Home / పవన్ టుడే / మొద‌లైన కాట‌మ‌రాయుడు సంరంబం.. ఐదు రోజులు సంద‌డే సంద‌డి..

మొద‌లైన కాట‌మ‌రాయుడు సంరంబం.. ఐదు రోజులు సంద‌డే సంద‌డి..

img-20161228-wa0049

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌తి అడుగూ సంచ‌ల‌న‌మే.. షూటింగ్‌లో ఫోటోల ద‌గ్గ‌ర్నుంచి పోస్ట‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌.. ఎప్పుడు ఏది విడుద‌ల అవుతుందా అని తెలుగు ప్రేక్ష‌కులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం.. ఆ క్రేజీని దృష్టిలో ఉంచుకుని కాట‌మ‌రాయుడు టీమ్‌., ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ఫుల్‌ గిఫ్ట్‌తో సూప‌ర్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.. బుధ‌వారం నుంచి ఐదు రోజుల పాటు సంబ‌రాలు ప్ర‌క‌టించిన చిత్ర బృందం., భూమిని బ‌ద్ద‌లుకొట్టుకుంటూ బ‌య‌టికి వ‌చ్చిన ప‌వ‌ర్‌స్టార్ అడుగుల‌ను పోస్ట‌ర్ రూపంలో విడుద‌ల చేసింది.. సాయంత్రం ఐదు గంట‌ల‌కి రిలీజ్ అయిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే ప్ర‌కంప‌న‌లు రేపుతోంది..

img-20161228-wa0053 img-20161228-wa0057 img-20161228-wa0058

ఇప్ప‌టికే అభిమానులు వాట్స‌ప్ గ్రూప్స్‌, ఫేస్‌బుక్ వాల్‌పోస్ట‌ర్లుగా ప‌వ‌ర్ స్టార్ అందెల‌ను పెట్టేశారు.. ఐదు రోజుల సంబ‌రాలు అని నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ప్ర‌క‌టించ‌డంతో., రాబోయే స‌ర్‌ప్రైజ్ కోసం అంతా వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు..

krayudu1

ఇక  కొత్త ఏడాది అడుగు పెడుతున్న వేళ‌., అన్నింటిక‌న్నా బిగ్ స‌ర్‌ప్రైజ్ కూడా ఉంటుందంట‌.. అదే కాట‌మ‌రాయుడు టీజ‌ర్ అని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్‌..
అదే జ‌రిగితే., ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి 15 రోజుల ముందే సంక్రాంతి వ‌చ్చేసిన‌ట్టే.. బీ రెఢీ ఫ్రెండ్స్‌..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =

%d bloggers like this: