Home / పోరు బాట / మ‌ళ్లీ జ‌నంలోకి జ‌న‌సేనాని.. సీమ జిల్లాలో మీటింగ్‌..? హోదా సాధ‌నే అజెండా

మ‌ళ్లీ జ‌నంలోకి జ‌న‌సేనాని.. సీమ జిల్లాలో మీటింగ్‌..? హోదా సాధ‌నే అజెండా

pspkff
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగించాల‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నారు.. అందుకోసం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు .. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి బీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న వంతు పోరాటం చేస్తూనే., ప్ర‌త్యేక హోదా నినాదానికి మ‌రింత ప‌దును పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.. అందుకోసం ముందుగా అనుకున్న‌ట్టే అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించే విధంగానే పార్టీ కార్యాచ‌ర‌ణ ఉండ‌బోతోంది.. కాకినాడ స‌భ‌లో అభిమాని మృతి జ‌న‌సేనానిని ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేయ‌డంతో., ప‌బ్లిక్ మీటింగులకి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌త్య‌ర్ధుల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌వ‌న్ సైన్యం మాత్రం ఆయ‌న నిర్ణ‌యానికి పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు ప‌లికింది.. జ‌నంలోకి వెళ్లిన వాడే నాయ‌కుడు కాదు., జ‌నం స‌మ‌స్య‌లు తీర్చిన‌వాడే అస‌లైన నాయ‌కుడంటూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల్ని నోరుమెద‌ప‌కుండా చేసింది.. అయితే ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉండ‌డంతో., పోరాటానికి స్వ‌ల్ప విరామం ప్ర‌క‌టించిన ప‌వ‌ర్‌స్టార్‌., ఆ స‌మ‌యంలో కూడా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌దైన శైలిలో చొర‌వ చూపారు..

ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా అంశం ప‌క్కకు జ‌రిగిపోయిన‌ట్టు క‌న‌బ‌డుతుండ‌డం., ఈ అంశంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం చేసిన పోరాటం కూడా రెండు రోజులు బంద్ చేశామా., త‌మ ఉనికి చాటుకున్నామా అన్న చందంగానే ఉండ‌డం., స్పెష‌ల్ స్టేట‌స్ గురించి స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల‌కి అర్ధం అయ్యేలా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అభిమానులు కోరుతుండ‌డంతో., మ‌రోసారి క‌థ‌న‌రంగంలోకి దూకేందుకు జ‌న‌సేనాని రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.. వ‌చ్చే నెల‌లో రాయ‌ల‌సీమ వేదిక‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై గ‌ర్జించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.. అందుకోసం ఇప్ప‌టికే ఓ జిల్లాను కూడా పార్టీ అధినాయ‌క‌త్వం ఎంపిక చేసేసింది.. ఒక‌టి, రెండు రోజుల్లో ఎక్క‌డ‌, ఎలా అనే అంశానికి సంబంధించి పూర్తి వివ‌రాలు జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.. కాకినాడ స‌భ సంద‌ర్బంగా ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోవ‌డంతో., ఈ సారి అలాంటి త‌ప్పిదాలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాల‌ని జ‌న‌సేనాని ఇప్ప‌టికే పార్టీ వ‌ర్గాల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.. ఇక నుంచి గ్యాప్‌ల‌లో ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేస్తూనే అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించే విధంగా ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ఉండ‌బోతున్నాయి.. ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చే వ‌ర‌కు పోరాటం సాగించనున్నారు.. దీంతో పాటు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై కూడా జ‌న‌సేనాని దృష్టి సారించ‌నున్నారు..

ఇటు ప్ర‌త్యేకహోదా అంశంపై జ‌న‌సేనాని చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్‌టుడే కూడా సంత‌కాల సేక‌ర‌ణ మొద‌లుపెట్టింది.. ప‌వ‌ర్‌స్టార్ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా సంత‌కాలు చేసి ఆ కాపీల‌ను మ‌న వాట్స‌ప్ నంబ‌ర్‌కి ఫార్వార్డ్ చేయండి.. సేన స‌త్తా ఏంటో స‌ర్కారుకి చాటండి.. జ‌న‌సేనాని వెంట తామంతా ఉన్నామ‌ని తెలియ‌చెప్పండి..

Share This:

2,204 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

One comment

  1. Senaani synyam....

    Good …. Syam…Anna…tappakunda e yagnam lo mana vanthu pani manam cheddam..
    …… Jana sena……..synyam ………
    ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − two =