Home / పవన్ టుడే / మ‌హాత్మా..! వ్యక్తిత్వంలో లక్షో వంతు అయినా ఈ నాయ‌కుల‌కివ్వు- జ‌న‌సేనాని

మ‌హాత్మా..! వ్యక్తిత్వంలో లక్షో వంతు అయినా ఈ నాయ‌కుల‌కివ్వు- జ‌న‌సేనాని

జాతి పిత మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఘ‌నంగా నివాళులు అర్పించారు.. మ‌హాత్ముని జీవిత విలువ‌ల్ని అంతా అర్ధం చేసుకోవాల‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. గాంధీ మ‌హాత్ముని జీవితం., పాటించిన విలువ‌లు, న‌మ్మిన సిద్ధాంతాలు., ఈ దేశంలో మ‌రో వ్య‌క్తిలో చూడ‌లేమ‌ని జ‌న‌సేనాని వ్యాఖ్యానించారు.. గాంధీజీ జీవితంలో పాటించిన విలువ‌ల్లోని ఔన్న‌త్యాన్ని అర్ధం చేసుకునేందుకు అంతా ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు.. గాంధీ జ‌యంతి సంద‌ర్బంగా మ‌హాత్మునికి నివాళులు అర్పించిన ఆయ‌న‌., మ‌హాత్ముని ఆశ‌యాల ప్ర‌భావ‌మే నేడు జ‌న‌సేన పార్టీ ఏడు సిద్ధాంతాల‌పై ఉంద‌న్నారు..

అవినీతిపై రాజీలేని పోరాటం, కులాల్ని క‌లిపే ఆలోచ‌నా విధానం, మ‌త ప్ర‌స్థావ‌న లేకుండా రాజ‌కీయం చేయ‌డం., వ‌ర్త‌మాన స‌మాజానికి ఇవ్వాల‌నుకున్న సిద్ధాంతాలు గాంధేయ విధానాల‌ను వెల్ల‌డిస్తాయ‌న్నారు.. రాజ‌కీయం అంటే ప్ర‌జా సేవ అన్న భావ‌నను తుంగ‌లోతొక్కి., రాజ‌కీయం అంటే కోట్ల రూపాయిల వ్యాపారం అన్న చందంగా నేటి నాయ‌కులు మార్చేశార‌ని జ‌న‌సేనాని అన్నారు.. అవినీతి, దౌర్జ‌న్యాల‌తో వ‌ర్గ పోరు సృష్టించి ఎద‌గాల‌నుకుంటున్నారన్నా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఇలాంటి నాయ‌కుల్ని చూస్తే నీ వ్య‌క్తిత్వంలో ల‌క్షోవంతు అయినా వారికి ఇవ్వు మ‌హాత్మా అని వేడుకోవాల‌ని పిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు..

Share This:

679 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × four =