 మంది పిల్ల‌లో ఆరుగురు ఊహ తెలిసిన నాటి నుంచి జ‌న‌సేనాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి భ‌క్తులు.. మృత్యువు నిత్యం చెంత‌నే ఉండ‌డంతో., ఏ నిమిషాన క‌భ‌ళిస్తుందో అన్న భ‌యం వారికి లేదు.. కానీ ఓ కోరిక మాత్రం ఉంది.. తుదిశ్వాస విడిచేలోపు త‌మ ఆరాధ్య దైవం, అభిమాన న‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఓ సారి క‌ల‌వాలి.. త‌మ బాధ‌లు చెప్పుకుని., గుండెల్లో భారాన్ని దింపుకోవాలి.. ఆయ‌న‌తో ఓ ఫొటో దిగి., ఆ సంతృప్తితో ఈ జీవితాన్ని చాలించాల‌న్న‌దే వారి కోరిక‌.. ఈ ఆరుగురిలో సుధ అనే పాప పరిస్థితి విష‌మంగా ఉంది.. చివ‌రి క్ష‌ణాల్లో మృత్యువుతో పోరాడుతోంది.. మిగిలిన ఐదుగురు తామైనా బ‌తికుండ‌గా జ‌న‌సేనాని క‌లుస్తామా అన్న అనుమానంలో ప‌డిపోయారు.. ఆ అభాగ్యుల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిపించేందుకు స్నేహ‌మిత్ర ట్ర‌ష్ట్ నిర్వాహ‌కులు చాలా మందిని సంప్ర‌దించారు.. కాకినాడ స‌భ సంద‌ర్బంగా వారి కోరిక తీర్చాల‌ని చూసినా వీలుప‌డ‌లేదు.. ఇప్పుడు జ‌నసేన సైన్యంలో ఓ భాగ‌మై జ‌న‌సేవ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న గంటా స్వ‌రూప ఆ బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.. ప‌వ‌న్ అపాయింట్ మెంట్ ఇస్తే., ఆ పసి హృద‌యాల చివ‌రి కోరిక తీర్చేందుకు వారిన ఎక్క‌డికైనా తీసుకువెళ్తాన‌ని హామీ ఇచ్చారు.. స్నేహ‌మిత్ర చిల్డ్ర‌న్స్ ట్ర‌ష్ట్‌కి కూడా జ‌న‌సేన పార్టీ త‌రుపున అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు..
img-20161223-wa0112 img-20161223-wa0113

 

Share This:

1,586 views

About Syamkumar Lebaka

Check Also

ఆ జ‌న‌సేన అభ్య‌ర్ధి గెలిస్తే.. పుంగ‌నూరు ప్ర‌గ‌తి ప‌థ‌మే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీసుకురాబోతున్న మార్పు ఏ స్థాయిలో ఉంటుందంటే.., ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెలుపు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − two =