Home / పవన్ టుడే / మొద‌లైన కాట‌మ‌రాయుడు సంక్రాంతి సంబ‌రాలు.. టీజ‌ర్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్‌..

మొద‌లైన కాట‌మ‌రాయుడు సంక్రాంతి సంబ‌రాలు.. టీజ‌ర్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్‌..

img-20161229-wa0046khaidurayudu

అదిరిపోయే పోస్ట‌ర్ల‌తో నూత‌న సంవ‌త్స‌రాన్ని ఆహ్వానించి. పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల్లో నూత‌నోత్సాహాన్ని నింపిన కాట‌మ‌రాయుడు టీమ్‌. సంక్రాంతి సంబ‌రాలు మొద‌లు పెట్టేసింది.. క‌నుమ రోజున లేటెస్ట్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది.. అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్ సూప‌ర్ మాస్ లుక్‌తో అద‌ర‌గొడుతోంది.. ఎడ్ల బండిపై కాట‌మ‌రాయుడు కాలుపెట్టి నిల్చున్న ఈ న్యూలుక్ పోస్ట‌ర్‌తో రేపు విడుద‌ల కానున్న టీజ‌ర్‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి..

img-20161229-wa0020

సంక్రాంతి కానుక‌గా శ‌నివారం కాట‌మ‌రాయుడు టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ వెల్ల‌డించారు.. జ‌న‌సేనుడి చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ టీజ‌ర్ నిజంగానే పండుగ చేయ‌నుంది.. అఫీషియ‌ల్ యూ ట్యూబ్ అకౌంట్ ద్వారా విడుద‌ల కానున్న ఈ టీజ‌ర్., తెలుగు తెర‌పైనే కాదు., ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో స‌రికొత్త రికార్డులు సృష్టించాల‌ని ప‌వ‌న్ అభిమానులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.. ఇప్ప‌టికే అంచ‌నాల‌కు మించి ఈ యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో స‌బ్‌స్క్రైబ్ అయిపోయారు.. లైక్‌లు, వ్యూస్ విష‌యంలో తొలి రోజు రికార్డులు మొత్తం కాట‌మ‌రాయుడు దెబ్బ‌కి తుడిచిపెట్టుకు పోతాయ‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు.. కాట‌మ‌రాయుడి టీజ‌ర్‌కి ఇప్ప‌టికే కౌంట్ డౌన్ మొద‌లైంది.. ఇక విడుద‌లే త‌రువాయి..

Share This:

714 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =