Home / ఎడిటోరియల్స్ / మ‌ళ్లీ పోరాటానికి జ‌న‌సేనుడు సై.. రెస్ట్ మ‌స్ట్ అంటున్న వైద్యులు.. న‌చ్చ‌జెబుతున్న పార్టీ శ్రేణులు..

మ‌ళ్లీ పోరాటానికి జ‌న‌సేనుడు సై.. రెస్ట్ మ‌స్ట్ అంటున్న వైద్యులు.. న‌చ్చ‌జెబుతున్న పార్టీ శ్రేణులు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ళ్లీ ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తారు..? నెల రోజుల తేడాతో రెండుసార్లు కంటికి ఆప‌రేష‌న్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింది..? కంటి స‌మ‌స్య ఎన్నాళ్ల‌కి త‌గ్గుతుంది..? డాక్ట‌ర్లు ఎన్నాళ్లు రెస్ట్ ఇచ్చారు..? ప‌్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌న‌సేన పార్టీ శ్రేణుల్లో మెదులుతున్న ప్ర‌శ్న‌లివి.. పార్టీ నాయ‌కులు, ఆయ‌న స‌న్నిహితుల‌తో పాటు స‌మ‌స్య గురించి తెలిసిన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ ఆరోగ్యంపై ఆందోళ‌న చెందుతున్నారు.. ఆరోగ్యాన్ని సైతం నిర్ల‌క్ష్యం చేసి., నిత్యం ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌లు అంటూ తిర‌గ‌డమే వీరి ఆందోళ‌న‌కి కార‌ణం..

ప‌వ‌న్ కంటికి స‌మ‌స్య ఎప్పుడు వ‌చ్చిందంటే..?

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌, ప్ర‌జా స‌మ‌స్య‌లపై అధ్య‌య‌నం, పోరాటం ల‌క్ష్యంగా ఇచ్చాపురం నుంచి పోరాట యాత్ర మొద‌లు పెట్టేనాటికే జ‌న‌సేన అధినేత కంటికి కురుపు వ‌చ్చింది.. పోరాట‌యాత్రకి ముందు కూడా చాలా సంద‌ర్బాల్లో కార్య‌క‌ర్త‌ల్ని క‌లిసినప్పుడు కూడా క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌నిపించారు.. ఆయ‌న ఇబ్బంది ప‌డుతున్నా, స‌మ‌స్య‌లు విన్న‌వించుకోవ‌డానికి వ‌చ్చే ప్రతి ఒక్క‌ర్నీ క‌ల‌వ‌డంతో పాటు ఫోటో ఫ్లాష్‌లు ప‌డ‌కూడ‌ద‌ని తెలిసినా., ఎవ‌ర్నీ నిరాశ‌ప‌ర్చ‌డం ఇష్టం లేని జ‌న‌సేన అధినేత‌., అందిరితో క‌ల‌సి ఫొటోల‌కి ఫోజులు సైతం ఇచ్చారు.. అయితే పోరాట యాత్ర ప్రారంభించాక ఎండ‌ల‌తో పాటు దుమ్ము దూళి, ఫోక‌స్ లైట్ల ప్ర‌భావం, వ‌ర్షానికి త‌డ‌వ‌డంతో పాటు పూలు, కుంకుమ లాంటివి కంట్లో ప‌దే ప‌దే ప‌డుతుండ‌డంతో ఇన్ఫెక్ష‌న్ బాగా పెరిగిపోయింది.. అయినా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి చ‌లించిన జ‌న‌సేనాని., వారు ప‌డే క‌ష్టం ముందు త‌న ఇబ్బందిని ప‌ట్టించుకోలేదు.. ముఖ్యంగా వంశ‌ధార నిర్వాసితుల నుంచి అర‌కు గిరిజ‌నుల దుస్థితి వ‌ర‌కు వారి ఇబ్బందులు చూసి., క‌న్ను ఇబ్బంది పెడుతున్న విష‌యాన్ని అశ్ర‌ద్ద చేశారు.. స‌మ‌స్య జ‌ఠిల‌మ‌య్యాక గానీ మొద‌టి విడ‌త ఆప‌రేష‌న్‌కి వెళ్ల‌లేదు..

వైద్యుల సూచ‌న పాటించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆప‌రేష‌న్‌..?

