Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / మ‌య‌లోకాధీసుడు.. పెట్టాడు మ‌హిళ‌ల నెత్తినా చెయ్యి.. ఇది నాలుగేళ్ల న‌య‌వంచ‌న కాదా..?

మ‌య‌లోకాధీసుడు.. పెట్టాడు మ‌హిళ‌ల నెత్తినా చెయ్యి.. ఇది నాలుగేళ్ల న‌య‌వంచ‌న కాదా..?

డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు బ్యాంకుల్లో మీరు తీసుకున్న రుణాలు ఒక్క రూపాయి కూడా చెల్లించ వ‌ద్దు.. 2014 ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో తెలుగుదేశం పార్టీ చీఫ్‌.. మిస్ట‌ర్ చంద్ర‌లోకాధీశ ఇచ్చిన హామీ ఇది..బాబోరు అధికారంలోకి వ‌చ్చి నాలుగున్న‌రేళ్లు గ‌డ‌చినా., డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ ఊసే లేదు.. అందుకు నిద‌ర్శ‌నం 2014 నుండి 2018 వరకు ఎటువంటి డ్వాక్రా రుణ మాఫీ జరుగలేదు అని అసెంబ్లీ సాక్షిగా సదరు మంత్రివర్యులు చేసిన నిర్ధార‌ణే.. ఇది మ‌హిళ‌ల్ని ల‌క్షాధికారులుగా మారుస్తామ‌న్న బాబోరు., అదే మ‌హిళ‌ల్ని బ్యాంకులు ముక్కుపిండి మ‌రీ రుణాలు వ‌సూలు చేస్తుంటే., చేష్ట‌లుడిగి చూస్తుండ‌డం ఎంత ధ‌గా..ఇది..!!

స్థానిక సంస్థలలో మహిళలకు ౩౩శాతం రిజర్వేషన్స్ అన్న ప్రభుత్వము, అసెంబ్లీకి ఎందుకు ౩౩శాతము రిజర్వేషను అనడము లేదు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు అని అంటున్న టీడీపీ ప్రభుత్వము ఎన్టీఆర్ సతీమణిని ఎందుకు దూరము పెట్టారు? ఎన్టీఆర్ సతీమణి ఆధిపత్యాన్ని అంగీకరించలేక కాదా ఎన్టీఆర్’ని పదివీచ్యుణ్ణి చేసింది..? పాలకుల కుటుంబాలకు ఒక రూల్, ప్రజలకు మరొక రూలా? ఎన్టీఆర్ సతీమణిగా ఆమె ఏవిధమైన తప్పు చేయకపోయినా, ఒక మహిళ అనే అక్కసుతో ఆమెను అణచివేయడము తప్పు కాదా? ఇది మహిళా వ్యతిరేకం కాదా..? ఇది మహిళలకు చేస్తున్న మోసము కాదా..?

తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన తరువాత మహిళలపై జరిగిన దాడులకు గాను సుమారు 281 కేసులు రాష్ట్రములో నమోదు అయ్యాయి.. అని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అబద్ధమా..? నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఉదంతముపై ప్రభుత్వము చేసినది ఏమిటి..? ప్రభుత్వ అధికారి వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే చేసిన దాడిపై ప్రభుత్వము చేసింది ఏంటి.. ? పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్త్రను చేసిన దానిపై ప్రభుత్వము చేసినది ఏమిటి? వీటిపై ప్రభుత్వము దోషులకు వ్యతిరేకముగా, మహిళలకు అనుకూలముగా వ్యవహరించిందా..???

ఊరుకోక మద్యంషాపు, వీధికొక బెల్ట్ షాప్ అన్నట్లు ఉన్న ప్రభుత్వ మధ్య విధానము మహిళల జీవితాలను బాగుచేద్దామన్నా లేక “బాబు” పరివారము వశం చేద్దామనా? ప్రభుత్వము ఇచ్చే రేషన్ బియ్యము కోసం, పెన్షన్ కోసము, మన మహిళలు పుణ్యభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ ఎంత అవమానాలు పాలు అవుతున్నారో అనేది ప్రభుత్వము ఎప్పుడైనా గమనించిందా..?

“కాల్ మనీ” రాకెట్’లో ఎంతోమంది మహిళలు వ‌డ్డీకాసురుల ఆకృత్యాల‌కు బ‌లైనా ప్ర‌భుత్వం నిందుతులపట్ల మెతక వైఖిరి అవలంభించింది. మహిళకు న్యాయము జరగలేదు అంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.. వాటినుండి ప్రభుత్వము తప్పించుకోగలదా..?

ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వాలపై వస్తున్న ఆరోపణలు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలు పాలకులకు వినిపించవు. ఎందుకంటే అధికార మదము వినిపించేటట్లు చేయదు. కానీ ఎన్నికల్లో ఈ మహిళలందరూ ప్రభుత్వాలకు వ్యతిరేకముగా ఓట్లు వేయడము చేసినప్పుడు తెలుస్తుంది. అప్పుడు చేసిన పాపం ప‌శ్చాత్తాపం క‌లిగించినా.,స్టోరీ బోర్డుపై అప్ప‌టికే దీ ఎండ్ అన్న బోర్డు క‌న‌బ‌డుతుంది..

ప‌చ్చ నేత‌ల ఆకృత్యాల‌న్నింటిని పంటి బిగింపు మీద భ‌రిస్తున్న ఈ వీర నారులు., బాబోరు ఇచ్చిన అమ‌లుకు నోచుకోని హామీ వ‌ల్ల నాలుగేళ్లుగా చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌వించిన చందంగా., రెట్టింపు వడ్డీలు క‌డుతూ వ‌స్తున్నారు.. ఈ మంట మాత్రం ఒక్క రోజులో చ‌ల్లార‌దు.. ఇన్నాళ్లు డ్వాక్రా మ‌హిళ‌లు దాచుకున్న సొమ్ముపై వ‌చ్చే వ‌డ్డీలో, రాయితీలో మొత్తానికి కొంత వారి అకౌంట్ల‌లో వేస్తూ., ఇదే డ్వాక్రా మ‌హిళ‌ల రుణ‌మాఫీ అన్న భ్ర‌మ‌ని క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.. ప‌రిటాల సునీత‌మ్మ‌కు., సాటి మ‌హిళ‌ల‌పై ఉదార‌మో., ప్ర‌త్య‌ర్ధుల‌కి దొరికిపోవాల్సి వ‌స్తుంద‌న్న భ‌య‌మో గానీ మొత్తానికి శాస‌న‌స‌భ సాక్షిగా అస‌లు మేట‌ర్ ఓపెన్ చేసేశారు.. దీంతో అమ్మ బాబోయ్‌.. నువ్వు మ‌రీ ఇంత మోస‌గాడివా అంటూ తిట్ల పురాణాలు అందుకుంటున్నారు.. బాబోరు ఈ తిట్లు భ‌విష్య‌త్ ఎన్నిక‌ల‌కి ప్ర‌త్య‌ర్ధుల స‌న్నాహాలేన‌న్న సంగ‌తి మీరు గుర్తిస్తే.. వారికి న్యాయం చేసిన‌ట్టేన‌ని ప్ర‌జ‌లుఅంటున్నారు..

Advertisement.

Share This:

1,206 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 4 =