Home / జన సేన / మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల ఆధారంగా ల‌క్ష కోట్ల అక్ర‌మ ఆస్తుల కేసులో ఏ2 విజ‌య‌సాయిరెడ్డి., త‌మ‌ను విచారించిన సిబిఐ అధికారి మీద సెటైర్లు వేసే ప్ర‌య‌త్నం చేశారు.. అంత‌కు ముందు త‌మ పార్టీ క‌ర‌ప‌త్రం సాక్షి స్వ‌యంగా జ‌న‌సేన పార్టీ మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తూ రాసిన రెండు, మూడు ఆర్టిక‌ల్స్‌లో స్వ‌యంగా జ‌న‌సేన పార్టీ 140 స్థానాల్లో బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. నాడు సిబిఐ జేడీ దెబ్బ‌కి జైలు కూడు తిన్న అక్క‌సో., నేడు అదే జేడీ దెబ్బ‌కి విశాఖ జిల్లాలో త‌మ పార్టీకి ద‌క్కాల్సిన ఆధిక్యం దూర‌మైపోతుంద‌న్న క‌డుపుమంటో గానీ విజ‌య‌సాయి త‌న మీద తాను ఓ బూమ్‌రాంగ్ విసురుకున్నాడు.. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన పార్టీ 88 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంది అని ఆశాభావం వ్య‌క్తం చేస్తే., దాని మీద సెటైర్ వేసే ప్ర‌య‌త్నం చేసి మ‌రోసారి త‌న బుద్ది బ‌య‌ట‌పెట్టుకున్నాడు.. జ‌న‌సేన పార్టీ మిత్ర ప‌క్షాల‌తో క‌ల‌సి 175 స్థానాల్లో బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసి కూడా., 66 స్థానాల్లోనే బ‌రిలోకి దిగారంటూ ఓ త‌ప్పుడు లెక్క త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.. అంత‌టితో ఆగ‌కుండా నిజాయితీ గ‌ల అధికారిగా రాష్ట్రప‌తి అవార్డు స్వీక‌రించిన నిప్పులాంటి జేడీ మీద అవాకులు చెవాకులు పేలారు.. మీరు ద‌ర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్న‌ట్టు రాశారా.? అంటూ జేడీని కెలికారు..

అక్ర‌మ ఆస్తుల కేసులో వారి పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని జైలు దారి ప‌ట్టించిన జేడీ ఊర‌కుంటారా..? రెండు చెంప‌లు చెళ్లు మ‌నేలా అదే ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌దులిచ్చారు.. పెద్ద‌ల స‌భ స‌భ్యుడైన విజ‌య‌సాయికి గౌర‌వంగా చుర‌క‌లు అంటించారు.. 175 స్థానాల్లో కూట‌మి పార్టీలు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో బ‌రిలోకి దిగిన విష‌యం లెక్క‌లు చెప్పిన జేడీ., మా లెక్క‌లు స‌రిగ్గానే ఉంటాయంటూ కౌంట‌ర్ ఇచ్చారు.. అందే కాదు సీఏ చ‌దివిన మీ లెక్క‌లు ఎలా త‌ప్పులు అవుతున్నాయో మాకు అర్ధం అవ‌డ‌డం లేదు అంటూ ముఖం ప‌గిలేలా పంచ్ ఇచ్చారు.. మేం స‌త్యం, న్యాయం మీద ఆధార‌ప‌డి ప‌ని చేసే వాళ్లం అన్న జేడీ., మీ త‌ప్పుడు లెక్క‌ల వ‌ల్ల ఎంతో మంది ఇరుక్కున్నారంటూ మరో లెంప‌కాయ వేశారు.. విజ‌య‌సాయిరెడ్డి-జేడీల మ‌ధ్య జ‌రిగిన ట్విట్ట‌ర్ వార్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్‌గా మారింది..

దారిన‌పోయేవాడిని కెలికి ద‌వ‌డ ప‌గ‌ల గొట్టించుకోవ‌డంలో ఏ2 రెడ్డిగారు సిద్ధ‌హ‌స్తుల‌న్న‌ది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.. అంతే కాదు నాడు-నేడు జేడీ విజ‌య‌సాయి త‌ప్పుడు లెక్క‌లు బ‌య‌ట‌పెట్టి ఆఫీస‌ర్‌గానే కాదు రాజ‌కీయాల్లోనూ నేను మీకు మొగుడినేన‌ని చాటుకున్నార‌ని జ‌నం చెవులు కొరుక్కుంటున్నారు..

Share This:

1,498 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =