Home / పోరు బాట / మ‌రో అడుగు ముందుకి సంత‌కాల సేక‌”ర‌ణం”..జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌కి హోదా మ‌ద్ద‌తు సంత‌కాలు..

మ‌రో అడుగు ముందుకి సంత‌కాల సేక‌”ర‌ణం”..జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌కి హోదా మ‌ద్ద‌తు సంత‌కాలు..

img-20161129-wa0029

సంత‌కాల సేక‌ర‌ణం ప్ర‌క్రియ మ‌రో అడుగు ముందుకి వేసింది.. మ‌న వెబ్ pawantoday.com పిలుపుతో ప్ర‌త్యేక హోదా కోసం జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సైన్యం రంగంలోకి దిగింది.. జోరుగా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతోంది.. అయితే ఉద్య‌మం మొద‌టి అడుగు మాత్రం రాజ‌ధాని న‌గ‌రం బెజ‌వాడ‌లోనే ప‌డింది.. కృష్ణాజిల్లాకి చెందిన పార్టీ యువ నాయ‌కుడు మండ‌లి రాజేష్ ఈ సంత‌కాల సేక‌ర‌ణంకు ఊపిరులూదారు.. ఓ వైపు జ‌న‌సేనాని అనంత వేదిక‌గా గ‌ర్జిస్తుంటే., బెజ‌వాడ‌లో జెయింట్ స్క్రీన్ల ద్వారా ఆ గ‌ర్జ‌న‌ను న‌లుగురికి వినిపించిన రాజేష్ సేన‌., అదే వేదిక నుంచి జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా సంత‌కాల సేక‌ర‌ణ మొద‌లు పెట్టింది.. తొలి విడ‌త‌గా 10 వేల సంత‌కాల సేక‌ర‌ణ‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆయ‌న‌., త‌న అనుచ‌ర‌గ‌ణంతో క‌లిసి దాన్ని చాలా సులువుగా అందుకున్నారు..

img-20161112-wa0001img-20161113-wa0007

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న ప్ర‌త్యేక పోరుకి ప్ర‌జ‌ల నుంచి కూడా ఆనూహ్య స్పంద‌న రావ‌డంతో రాజేష్ ప‌ని కాస్త తేలికైంది.. ఇక ప్ర‌త్యేక హోదా అంటే అవ‌గాహ‌న లేని వారికి., త‌మ సేనాని చేస్తున్న పోరాటం ఎవ‌రిపై., ఎవ‌రి కోసం అనే విష‌యాల‌ను వివ‌రించి మ‌రీ మ‌ద్ద‌తు సం త‌కాలు సేక‌రించారు.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా సేక‌రించిన ఈ సంత‌కాలు జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి చేరాయి.. 10 వేల సంత‌కాల‌కు చెందిన ప్ర‌తుల‌ను రాజేష్ స్వ‌యంగా పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య‌, మీడియా విభాగం అధిప‌తి హ‌రిప్ర‌సాద్‌ల‌కు అందించారు.. పార్టీ శ్రేణులు వీరి కృషిని అభినందించాయి.. పార్టీలో గుర్తింపు ద‌క్క‌డం ప‌ట్ల రాజేష్ కూడా అందం వ్య‌క్తం చేశారు..

img-20161112-wa0004

త‌మ తొలి అడుగు విజ‌య‌వంతంగా ప‌డిందంటున్న రాజేష్‌., ఇక జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేస్తామంటున్నారు.. ప్ర‌తి మండ‌లంలోనూ ప్ర‌త్యేక హోదాపై అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హించ‌డంతో పాటు అదే వేదిక‌ల నుంచి సంత‌కాల సేక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని తెలిపారు.. త‌మ నాయ‌కుడు చెప్పిన విధంగా త‌మ‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని., ప్ర‌జా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతామ‌న్నారు.. ఎక్క‌డ‌, ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చిన త‌మ ఓపిక మేర‌కు స్పందించి వారికి సాయం చేయ‌డంలో జ‌న‌సైనికులుగా తాము ఎప్పుడూ ముందుటామ‌న్నారు..

Share This:

1,768 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + twenty =