మొద‌టి విడ‌త శ‌స్త్ర చికిత్స అనంత‌రం కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని జ‌న‌సేన అధినేత‌కి వైద్యులు సూచ‌న చేశారు.. అయితే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ద‌గ్గ‌ర‌గా చూసిన ఆయ‌న‌., పోరాట యాత్రకి ఎక్కువ రోజులు విరామం తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.. పార్టీ నేత‌లు, స‌న్నిహితులు వ‌ద్దంటున్నా., వెంట‌నే మ‌ళ్లీ ప్ర‌జాప‌ధం ప‌ట్టారు.. కంటికి ఆప‌రేష‌న్ జ‌రిగింది.. ఎండ‌లోకి వెళ్ల రాదు..? దుమ్ము దూళిలో తిర‌గ‌రాదు..? వ‌ర్షానికి త‌డ‌వ‌రాదు..? ఇందులో ఏ ఒక్క సూచ‌న‌ని జ‌న‌సేన అధినేత పాటించిన దాఖ‌లాలు లేవు.. త‌న కోసం వేచిచూస్తున్న పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల కోసం వాన‌ల్లో త‌డుస్తూనే ముందుకి సాగారు.. హార‌తులు కంటికి ఇబ్బంది క‌లిగిస్తున్నా., ఆడ‌ప‌డుచుల ఆప్యాయ‌త ముందు త‌న నొప్పి ఎక్కువ కాద‌నుకున్న‌ట్టు ఎవ‌ర్నీ ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.. వీర తిల‌కాలు దిద్దినా స్వీక‌రించారు.. పూలు జ‌ల్లుతుంటే., ఆ రెక్క‌లు కంటిలో ప‌డి మండుతున్నా., ఆ బాధ‌ని తానే భ‌రిస్తూ పైకి మాత్రం చిరుద‌ర‌హాసాన్నే చిందించారు..

వైద్యుల సూచ‌న మేర‌కు విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో పాటు మ‌ళ్లీ కంటికి ఇన్ఫెక్ష‌న్ త‌గ‌ల కుండా క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోలేదు.. కార‌ణం తాను ఎక్క‌డ ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టాల్సి వ‌స్తుందోన‌న్న ఆలోచ‌నే.. దీంతో ప‌శ్చిమ టూర్‌లో స‌మ‌స్య మ‌ళ్లీ తిర‌గ‌బెట్టింది.. కంటికి మ‌ళ్లీ కుద‌ప వ‌చ్చింది.. ఫ‌లితం మ‌రోసారి శ‌స్త్ర చికిత్స చేయాల్సి వ‌చ్చింది.. ఈ సారి వైద్యులు కాస్త గ‌ట్టిగానే చెప్పారు.. క‌నీసం ఈ సారైనా త‌గినంత విశ్రాంతి తీసుకోమ‌ని..

ప‌వ‌న్ ఆరోగ్యం ప‌ట్ల పార్టీ నాయ‌కులు, శ్రేణుల్లో ఆందోళ‌న‌..
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కంటికి నెల రోజుల తేడాతో రెండుసార్లు ఆప‌రేష‌న్ చేయాల్సిరావ‌డంతో అటు పార్టీ శ్రేణులతో పాటు ఇటు నాయ‌కులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ప‌దే ప‌దే ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌న్న‌దే వారి టెన్ష‌న్‌కి కార‌ణం.. వాస్త‌వానికి వైద్యుల సూచ‌న పాటించి ఉంటే ఈ స‌మ‌స్య తిరిగి ఉత్ప‌న్న‌మ‌య్యేది కాదు.. కానీ క‌ల‌లో కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల్నే క‌ల‌వ‌రిస్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఎక్కువ రోజులు వారికి దూరంగా ఉండ‌డానికి స‌సేమిరా అన్నారు.. దీంతో మ‌రోసారి ఆప‌రేష‌న్ ప‌రేషాన్ త‌ప్ప‌లేదు.. అయితే తాజాగా రెండోసారి ఆప‌రేష‌న్ త‌ర్వాత కూడా ప‌వ‌న్ వైద్యుల సూచ‌న పాటించేందుకు సిద్ధంగా లేరు.. శ‌స్త్ర‌చికిత్స తాలూకు నొప్పి, పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల అనంత‌రం పూర్తి స్థాయిలో త‌గ్గిన త‌ర్వాతే బ‌య‌టికి వెళ్ల‌మ‌ని వైద్యులు హెచ్చ‌రించారు.. అయితే ఆయ‌న మాత్రం మ‌ళ్లీ పోరాట యాత్ర‌కి సిద్ధ‌మ‌వుతున్నారు..

జ‌న‌సేన అధినేత తీరు ప‌ట్ల పార్టీ నాయ‌కులు, శ్రేణులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.. శ‌రీర భాగాల్లో క‌న్ను ఎంత సున్నిత భాగ‌మో అందిరికీ తెలిసిన విష‌య‌మే.. అలాంటి క‌న్నుకి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి., కానీ ప‌వ‌న్ మాత్రం త‌న కంటికంటే కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల్నే ఎక్కువ‌గా చూస్తున్నారు.. ఈ ప‌రిస్థితి పార్టీ నాయ‌కులు, ఆయ‌న స‌న్నిహితులని ఆందోళ‌న‌కి గురిచేస్తోంది.. మీరు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే బ‌య‌టికి రావాలన్న‌దే ప్ర‌తి కార్య‌క‌ర్త అభిమ‌త‌మ‌ని న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.. కార్య‌క‌ర్త‌లు సైతం ఆయ‌న పూర్తిగా కోలుకోవాల‌నే మొక్కులు మొక్కుతున్నారు.. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో..? వైద్యుల సూచ‌న పాటిస్తారా..? మ‌ళ్లీ జ‌నం జ‌నం అంటూ బ‌య‌టికి వ‌చ్చేస్తారో వేచిచూడాలి..

Share This:

3,660 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 12 =