ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజలు ఓట్లేయాలి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ తీరు కాస్త విడ్డూరంగానూ, ఆ పార్టీ అధినేత పొకడలు వింతగానూ జనానికి తోస్తున్నాయి..తండ్రి మరణానంతరం శవాన్ని పక్కనపెట్టుకుని , శవరాజకీయంతో సిఎం పీఠం ఎక్కేద్దామనుకున్న ప్రతిపచ్చ నేత, అది దక్కకపోవడంతో అప్పటి నుంచి అదే ధ్యాసలో ఉండిపోయారు.. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నారు.. జనసేన దెబ్బకి సిఎం సీటు దూరమై, ప్రతిపక్ష నేత సీటు దక్కింది.. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై విరహ వేదన మరింత పెరిగిపోయింది.. ఒక్క ముక్కలో చెప్పాలంటే మతిభ్రమించి, ప్రతిపక్ష హోదాలో ప్రజల తరుపున పోరాటం చేయాల్సింది పోయి, నేనే సిఎం, నేనే సిఎం అంటూ రోడ్ల వెంట పడ్డారు.. ఆ ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న యావ, ప్రజా సమస్యలపై లేకపోవడంతో., ప్రజల్లో వ్యతిరేకత, చీత్కారం పెరిగిపోయాయి.. దీంతో తనకి తాను జాకీలు వేసి లేపుకునే పనిలో పడ్డారు.. ఆపరేషన్ సర్వేకి రూపకల్పన ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియా మినహా, పచ్చ మీడియా మద్దతు దక్కదు.. సాక్షీ మీడియాలో సర్వే వేస్తే., జనం నమ్మరు.. అందుకే జాతీయ మీడియాకి ఆ జాకీలు వేసే పనిని అప్పచెప్పారు.. మొన్నటికి మొన్న మూడున్నర కోట్ల జనాభాలో 10 వేల మంది అభిప్రాయాలతో ఇండియాటుడే అనే మీడియా సంస్థ జగనే సిఎం అని తేల్చేసింది.. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ వంతు వచ్చింది..
మొన్నటి సర్వే పది వేల మంది అభిప్రాయాలతో మూడున్నర కోట్ల మంది అభిప్రాయాన్ని ఎలా నిర్ణయిస్తారు అంటూ జనం దుమ్మెత్తిపోయడంతో., ఈ సారి ఎంత మంది అభిప్రాయాలు స్వీకరించారు అనే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించారు.. ప్రతి ముగ్గురిలో ఇద్దరి అభిప్రాయాలు తీసుకున్నామని చెబుతూ, రిపబ్లిక్ టీవీ, సి-ఓటర్ పల్స్ అంటూ కొత్త డ్రామాని రక్తి కట్టించే పనిని భుజాన వేసుకుంది.. ఇక్కడ కూడా ప్రధాన లక్ష్యం జనసేనకి జనం మద్దతు లేదని చెప్పడం, అదే సమయంలో సిఎం పీఠం జగన్దేని చాటడం.. ఆ పనిని అయితే బాగానే చేసేసింది గానీ, ఒక్క చోట పప్పులో కాలేసింది.. కాంగ్రెస్-బీజేపీలకి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ శాతాన్ని చూపించింది.. స్వతహాగా భారతీయ జనతా పార్టీ ఇంటి ఛానల్ అయిన రిపబ్లిక్ టీవీ, కాషాయపార్టీ జగన్‌తో చేసుకున్న తెరవెనుక ఒప్పందానికి విలువనిచ్చిందో, జగన్‌కి జాకీలు వేసేందుకు ప్యాకేజీ పుచ్చుకుందో తెలియదు గానీ జనం జగన్‌కి జై కొట్టారు, రెండో స్థానంలో టీడీపీ ఉంది అని చెప్పేసింది.. ఇక ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి మూడో స్థానం ఇచ్చింది.. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆంధ్రులకి ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగో స్థానంలో నిలబడింది.. ఇవన్నీ ఒక ఎత్తయితే రెండు ప్రధాన పార్టీలకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న జనసేన పార్టీకి ఓట్ల శాతం కేవలం 8 నుంచి 9 వరకు ఇచ్చింది.. అది కూడా వామపక్ష పార్టీలతో కలిపి.. రాష్ట్రాన్ని మోసం చేసిన వారికీ, మోసం చేస్తున్న వారికీ జనం ఓట్లు వేస్తామన్నారంట.. ప్రజా సమస్యలని భుజానికెత్తుకుని పోరాటం చేస్తున్న పార్టీకి, నిత్యం ఏదో ఒక మూల ప్రజా సేవలో తరిస్తున్న పార్టీ పట్ల జనం విముఖత వ్యక్తం చేశారంట.. అంటే ఈ సర్వేకి నిబద్దత లేదా..? లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరం తీరాక వదిలేసే రకమో..? రిపబ్లిక్ టీవీ-సి.పల్స్ సర్వే నిర్వాహకులకే తెలియాలి..
ఇప్పుడు జాతీయ మీడియాలో ఎన్నికల పండుగ మొదలయ్యిందన్న ఇంకో టాక్ కూడా జోరుగా నడుస్తోంది.. అది ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో వచ్చిన పండుగ కాదు.. నెలకి ఒక సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే రూపంలో వచ్చిన పండుగ అంట.. ఏపీలో మీడియా మొత్తం అధికార ప్రతిపక్షాల చేతుల్లో రెండు భాగాలుగా విడిపోయి ఉండడంతో., అక్కడ మీడియా వేసే వార్తల్ని సైతం జనం నమ్మడం లా.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ముందుకి వచ్చిన జాతీయ మీడియా సంస్థలు, నెల వారీ సీజనల్ ఆఫర్లు ప్రకటించినట్టు తెలుస్తోంది.. ఎన్నికల వరకు నెలకి ఒకటి చొప్పున పెయిడ్ సర్వేలతో జనాన్ని మోసం చేయడమే ఆ ఆఫర్.. జాతీయ మీడియాతో ఉన్న సాన్నిహిత్యం, ప్రస్తుతం కాషాయ పార్టీతో ఉన్న పొత్తు నేపధ్యంలో జగన్ ఆ ఆఫర్‌ని క్యాచ్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఆఫర్ మేరకు గత నెల ఇండియాటుడే, ఈ నెల రిపబ్లిక్ టీవీ, ఇక మీదట కూడా జాతీయ మీడియా సర్వే పేరుతో వరుసగా జగన్‌దే గెలుపు అంటూ హడావిడి కానరావడం ఖాయం..
ఇంకో కొసమెరుపు ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ఉద్యమాలకి, ప్రజా సమస్యలకి జాతీయ మీడియాలో చోటు లేదు.. 10 లక్షల మంది రొడ్డెక్కితే దానికి కవరేజీ లేదు.. ఉద్దానం లాంటి తీవ్రమైన సమస్యలపై స్పందన లేదు.. కానీ వీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల పల్స్ చెప్పేస్తారు.. ఈ సర్వేల్లో నిబద్దత కొలవడానికి ఇంతకంటే ఎక్కువ చెప్పనవసరం లేదనుకుంటా..!!!!