Home / జన సేన / మ‌రో మ‌హా స‌మ్మేళ‌నానికి రెఢీ అవుతున్న జ‌న‌సైనిక్స్‌.. త్వ‌ర‌లో భాగ్య‌న‌గ‌రి వేదిక‌గా జ‌న‌సేన IT వాలంటీర్ మీట్‌..

మ‌రో మ‌హా స‌మ్మేళ‌నానికి రెఢీ అవుతున్న జ‌న‌సైనిక్స్‌.. త్వ‌ర‌లో భాగ్య‌న‌గ‌రి వేదిక‌గా జ‌న‌సేన IT వాలంటీర్ మీట్‌..

మ‌న‌మంతా ఒక్క‌టి.. అంటూ పిడికిలి బిగించి జ‌న‌సేనుడికి మ‌హాజ్ఞానికి మేము సైతం అంటూ ముందుకి వ‌చ్చారు IT ఉద్యోగులు.. రాజ‌కీయాల్లో మార్పు, ప్రతి ఒక్క‌రికీ స్వ‌తంత్ర ఫ‌లాలు అందాలి అన్న ల‌క్ష్యంతో, పోలిటిక్స్ అంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే అంటూ క‌దిలిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌దం క‌లిపేందుకు సిద్ధం అంటూ ముందుకు వ‌చ్చిన IT ఉద్యోగులు., పార్టీకి మ‌ద్ద‌తుగా సామాజిక మాధ్య‌మాల్లో త‌మ‌వంతు ప్ర‌చారం చేస్తున్నారు.. జ‌న‌సేన‌కి తోడుగా ఐటీ ఉద్యోగుల క‌ద‌లిక ఒక్క అడుగుతో మొద‌లై ఇప్పుడు విశ్వ వృష్టిగా మారింది.. ఇప్పుడు భాగ్య‌న‌గ‌రి వేదిక‌గా జ‌న‌సేన IT వాలంటీర్ మీట్ పేరుతో ఓ మ‌హా స‌ముద్రమై ప‌ర‌వ‌ళ్లు తొక్క‌నుంది..

”మాకు కీ బోర్డు నొక్క‌డ‌మే కాదు.. మేం త‌ల‌చుకుంటే వంద‌లాది మంది చేత ఈవీఎంలో ఓట్లు సైతం గుద్దించ‌గ‌ల‌మన్న” నినాదంతో IT ఎంప్లాయిస్ క‌దిలారు.. జ‌న‌సేనుడి య‌జ్ఞానికి త‌మ‌వంతు స‌హ‌కారం అందించేందుకు చేయి చేయి క‌లపాల‌ని నిర్ణ‌యించారు.. మొద‌టి మీట్ బెంగ‌ళూరులో ప‌దుల సంఖ్య‌లో IT ఉద్యోగుల‌తో మొద‌లైంది, మొన్న‌టి హైద‌రాబాద్ జ‌న‌సేన IT వాలంటీర్ మీట్‌కి ఆ సంఖ్య వెయ్యికి చేరింది.. జ‌న‌సేన పార్టీకి మేముసైతం, మ‌ద్ద‌తు ఎలా ప‌ల‌కాలి..? గ్రామ స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి త‌మ వంతు చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాలు ఏంటి..? అనే అంశాల‌పై పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్ స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటూ ముందడుగు వేస్తున్నారు..

ఇప్పుడు మ‌రో మ‌హా అడుగుకి IT సిద్ధ‌మైంది.. ఓ విశిష్ట అతిధి ఈ మీట్‌కి సార‌ధ్యం వ‌హించ‌నున్నారు.. భాగ్య‌న‌గ‌రి వేదిక‌గా త్వ‌ర‌లో దేశంలోని వివిధ న‌గ‌రాల్లో ప‌నిచేస్తున్న IT ఉద్యోగుల‌తో పాటు, విదేశాల్లో ప‌నిచేస్తున్న IT ఎంప్లాయిస్ సైతం ఈ మ‌హాస‌మ్మేళ‌నానికి రానున్నారు.. ఈ మ‌హా స‌మ్మిట్‌(జ‌న‌సేన IT వాలంటీర్ మీట్‌)కి హాజ‌రుకావాలంటే ముందుగా www.V4Janasena.com వెబ్ సైట్ నందు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది..

ప్ర‌తి 10 సెకండ్ల‌కు 50 subscriptions..

జ‌న‌సేన IT మీట్‌కి ఎన్రోల్ మెంట్స్ ఊహించ‌ని స్థాయిలో దూసుకుపోతున్నాయి.. ప్ర‌తి 10 సెకండ్ల‌కు 50 మంది వెబ్‌సైట్‌లో స‌బ్‌స్క్రైబ్ అవుతున్నారు.. ఈ సారి మీట్‌కి విశిష్ట అతిధి హాజ‌రుకానుండ‌డంతో., వేల సంఖ్య‌లో IT ఉద్యోగులు ఒక్క చోటుకి చేర‌నున్నారు.. ప్ర‌తి IT ఎంప్లాయి ఈ ప్ర‌తిష్టాత్మ‌క మీటింగ్ కోసం త‌మ‌వంతు స‌హ‌కారం అందిస్తున్నారు.. శ‌త‌ఘ్నులు ఎదురు వ‌చ్చినా వెన్నుచూప‌ని సైన్యాన్ని ఓ దేశ‌పు ర‌క్ష‌ణ‌ద‌ళంతో స‌మంగా జ‌న‌సేనుడికి కానుక‌గా ఇవ్వాల‌న్న‌దే వారి ల‌క్ష్యం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఓ నూత‌న అధ్యాయాన్ని ర‌చించేందుకు మేముసైతం అశృవొక్క‌టిధార‌పోస్తాం అంటున్నారు.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ మ‌హామీట్‌లో భాగస్వాములు కాద‌ల‌చిన వారు www.V4Janasena.com వెబ్‌సైట్‌లో వివ‌రాలు ఎన్రోల్ చేసుకోగ‌ల‌రు.. జ‌న‌సేన ఐటీ వాలంటీర్ మీట్ స‌మ‌యం, స్థ‌లం మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు..

Advertisement..

Share This:

3,578 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + 6 =